Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ రబ్బరు బొమ్మ… ఏ లగ్జరీ బంకర్‌లో దాగున్నదో… ఎక్కడుందో… పెద్ద మిస్టరీ..!!

March 22, 2022 by M S R

అలీనా కబయెవా… ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్త మీడియాలో మళ్లీ ఒక్కసారిగా ప్రముఖంగా కనిపిస్తోంది… ఎవరీమె..? ఒక లవర్… వయస్సు 38 ఏళ్లు… రష్యా అధినేత పుతిన్ లవర్… కాదు, తను మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక ఈమే అన్నీ… ఒకప్పుడు రష్యా ఎంపీ, రష్యా అధికార పార్టీ డ్యూమా డిప్యూటీ… అసలు అదికాదు చెప్పాల్సింది…

ఆమె ఎవరు..? తాష్కెంట్‌లో పుట్టింది… రిథమిక్ జిమ్నాస్ట్… అసలు ఆమె ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అన్నట్టుగా అద్భుతంగా కదిలే ఓ రబ్బరు బొమ్మ… అసలే రష్యన్ సౌందర్యం, కళ్ళు చెదిరే లావణ్యం… అందులోనూ రెండుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, అనేకసార్లు జిమ్నాస్టిక్స్‌లో ప్రపంచ చాంపియన్… సగటు రష్యన్ యువకుడికి ఆమె ఒక కలల సుందరి… (అఫ్‌కోర్స్, కొన్నాళ్లు డోపింగ్ ఆరోపణలతో డిస్‌క్వాలిఫై అయ్యింది..) కానీ ప్రపంచంలోకెల్లా పేరెన్నిక గన్న రిథమిక్ జిమ్నాస్ట్ ఆమె…

కేజీవీ ఏజెంటుగా పనిచేసిన పుతిన్‌కు ఆడవాళ్లు కొత్తేమీ కాదేమో… కానీ మొదటి భార్య యుడిమిలాకు విడాకుల ఇచ్చేంతగా ఈ అలీనా పిచ్చిలో కూరుకుపోయాడు… ఆల్‌రెడీ పాత భార్యతో ఆయనకు ఇద్దరు బిడ్డలు… మరియా, కేటరినా… మరియా మెడికల్ ప్రొఫెషనల్, ఓ డచ్ దేశస్తుడిని పెళ్లి చేసుకుంది… కేటరినా ఒక ఆక్రోబాటిక్ డాన్సర్, పర్‌ఫార్మర్… ఓ రష్యన్ కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుంది, కొన్నాళ్లకే పెటాకులు… ఇద్దరు కూతుళ్లూ మాస్కోలోనే ఉంటారు… మరి ఈ అలీనా ఎవరు..? ఇప్పుడు ఎందుకీ చర్చ..?

Ads

alina

ఉక్రెయిన్‌తో యుద్ధం… అది ఎప్పుడు అణుయుద్ధం దాకా పోతుందో తెలియదు… మరి అంతటి అగ్రరాజ్యం అధ్యక్షుడి భార్య, పిల్లల పరిస్థితేమిటి..? అదీ చర్చ… వాళ్లు ఎక్కడున్నారు..? అలీనా పుతిన్ అధికారిక భార్య కాదు… తనకన్నా మూడు దశాబ్దాల చిన్న వయస్సు… వాళ్లు కనిపించడం లేదు… ఏమయ్యారు..?

ఆమె స్విట్జర్లాండ్‌లో ఉందని ఓ రూమర్… పుతిన్ వల్ల కలిగిన నలుగురు పిల్లలకూ స్విస్ పాస్‌పోర్టులున్నాయని వాటి సారాంశం… కానీ ధ్రువీకరించేవాళ్లు లేరు… ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవేళ అదుపు తప్పి అణుయుద్ధం వైపు వెళ్తే వారిని కాపాడుకోవడానికి పుతిన్ ఏం చేస్తున్నాడు అనేదే ఆ చర్చ… ఈలోపు change.org లో ఆమెను స్విట్జర్లాండ్ నుంచి బయటికి పంపించేయాలని ఉద్యమం… ఆన్‌లైన్ సంతకాల యుద్ధం లెండి… యాభైవేల మందికి పైగా సంతకాలు చేశారు… కానీ ఆమె నిజంగా స్విట్జర్లాండ్‌లో ఉందా..?

alina

సైబీరియాలోని ఓ బంకర్‌లో ఆమెను దాచిపెట్టాడని వార్తాకథనాలు… నిజమో కాదో ఎవరికీ తెలియదు… కానీ అక్కడి అల్తాయ్ పర్వతశ్రేణుల దిగువ నిర్మించిన హైఫై లగ్జరీ బంకర్‌లో ఆమె ఉందని ప్రచారం… అది అణుదాడుల్ని కూడా తట్టుకునే బంకర్… ప్రత్యేకంగా కరెంటు లైన్లు, వాటర్ సోర్స్… లగ్జరీ విల్లాలు ఉంటాయట… ఎవరో కాదు, Valery Solovey, (former professor at Moscow State Institute of International Relations (MGIMO) చెబుతున్నాడు…

అసలు అలీనాతో తన రిలేషన్ ఏమిటో పుతిన్ ఇప్పటికీ బయటపెట్టలేదు… అది అధికారిక సహజీవనం కాదు… తను అరవై ప్లస్, ఆమె థర్టీ ప్లస్… ఓసారి ఓ చిన్న పత్రికవాడు ఏదో రాశాడు… రెండు రోజుల్లో పత్రిక మూసేయాల్సి వచ్చింది… ఓ వెబ్‌సైట్ వాడు రాశాడు, అరగంటలో రాసింది కాస్తా డిలిట్ అయిపోయింది… మరో వెబ్‌సైట్ వాడు వాళ్ల సంబంధం గురించి రాశాడు… మొత్తం సైట్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది… మరి పుతినా మజాకా..? ఆమె మగ కవలపిల్లల్ని కన్నప్పుడు ఓ మెడికల్ రీసెర్చ్ సెంటర్ మొత్తం గార్డ్స్ ఆధీనంలోకి వెళ్లిపోయిందిట… అట్లుంటది తనతోని….

ఎలాగూ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు కదా… మరి అలీనాతో తన బంధం ఏమిటో బహిరంగపరిస్తే తప్పేమిటి అంటారా..? నో, రష్యాలో బ్రేకప్పులు, విడాకులు, పెళ్లిళ్లు అలా బోలెడు జరుగుతూనే ఉంటయ్, లక్షల్లో కాలపరీక్షలో ఓడిపోతూనే ఉంటయ్… ఓ అగ్రరాజ్యం అధినేత పర్సనల్ జీవితం ఎప్పుడూ గోప్యమే… అసలు వాళ్ల వెంట్రుకలు, వేలిముద్రలే దొరకనివ్వరు… పైగా నొటోరియస్ కేజీబీ ఏజెంట్ తను… అవునూ, ఇప్పుడు ఆమె ఎక్కడుంది..? పెద్ద మిస్టరీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions