.
మొన్నటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకొచ్చాడు… రేవంత్ రెడ్డికి పొగ పెట్టడానికి విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని… చివరకు తనను మార్చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయ సేకరణ కూడా హైకమాండ్ జరిపించింది అని…
గ్యాప్ కనిపిస్తోంది… రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే హైకమాండ్‌కూ రేవంత్ రెడ్డికీ నడుమ బాగానే గ్యాప్ ఉందని… రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఫిర్యాదులను హైకమాండ్ ఎంటర్‌టెయిన్ చేస్తున్నదీ అని… ఆల్రెడీ కొందరు మంత్రుల శాఖల జోలికి సాక్షాత్తూ సీఎం అయినా సరే వెళ్లకూడదనే ఆంక్షలే విచిత్రం కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కూడా హైకమాండే చేయడం మరో విచిత్రం…
Ads
ఇవన్నీ తెలిసి, అర్థం చేసుకున్నాకే… పదవి ఉంటే ఉంది, పోతే పోయింది అనుకుని రేవంత్ పూర్తిగా మారిపోయాడనీ, తన పనితీరు మార్చుకుని కఠినంగా ఉండటం నేర్చుకున్నాడని రాధాకృష్ణ బాష్యం… నిజంగానే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగానే మారుతున్నట్టుంది…
పాశమైలారం దుర్ఘటన స్థలానికి ఆమె స్వయంగా వెళ్లడం దేనికి..? పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అంటే మంత్రీ కాదు, ముఖ్యమంత్రీ కాదు కదా… ఆమెకూ తెలంగాణ సమాజానికీ సంబంధం లేదు, ఆమెకు ఎవరూ వోటు వేయలేదు… మరి ఏమిటీ వైఖరి..?
నిజంగానే పాశమైలారం దుర్ఘటన జరిగిన వెంటనే మంత్రులు వెళ్లారు, సహాయక చర్యలు కనుక్కున్నారు, తరువాత సీఎం వెళ్లాడు… పరిహారాలు ప్రకటించాడు… ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తూనే ఉంది… మరి అక్కడికి మీనాక్షి ఎందుకు వెళ్లడం..? పార్టీ వ్యవహారాలకూ ప్రభుత్వ యంత్రాంగం విధికీ ఏమిటి సంబంధం..?
ఇలాంటివన్నీ కాంగ్రెస్ పార్టీకి వోటేసిన జనంలో ఓరకమైన అసంతృప్తికి గురిచేయడమే… ఒకవైపు బీజేపీ పుంజుకుంటోంది… బీఆర్ఎస్ పలు ప్రభుత్వ అడుగులు, నిర్ణయాలపై ముప్పేట దాడి చేస్తోంది… ఆ రెండు పార్టీలనూ ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు… ఈ స్థితిలో హైకమాండ్ వైఖరి ఆశ్చర్యంగా ఉంది…
పోనీ, రేవంత్ రెడ్డిని పక్కన పెడితే కాంగ్రెస్ సాధించేది ఏముంది..? అసలే అరకొర మెజారిటీ… పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కారణం కాదా..? కేసీయార్ మీద వ్యతిరేకతకు తోడు రేవంత్ రెడ్డి ఆల్టర్నేటివ్‌గా కనిపించడం కూడా అధికార సాధనకు ఓ కారణం కాదా..? మరెందుకు హైకమాండ్ తనను తేలికగా తీసిపారేస్తోంది…
ఈ సమాంతర ప్రభుత్వ నిర్వహణ ఏమిటి..? అదే ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చనీయాంశం… రాధాకృష్ణ ప్రస్తావించిన అంశాలు తెలంగాణ వర్తమాన రాజకీయాల కోణంలో విలువైనవే..!! ఏదో లోలోపల రగులుతూ ఉన్నట్టుంది..!!
Share this Article