Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు తెర పాత నటికి పద్మశ్రీ… అసలు ఎవరు ఈ మమతా శంకర్..?!

January 27, 2025 by M S R

.

నిజమే… Vaddi Omprakash Narayana చెప్పినట్టు… ఆ హీరో ఇన్ని రికార్డులు బద్దలు కొట్టాడు… ఈ డైరెక్టర్ ఇన్ని రికార్డులు బద్దలు కొట్టాడు అంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు ఓ ఒరవడిలో కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తోంది, నాతో సహా!

మొన్న పద్మ అవార్డులలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన శ్రీమతి మమతా శంకర్ తెలుగులో మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన ‘ఒక ఊరి కథ’ సినిమాలో నాయికగా నటించారనే విషయాన్ని ఎవ్వరూ మెన్షన్ చేయలేదు.

Ads

పద్మ విభూషణ్ అందుకోబోతున్న ఎల్. సుబ్రహ్మణ్యం గారికి, స్వర్గీయ ఎం.టీ. వాసుదేవన్ నాయర్ గారికీ సినిమా రంగంలో గాఢమైన అనుబంధం ఉందనే విషయాన్నీ ఎవరూ ప్రస్తావించకపోవడం బాధాకరం!



mamata shankar

సరే, ఇంతకీ ఎవరీమె..? అదోసారి చూద్దాం… డెబ్బయ్యేళ్ల ఈ పాత నటి మోడీకి ఏ కారణంచేత హఠాత్తుగా పద్మ పురస్కారానికి అర్హురాలిగా తోచిందో తెలియదు… అసలు ఈసారి మొత్తం పుద్మ పురస్కారాలన్నీ రాజకీయ కంపే కదా… పైగా ప్రజాభిప్రాయం మన్నూమశానం అని బోలెడు దిక్కుమాలిన బిల్డప్పులు…

ఎన్టీయార్ పద్మశ్రీ… బాలయ్య పద్మభూషణ్… అర్థమైంది కదా… మమతా శంకర్ ఓ నటి మాత్రమే కాదు, నర్తకి… బెంగాలీ సినిమాలకు ప్రసిద్ధి… సత్యజిత్ రే, మృణాల్ సేన్, తిరుపర్ణో ఘోష్, బుద్దదేబ్ దాస్ గుప్తా, గౌతమ్ ఘోష్ వంటి దర్శకుల సమాంతర సినిమాలకు ప్రసిద్ధి ఈమె…

ఆమె డాన్సర్, కొరియోగ్రాఫర్, సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్ బంధువు… తల్లిదండ్రులు ఉదయ్ శంకర్, అమలాశంకర్ శాస్త్రీయ నాట్యకారులు…

మమత శంకర్

అవునూ, అసలు ఈమధ్య ఆమె కళాసేవ ఏమీ లేదు కదా… ఆమెకు పద్మ పురస్కారం ఏమిటి..? ఏమో… అది అసలే బెంగాల్… మోడీ బాపతు ఏదో కార్యాచరణ ఉంటుంది… అర్థం కాడు మనిషి…

అంతటి రాజమౌళి తండ్రికి కూడా పద్మ పురస్కారం ఇచ్చాడు కదా… ఏం సాధించాడు..? ఫాఫం మోడీ… ఇదొక తలకుమాసిన స్ట్రాటజీ…

సరే, చంద్రబాబు మీద ఆధారపడి బతికే బతుకు కాబట్టి తను చెప్పగానే…. ఎన్టీయార్ భారతరత్న డిమాండ్ ఎప్పటిలాగే పక్కన పడేసి… ఈసారి ఏకంగా బాలయ్యకే పద్మభూషణ్ ఇచ్చారు… కథానాయికల పృష్ఠఘాతాల ప్రసిద్ధుల్లో తండ్రికి పద్మశ్రీ, కొడుక్కి పద్మభూషణ్… వావ్… మోడీ, లా జవాబ్…

అచ్చం అలాగే… శోభనకు ఏకంగా పద్మభూషణ్ ఇచ్చారు… అందరిలోనూ హాశ్చర్యం… ఆమె తెరకు దూరమై చాన్నాళ్లయింది… అంతకుముందు సినిమాల్లోనూ పెద్దగా పేరొచ్చిందీ లేదు… హఠాత్తుగా ఏకంగా పద్మభూషణ్… ఈసారి పద్మ ఎంపికలకు కేంద్ర అధికారుల్లో బాధ్యుడెవరో గానీ పరమ దరిద్రుడు… ఫాఫం మోడీ…

ఈ మమతా శంకర్ కూడా చాన్నాళ్లుగా తెరపై పెద్దగా ఫోకసైంది కూడా ఏమీ లేదు.,.. పోనీ, రాజకీయ కోణం ఉందాంటే అదీ కనిపించదు… నిజం… పద్మాల కసరత్తుపై ఎవడిని నమ్మి భంగపడ్డావయ్యా మోడీ భాయ్..!! ( ఈమె పండిట్ రవి శంకర్ అన్న కూతురు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక అంబానీ ఎదుగుదల..! కుబేర చూస్తుంటే ఏమీ గుర్తుకురాలేదా..?
  • పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!
  • హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…
  • నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
  • మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!
  • బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
  • జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్‌లో పవిత్రత ఉందా..?!
  • భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!
  • ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions