Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుమోలు ఇంటికెళ్తే… ఆమె అక్కినేని కోడలు ఎలా అవుతుంది..?!

November 12, 2024 by M S R

.
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న మీనాక్షి చౌదరి ? ఈ టైటిల్‌తో బోలెడు వార్తలు కనిపిస్తున్నాయి… ఏమిటయ్యా అంటే… తెలుగు, తమిళంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరిని తెలుగు నటుడు, అక్కినేని కుటుంబ సభ్యుడు సుశాంత్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అని…

సరే, వాళ్లు కూడా ఖండించినట్టు లేదు… అర్ధాంగీకారం కావచ్చు… లేదా ఏమైనా రాసుకోనీలే అనే భావన కావచ్చు… సుశాంత్‌కు ఇప్పటికే 38 ఏళ్లు దాటినట్టున్నాయి… ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలాగా..! సో, పెళ్లికి త్వరపడటంలో అర్థముంది…

ఐతే ఎటొచ్చీ… సుశాంత్‌కు ఆమె భార్య అవుతే అక్కినేని ఇంటి కోడలు ఎలా అవుతుంది..? సుశాంత్ అక్కినేని సుశాంత్ కాదు… వాళ్ల ఇంటిపేరు అనుమోలు… తండ్రి అనుమోలు సత్యభూషణరావు… ఆయన తండ్రి ఏవీ సుబ్బారావు గతంలో నిర్మాత… సో, ఆ కుటుంబానికి ఇండస్ట్రీ చరిత్రలో స్థానముంది… మరి అక్కినేని ఇంటి కోడలు ఎలా అవుతుంది..? అనుమోలు ఇంటి కోడలు అవుతుంది…

Ads

సుశాంత్ తల్లి అక్కినేని ఇంట్లో పుట్టింది… నాగ సుశీల… నాగేశ్వరరావు బిడ్డ, నాగార్జున సోదరి… ఆమె అనుమోలు ఇంటి కోడలుగా వెళ్లింది… ఆమే కాదు, ఆమె సోదరి సత్యవతి కొడుకు సుమంత్… ఇంటిపేరు యార్లగడ్డ… అంతేతప్ప తను కూడా అక్కినేని సుమంత్ కాదు…

నాగచైతన్య అక్కినేనిని ఇంటిపేరుగా పెట్టుకోవచ్చు… తల్లి దగ్గుబాటి ఫ్యామిలీలో పుట్టినా… ఆమెకూ నాగార్జునకు పుట్టిన కొడుకు కాబట్టి..! ఈ ఇంటిపేర్ల చర్చ అప్పట్లో నందమూరి సుహాసిని ఎన్నికల్లో నిలబడినప్పుడు వచ్చింది… ప్రియాంక వాద్రా గాంధీ పేరు పెట్టుకోవడంపైనా వచ్చింది… కల్వకుంట్ల కవిత పేరూ అంతే… ఈ చర్చ ఇలాగే కొనసాగుతుంది…

ఆడవాళ్లు అత్తింటికి వెళ్తే పుట్టింటి పేరు వదిలేయాలా, తమ ఇష్టం రీత్యా కొనసాగించుకవచ్చా..? అదొక ఎడతెగని చర్చ… సరే, నేములోనేముంది అనుకోవచ్చుగాక… ఇంతకీ ఎవరీ మీనాక్షి చౌదరి..? అదే సుశాంత్ చేసుకోబోతున్నాడు అంటున్న నటి…

మొన్నీమధ్య అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ వీకెండ్ షోలో కనిపించింది… ఆమె నటించిన లక్కీ భాస్కర్ ప్రమోషన్‌ కోసం దుల్కర్‌తో పాటు వచ్చింది… తెలుగు, తమిళ తెరలకు కొత్తేమీ కాదు… కానీ పెద్దగా క్లిక్కయిన సినిమాలు ఏమీ లేవు… మొన్నటి లక్కీ భాస్కర్ తప్ప..!

ఆమె నేపథ్యం ఏమిటంటే..? హరియాణాలోని పంచ్ కులాలో పుట్టింది… డెంటిస్టు… మయన్మార్- యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ విజేత… తరువాత  ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని, 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ను అందుకుంది…

సుశాంత్‌తో ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమా చేసింది… అప్పుడే పరిచయం… తరువాత బంధం బలపడినట్టుంది… వరుణ్ తేజతో మట్కా చేస్తోంది ఇప్పుడు… మరి సుశాంత్..? 2008 నుంచీ తిప్పలు పడుతున్నాడు… బలమైన కుటుంబ నేపథ్యం ఉంది… సపోర్ట్ ఉంది… ఐనా సరే ఇప్పటికి ఆరేడు సినిమాలు… ఇక లాభం లేదని హీరోయేతర పాత్రలకు మళ్లాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భార్యా రూపవతీ శత్రుః….. కాదు, కాదు… భర్తా రూపవాన్ శత్రుః…
  • అయ్యో, తమ్ముడూ… ఎమోషన్, యాక్షన్ రెండూ ‘లయ’తప్పాయి..!!
  • Walk Of Fame Star… ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దీపిక ‘కొనుక్కుందా..?!
  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions