.
బిగ్‌బాస్ సీజన్‌కు కొత్త హోస్ట్ రాబోతున్నాడు… నందమూరి బాలకృష్ణను తీసుకురావడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారు… తను కాకపోతే బహుశా రానా వస్తాడేమో……… ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి ఈమధ్య…
ఎందుకు..? నాగార్జున ఫెయిలైనట్టే అని బిగ్‌బాస్ ఆర్గనైజర్లు భావిస్తున్నారా..? అందుకే ఇక నువ్వు చాలు, మాకో కొత్త హోస్ట్ కావాలి అని చెప్పేశారా..? అసలు ఇదే నమ్మదగిందిగా లేదు… బిగ్‌బాస్‌కు మొదట్లో జూనియర్ ఎన్టీయార్, తరువాత నాని హోస్ట్ చేశారు… బాగానే చేశారు గానీ…
Ads
అదొక ఒత్తిడి, టీవీ లేదా ఏదైనా రియాలిటీ షో హోస్ట్ చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు… ఎంత స్క్రిప్టెడ్ షో అయినా సరే, స్పాంటేనిటీ చాలా సందర్భాల్లో అవసరం,.. మాట తీరు కూడా ముఖ్యమే… అన్నింటికీ మించి ఓ స్ట్రేచర్ కావాలి…
రోజుల తరబడీ ఓ హౌజులో బందీ అయ్యేవాళ్ల మనస్థితిని బట్టి, తత్వాల్ని బట్టి ఓ గుంపును హ్యాండిల్ చేయాలి… అన్‌స్టాపబుల్ వేరు, ఒకరిద్దరు గెస్టులే కాబట్టి చల్తా… జూనియర్, నాని తరువాత వరుసగా నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు… ఇతర భాషల్లో కూడా ఎడాపెడా బిగ్‌బాస్ హోస్ట్‌లను మార్చడం లేదు… వాళ్లంతట వాళ్లు వద్దని దూరం జరిగితే తప్ప…
నాగార్జున ఫెయిల్యూర్ అనేది ఉండదు, ఎందుకంటే తను ఫెయిలైతే అది ఆ స్క్రిప్టు రాసిన టీమ్ ఫెయిల్యూర్… నాగార్జున హోస్ట్ కావడం మరో అడ్వాంటేజ్ ఏమిటంటే..? అన్నపూర్ణ స్టూడియోలో సెట్ ప్లస్ ఈయన హోస్ట్… కాంబో రిబేట్లు కూడా అడగొచ్చు… హహహ…
సరే, నాగార్జున తనంతట తనే తప్పుకుంటే..? అప్పుడే మరో హోస్ట్ కావాలి, ఎవరనే ప్రశ్న తలెత్తుతుంది… బాలయ్యే అనుకుందాం… బాలయ్య ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ షోతో బాగా పాపులరయ్యాడు, తనలోని మరో నటకోణం చూపిస్తున్నాడు… సరదాగా… ఆ షో రక్తికట్టించాడు… కానీ ఓ దశలో అసలు ఎవరూ గెస్టులుగా వస్తామని సిద్ధపడని సిట్యుయేషన్… కారణాలు తెలియవు…
ఆ తరువాత షో ఆగిపోయింది… పైగా బాలకృష్ణ హోస్ట్‌గా వస్తే బ్యాగేజీతో వస్తాడు… తను టీడీపీ… అసలే ఏపీ పాలిటిక్స్‌లో వైసీపీ, కూటమి సోషల్ మీడియా టీమ్స్ నడుమ యుద్ధమే జరుగుతోంది… బాలకృష్ణ హోస్టింగ్ చేస్తే బిగ్‌బాస్‌ను వైసీపీ టార్గెట్ చేసే ప్రమాదమూ ఉండొచ్చు… అక్కడున్న పాలిటిక్స్ అలాంటివి…
గతంలో ఒకటీరెండు చిట్‌చాట్ షోలు చేసిన రానా బెటరే… కానీ చేయడానికి సిద్ధపడతాడా అనేదే ప్రశ్న… నాగార్జున అలవాటైపోయాడు… తనకూ పెద్ద సినిమాల్లేవు, ఎంచక్కా బిగ్‌బాస్‌తో డబ్బుకుడబ్బు, టైంపాస్…
నిజానికి బిగ్‌బాస్ సమస్య హోస్టింగ్ కాదు… ఆ క్రియేటివ్ టీమ్ ఫెయిల్యూర్… గత రెండుమూడు సీజన్లు అట్టర్ ఫ్లాప్ కావడానికి ఈ టీమే కారణం… కొత్తగా ఆలోచించలేకపోవడం, కంటెస్టెంట్ల ఎంపికలో లోపాలు, షో రక్తికట్టే టాస్కులు, గేములు లేకపోవడం… లాస్ట్ సీజన్ అయితే రెవిన్యూపరంగా కూడా ఫ్లాపే అని వినికిడి…
అంతకుముందు సీజన్ ఏదో లోకల్ టీమ్‌కు నిర్వహణ అప్పగించి చేతులు కాల్చుకుని, మొన్నటి సీజన్‌కు ముంబై టీమ్ దింపారట… కానీ అదనపు ఫాయిదా ఏమీ రాలేదు, పెనం మీద నుంచి పొయ్యిలో పడటం తప్ప..!
అసలే భారీ వ్యయం… సో, ఎంత క్రియేటివ్‌గా ప్లాన్ చేస్తే అంత బెటర్… చివరలో సూట్‌కేసు తీసుకుని వెళ్లిపో అనే తంతు ఓ దరిద్రం… మరిక విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఇంత అని ఖరారు చేయడంలో తెలివి ఏమున్నట్టు..? ఇలాంటివి లోపాలు సరిదిద్దుకుంటే… హోస్టింగుదేముంది..? నాగార్జున గాకపోతే ఇంకొకరు దొరకొచ్చు… ప్యాకేజీని బట్టి..!!
Share this Article