1999 ఎన్నికల్లో దేశంలో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం బళ్ళారి…. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ మీద బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ పోటీ చేయడం…
పోటీ నువ్వా నేనా అనే విధంగా సాగింది… బళ్ళారి ప్రజల త్రాసు కొద్దిగా సోనియా వైపే మొగ్గింది ( నాకు గుర్తున్నంతవరకూ 60 /70 వేల మెజారిటీ )… కొసమెరుపు…… కేవలం 15 రోజుల్లో కన్నడ భాష నేర్చుకొని సుష్మా స్వరాజ్ కన్నడంలో మాట్లాడి అక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది…
ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తరువాత 20 ఏండ్ల పాటు కర్నాటక నుండి తన దగ్గరకు ఎవరు వచ్చినా కూడా కన్నడంలోనే మాట్లాడేవారు అట ఆమె… ( హిందీ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం లేని వాళ్ళతో)… అక్కడ గెలిచిన సోనియా గాంధీ ఆ స్థానానికి రాజీనామా చేసి అమేధికి వెళ్ళిపోయింది… చాన్నాళ్లు సుష్మా స్వరాజ్ బళ్లారితో టచ్‌లోనే ఉంది…
Ads
ఇప్పుడు పాతికేళ్ల తరువాత అందరి కళ్లూ వయనాడ్ నియోజకవర్గం వైపు తిరిగాయి… అక్కడ కూడా బై పోల్ ఉంది కదా… ఇక్కడ గెలిచిన రాహుల్ గాంధీ రాయబరేలిని ఉంచుకుని, దీన్ని వదిలేశాడు… ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ కూతురు, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా అభ్యర్థి ….
బిజెపి నుండి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు… ఆమె మలయాళీయే… బయటి వ్యక్తి కాదు… ఇక ప్రియాంక వాద్రా నేపథ్యం అందరికీ తెలిసిందే… అమ్మ …సోదరుడు, నాన్న… నానమ్మ… బాబాయ్ …పిన్ని… నానమ్మ భర్త తాతయ్య… నానమ్మ తండ్రి ముత్తాత… అందరూ దేశంలో అనేక పదవుల్లో ఉండి ఉన్నవారే కదా… అందరికీ తెలిసిన కుటుంబమే… మరి ఈ నవ్య హరిదాస్ ఎవరు..?
ముస్లిం వోట్ల మద్దతుతో బలమైన కాంగ్రెస్ అభ్యర్థిగా కనిపిస్తున్న ప్రియాంక వాద్రా మీద పోటీకి రెడీ అంటున్నదంటీ బీజేపీకి ఆమె మీద ఉన్న నమ్మకం విశేషమే… నవ్య హరిదాసు వ్యక్తిగత వివరాలకు వస్తే… తను మెకానికల్ ఇంజనీరింగులో బీటెక్ చేసింది … 2007లో బీటెక్ పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చింది… కోజికోడ్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైంది…
కార్పొరేషన్లో బీజేపీ పక్ష నేతగా కొనసాగుతున్నది… బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…. 2021లో జరిగిన కోజికోడ్ సౌత్ నియోజవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా కూడా ఆమె పోటీ చేసింది… మంచి వక్త… అనేక విషయాల మీద చక్కటి అవగాహన ఉంది… చూడాలిక వయనాడ్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది… అఫ్కోర్స్, ఇక్కడ ముస్లిం జనాభా చాలా ఎక్కువ…
చెప్పనే లేదు కదూ… ఇండి కూటమి లేదు, ఆ సయోధ్యలు, పొత్తులు, అవగాహనలు ఇక్కడేమీ లేవు… సీపీఐ ఇక్కడ తన అభ్యర్థిగా 71 ఏళ్ల సీనియర్ నాయకుడు, గతంలో ఎమ్మెల్యే సత్యన్ మొకెరీని ప్రకటించింది… వయనాడ్ ఏరియాలో పట్టున్న నాయకుడే… సో, పోటీ రసవత్తరమే… (నారపరాజు నరసింగరావు)
Share this Article