.
నార్సిసిస్ట్… నార్సిసిజం… నార్సిసిస్టక్… ఓరకమైన మానసిక వైకల్యం… తెల్లారిలేస్తే జగన్ మీద విషం కక్కే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈసారి మరింత వెటకారాన్ని, విమర్శను దట్టించి రాశాడు… జగన్ ఓ పేద్ద నార్సిసిస్ట్ అని… (నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic Personality Disorder – NPD) అనేది మానసిక ఆరోగ్య సమస్య)…
దానికి బోలెడు కారణాలు ఏకరువు పెట్టాడు… అదంతా చదువుతూ ఉంటే… రాధాకృష్ణ కదా, అలాగే రాస్తాడు, ఏం చంద్రబాబు వైకల్యం గురించి ఎప్పుడైనా ఒక్క పదం రాశాడా అనిపిస్తుంది… ఎందుకంటే..? మైక్రోసాఫ్ట్ నేనే పెట్టాను, హైదరాబాద్ నేనే కట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, మొబైల్ నా సృష్టే వంటి అనేక తిక్క వ్యాఖ్యలకు చంద్రబాబు కదా ప్రసిద్ధి… ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ సకల చరాచర జగత్తు క్రియేటర్‌నే నేను అన్నట్టు ఉంటాయి… సైకిక్, సారీ, సైకలాజికల్ పారిభాషిక పదాల్లో ఈ వ్యాధిని ఏమంటారో తెలియదు…
Ads
- బట్… రాధాకృష్ణ వ్యాసంలో కొన్ని తప్పకుండా గుర్తించాల్సినవి, అంగీకరించాల్సినవి కొన్ని పాయింట్లు ఉన్నాయి… అవి నార్సిసిజమో కాదో తెలియదు గానీ… మొంథా తుపాన్ చంద్రబాబు సృష్టి (మ్యాన్ మేడ్) అని జగన్ చేసిన వ్యాఖ్య చిల్లరగా ఉంది… దీన్ని చంద్రబాబు వ్యతిరేకులు కూడా అంగీకరించే వాస్తవం… మరీ టీవీ5, మహాన్యూస్ పిచ్చి భజనలు అవసరం లేదు గానీ… ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు చంద్రబాబు బాగా కష్టపడతాడు జనాన్ని ఆదుకోవడంలో…
అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తాడు… అది అనేకసార్లు రుజువైంది కూడా… మొంథా సమయంలో జగన్ ఎక్కడున్నాడు..? తను రాష్ట్రంలోనే లేడు, బెంగుళూరులో ఉన్నాడు… తుపాన్ కాస్త వెలిశాక వచ్చి, చంద్రబాబును తిట్టేసి వెళ్లిపోయాడు… ఈ నిర్వాకానికి సాక్షిలో ‘ముఖ్యమంత్రిగా లేకపోయినా తుపాన్ నుంచి ప్రజల్ని కాపాడిన ఏకైక మగాడు’ అని రాయించుకుని, కూయించుకోవడం ఓ వైకల్యమే…
- మహా న్యూస్ వంశీకి, టీవీ5 సాంబకూ… సాక్షి బాధ్యులకు తేడా ఏముందని..? వాళ్లకన్నా పిసరంత ఎక్కువ పైత్యమే కాదా…!! సరే, ఏపీ పాలిటిక్స్‌లో అందరూ అందరే… ఒకడు ఒక టైపు, మరొకడు మరో టైపు… తరచి చూస్తే అన్నీ ఒకేతరహా వైకల్యాలే కదా…! పార్టీలు, నాయకులు, మీడియా, కేడర్… ఎవరూ మినహాయింపు కాదు…
చంద్రబాబు తక్కువ అని కాదు… కానీ జగన్ అతి చేశాడు… ఒక పాలకుడు ఎలా ఉండకూడదో చూపించాడు… ప్రజాప్రతినిధులకు టైమ్ ఇవ్వడు, బయటికి వెళ్తే చుట్టూ పరదాలు… ప్రజల్ని కలిసిన సందర్భాలు మరీ అరుదు… ప్రెస్ మీట్లు ఉండవు… హద్దు రాళ్లపై, పాసు పుస్తకాలపైనా తన బొమ్మలే.,. ఊళ్లల్లో కనిపించిన ప్రతి నిర్మాణానికీ, చివరకు శ్మశానాల గోడలకూ పార్టీ రంగులే… ఈ విపరీత ధోరణులకు ఏం పేరు ఉందో తెలియదు…
- ఎవరో ఎందుకు..? తన తండ్రి పాలన విధానాలు, ప్రదర్శించిన పరిణతిలో తన వారసుడిగా చెప్పుకునే జగన్ కొంతైనా పాటించి ఉంటే… ఈ 11 సీట్ల అత్యంత దారుణ పరాజయం ఉండేది కాదేమో… వందా రెండొందల పథకాలకు వైఎస్ పేరు పెట్టడం ద్వారా కాదు… ఆయన అడుగుల్ని అనుసరించడంలో వారసత్వం కనిపిస్తుంది… జగన్‌లో అదే లోపించింది… రాధాకృష్ణ దాన్ని సరైన భాషలో చెప్పలేక, ఏదేదో వైకల్య భాషను ఆశ్రయించి… తను ఇంకేదోతరహా మీడియా నార్సిసిస్ట్ అనిపించుకున్నాడు..!! ఒక వంశీ, ఒక సాంబ, ఒక రాధాకృష్ణ…!!
చివరగా… నార్సిసిజం అనే పదం గ్రీకు పురాణాలలోని నార్సిసస్ అనే పాత్ర నుండి వచ్చింది… అతను నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి, దానితో ప్రేమలో పడి, చివరికి ఆ ప్రేమ నెరవేరక మరణిస్తాడు… ఏపీలో ఎవరెవరు ఈ పురాణపాత్రలో జనమే అర్థం చేసుకోవాలి…
Share this Article