Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!

April 1, 2026 by M S R

.

ఇది దురంధర్ 2 సినిమా చూసినవారికే అర్థమవుతుంది… సినిమాలో రాకేష్ బేడీ పోషించిన పాత్ర హైలైట్ అవుతోంది… తను పోషించిన ఆ పాత్ర పేరు జమీల్ జమాలి… సినిమా చివరలో ఈ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా ఉండదు… ఓ ఇండియన్ స్పైగా దశాబ్దాల క్రితమే పాకిస్థాన్ వెళ్లి, అక్కడి రాజకీయ వర్గాల్లో చేరి, పలుకుబడి పెంచుకుని, ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ పర్సనాలిటీగా మారతాడు…

సినిమాలోని ఏ పాత్ర పాకిస్థాన్‌లో ఎవరిని ఉద్దేశించింది..? ఇప్పుడు ఇండియాలోకన్నా పాకిస్థాన్‌లోనే పెద్ద చర్చ… రకరకాల ఊహాగానాలు… అలాగే జమీల్ జమాలి పాత్ర పాకిస్థానీ రాజకీయ నాయకుడు నబీల్ గబోల్ ఆధారంగా రూపొందించబడిందని ప్రచారం జరుగుతోంది…

Ads

సినిమాలో జమీల్ జమాలి ముంబై పేలుళ్ల ప్రధాన సృష్టికర్త, పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు స్లో-పాయిజన్ ఇస్తాడు… దానివల్లే బడేసాబ్‌గా పిలవబడే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యం పాలై మంచానికే పరిమితం అయిపోతాడు… ఈ ప్రచారం నేపథ్యంలో నబీల్ గబోల్ స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు…

‘‘దావూద్ ఇబ్రహీంతో నాకసలు పరిచయమే లేదు… అతను కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో ఉన్నట్లు కూడా నాకు తెలియదు… ఆ ప్రాంతం నా ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉన్నా, నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు కూడా… సినిమాలో తనను (జమీల్ జమాలీ పాత్రను) చూపించిన విధానంపై గబోల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు…

నిజ జీవితంలో నేను ధైర్యవంతుడిని… కానీ సినిమాలో దాన్ని సరిగ్గా చూపలేదు… కరాచీలోని లయారీ (Lyari) ప్రాంతాన్ని ఉగ్రవాద కేంద్రంగా చూపడం కూడా తప్పు… లయారీ ఉగ్రవాద కేంద్రం కాదు… నిజంగా ఎవరైనా భారతీయ ఏజెంట్ అక్కడికి వస్తే, ప్రాణాలతో తిరిగి వెళ్లలేరు….’’ అంటున్నాడు తను…

సింపుల్‌గా ఆ పాత్ర నాది కాదు అని చెప్పేస్తే సరిపోయేది కదా… కానీ పరోక్షంగా అది తనే అన్నట్టుగా వ్యాఖ్యానించడం ఇంట్రస్టింగ్… ఎందుకంటే..? నన్ను ధైర్యవంతుడిగా చూపించలేదు అంటున్నాడంటే అది నేనే అని అంగీకరించినట్టే కదా… ఏ స్పై కూడా అలా అంగీకరించడు, అంగీకరించి పాకిస్థాన్‌లో ఉండలేడు… ఇంతకీ ఈ నబీల్ ఎవరు..?

కొంతకాలం మంత్రిగా కూడా చేసిన నబీల్ పలు సందర్భాల్లో వివాదాస్పదుడే… ఈ కుటుంబానికి ముంబైతో చాలా లోతైన చారిత్రక, రాజకీయ సంబంధం ఉంది… నబీల్ గబోల్ తాత అల్లా బక్ష్ గబోల్ (Allah Bakhsh Gabol) అవిభక్త భారతదేశంలో ముంబైకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు…  ఈయన 1930వ దశకంలో (స్వాతంత్ర్యానికి పూర్వం) బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కు రెండుసార్లు మేయర్‌గా ఎన్నికయ్యాడు… అప్పట్లో బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా సభ్యుడు…

దేశ విభజన తర్వాత ఈ కుటుంబం కరాచీకి వెళ్లి అక్కడ స్థిరపడింది… కరాచీలోని ‘లయారీ’ ప్రాంతం వారి రాజకీయ కోటగా మారింది… అక్కడ రెండుసార్లు మేయర్ అయ్యాడు… ఈ గబోల్ అనేది బలూచ్‌కు చెందిన ఓ తెగ పేరు… సర్దార్ అని పిలిపించుకుంటారు… ఇదే కుటుంబానికి చెందిన అబ్దుల్ సత్తార్ జుల్ఫీకర్ అలీ భుట్టోకు సన్నిహితుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు…

నబీల్ తండ్రి సర్దార్ ఖాన్ అహ్మద్ ఖాన్ ఓ వ్యాపారి… లయారీలోనే పుట్టిపెరిగిన నబీల్, తన సోదరులు ఒమన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు… మస్కట్ బేస్డ్ వ్యాపారం వాళ్లది… నబీల్ ఒమన్ పౌరసత్వంపై వివాదం తలెత్తడంతో చాన్నాళ్ల తరువాత ఆ పౌరసత్వాన్ని వదులుకున్నాడు… అటూఇటూ పార్టీలు మారుతుంటాడు… ఇదీ తన కథ…

తనను దురంధర్-2 సినిమాలో సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు కాబట్టి, ల్యారీ కా గబ్బర్ పేరుతో తనే దురంధర్-3 సినిమా తీస్తానని చెబుతున్నాడు...!!

చెప్పనే లేదు కదా… సినిమా చివరలో కథానాయకుడు రణబీర్‌సింగ్ ‘నేను దావూద్ ఇబ్రహీంను చంపలేకపోయాడు’ అని బాధపడతాడు… ‘రా రూపొందించిన ఓ విషపు బాండ్ ఎయిడ్‌ను దావూద్ చేతికి అంటించాలని ఓసారి ప్రయత్నిస్తాడు కూడా… దావూద్‌ను స్లోపాయిజన్ ద్వారా మంచానికి పరిమితం చేసింది తనేనని చెబుతూ… జమీల్ జమాలి ‘‘అలాంటివాడిని ఒకేసారి చంపితే అది శిక్ష ఎలా అవుతుంది… నరకం చూడాలి కదా’’ అంటాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొదుపు వేరు- పిసినారితనం వేరు… శృతిమించితే పెళ్లామే వదిలేస్తుంది…
  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!
  • ఓ లయబులిటీ..! KCR వదిలించుకుంటే కాంగ్రెస్ నెత్తిన మోస్తోంది..!!
  • మన సుబ్రహ్మణ్యానికి మలయాళీలు చూపిన అరుదైన గౌరవం..!!
  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…
  • విద్వేష బిల్లుపైనా అదే పింక్ విషం..! సుప్రీం చెప్పిందేమిటో తెలుసా…!!
  • జనగణనలో ‘సహజీవనాని’కీ గుర్తింపు… కానీ అది పెళ్లి సర్టిఫికెట్ కాదు…
  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!
  • కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions