.
వుమెన్ వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపు, సంబురాల్లో అనేక ఫోటోలు… ఓ చరిత్రాత్మక విజయం బాపతు అనేక ఫోటోలు, అనేక వీడీయోలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి…
సహజం… తొలిసారి చేజిక్కిన కప్…. దేశం యావత్తూ మన అమ్మాయిలే అని మురిపెంగా విజయాన్ని హత్తుకున్న సందర్భం… ఈ గెలుపు సంబురాల్లో మెన్స్ క్రికెట్ ప్రముఖులు, వీవీఐపీలు, సెలబ్రిటీలు కూడా పార్టిసిపేట్ చేసుకున్నారు… ఇదొక ఉత్సాహం, ఇదొక ఉత్సవం…
Ads
కానీ… ఒక ఆ సంబురాల్లోకి ఒక అమ్మాయి వీల్ చైర్ మీద వచ్చి అందరినీ ఆలింగనం చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు గమనించారా..? అసలు ఆమెది కదా అదృష్టం, దురదృష్టం కలగలిసిన ఉద్వేగం…
జట్టు ఓపెనర్ ఆమె… పేరు ప్రతీకా రావల్… స్థిరంగా ఆడుతోంది… హర్యానాకు చెందిన ఆమె ఢిల్లీకి ఆడుతుంది… మన వుమెన్ జట్టులో మెంబర్… కాకపోతే అక్టోబరు 26… బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో బౌండరీకి పోతున్న బంతిని ఆపే క్రమంలో బెణికింది.., విలవిల్లాడింది…
- ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… మన మగ జెంట్స్‌కన్నా ఫీల్డింగులో మన ఆడ లేడీస్ వేయి రెట్లు బెటర్… ఫైనల్ మ్యాచే ప్రత్యక్ష ఉదాహరణ… ఆడవాళ్లు కాదు, ఆడేవాళ్లు… కాదు, బాగా ఆడేవాళ్లు…
దాంతో ఆమెను సెమీ ఫైనల్, ఫైనల్ పోటీల నుంచి తప్పించారు… అనివార్యం… అదుగో అలా ఏర్పడిక ఖాళీలోకి వచ్చింది షఫాలీ వర్మ… వైల్డ్ కార్డ ఎంట్రీలాగా… స్మృతి మందానాతో కలిసి ఓపెనింగుకు దిగింది… వచ్చిన చాన్స్‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది షఫాలీ… 87 పరుగులు, రెండు వికెట్లు, ఒక రనౌట్…
ఫైనాల్‌లో దీప్తి శర్మ ఎంత ప్రధానపాత్ర పోషించిందో… అనుకోకుండా వచ్చిన షఫాలీ కూడా అంతే ప్రదర్శన ఇచ్చింది… సరే, గెలిచారు… జట్టు ఆనందానికి అవధుల్లేవు… సహజమే… కోట్ల మంది కీర్తిస్తున్న ఘనతను తట్టుకోలేక కన్నీళ్లే…
మరి ప్రతీకా..? ఆమెను వీల్ చెయిర్‌లో పట్టుకొచ్చింది స్మృతి మందానా… మొత్తం ట్రోఫీ స్వీకరణ నుంచి జట్టు ఉత్సవంలో పాల్గొనేలా చేసింది… వావ్… ప్రతీకాకు కన్నీళ్లొక్కటే తక్కువ… నేను కూడా సెమీ, ఫైనల్‌లో పాల్గొని ఉంటే..? ఇదీ ఆమె భావోద్వేగం… ఎవరాపగలరు..? స్మృతీ అని కేకేసింది…
అలాగని ఆమెను దూరం పెట్టలేదు జట్టు… కో-ఓపెనర్ స్మృతి తనను స్వయంగా తీసుకొచ్చి, ఆమెను హత్తుకుని ఫోటోలు దిగి, సంబురాల్లో ఆమెకూ స్థానం ఇచ్చారు… అంతేకాదు, సీనియర్లు మిథాలీ రాజ్ సహా మరికొందరితోనూ ఆనందాన్ని పంచుకుంది ఇండియన్ వుమెన్ క్రికెట్ జట్టు… వాళ్లు గెలిచిన ప్రతిభకన్నా ఈ ధోరణే అందరి మనసుల్ని కదిలించింది…!! మన మగ పురుష్ జట్టు సభ్యులకన్నా వీళ్లే చాలా చాలా బెటర్ అనిపిస్తోందా.,.? మీ ఫీలింగ్‌కు అర్థం ఉంది, నిజం కూడా..!!
Share this Article