Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!

June 8, 2026 by M S R

.

విరోధాభాస… అంటే ఇంగ్లిషులో Paradox… అంటే పరస్పర విరుద్ధాంశాల కలయిక… తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పదే పదే వినిపిస్తున్న పదం హిట్లర్… దీనిపై బీఆర్ఎస్ విమర్శలు వింటుంటే ఆ విరోధాభాస గుర్తొస్తుంది… ఎందుకంటే… తెలంగాణ రాజకీయాల్లో నియంత అని బలమైన ముద్రపడింది కేసీయార్ మీద… గతంలో తెలంగాణకు సంబంధించిన ఏ నాయకుడిపై గానీ, చివరకు నిజాం ప్రభువుల మీద గానీ ఆ ముద్ర లేదు… జస్ట్, కేసీయార్ పైనే… కానీ ఆ పార్టీ నేతలు మాత్రం పదే పదే రేవంత్ రెడ్డిని హిట్లర్, నియంత అని నిందిస్తున్నారు ఇప్పుడు…

ఉల్టా చోర్ కొత్వాల్‌ కో డాంటే… అనే ప్రసిద్ధమైన హిందీ సామెత కూడా గుర్తొస్తుంది… మొన్న ఓ మీటింగులో రేవంత్ రెడ్డి తను చెరువులు, నీటివనరులు, భూముల దురాక్రమణల మీద ఎంత సీరియస్‌గా ఉన్నాడో చెప్పడానికి… హైడ్రా అనే పేరును హిట్లర్ కోర్ టీమ్ పేరు ఆధారంగా తీసుకున్నానని ఏదో ఫ్లోలో చెప్పాడు… నిజానికి అదంత సీరియస్ విషయమే కాదు… తన ఉద్దేశం కొన్ని అంశాల్లో హిట్లర్ అంత కఠినంగా ఉంటానని..!

Ads

హైడ్రా అసలు ఫుల్ ఫామ్ (HYDRAA) … “హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ” (Hyderabad Disaster Response and Asset Protection Agency)… ఆ పేరులోనే దాని ఏర్పాటు ఉద్దేశమేమిటో స్పష్టంగా ఉంది… హిట్లర్ అనే పదం సీఎం నోటి నుంచి వినగానే ఇక బీఆర్ఎస్ పట్టేసుకుంది… ఇక రచ్చ చేయడం మొదలుపెట్టింది… అసలే గాలి నుంచి బురద క్రియేట్ చేసి మరీ టన్నుల కొద్దీ చల్లే బ్యాచ్ కదా… మంత్రి శ్రీధర్ బాబు భాషలో చెప్పాలంటే…

‘తాపీ మేస్త్రీకి తలపోటు వస్తే… గోడ కూల్చినట్టుంది’… వేరే కాంగ్రెస్ ముఖ్యులకు ఈ కౌంటర్ చేతకానట్టు అనిపించింది… కానీ శ్రీధర్ బాబు తెలివిగా తిప్పికొట్టాడు… ఇలా…



‘‘సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన ‘The Hindu Conclave’లో ఏ ఉద్దేశంతో మాట్లాడాడో పూర్తిగా వినకుండా… కేవలం ఒక పదాన్ని పట్టుకుని కొందరు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం అత్యంత సిగ్గుచేటు… అక్కడ సీఎం మాట్లాడిన Administrative Philosophy, Administrative Depth ను అర్థం చేసుకునే Basic Intellectual Maturity వారికి లేదు…

• సీఎం ప్రస్తావించింది కేవలం Execution Speed, Decisiveness గురించి మాత్రమే తప్ప… హిట్లర్ హింసా సిద్ధాంతాలను కాదు…. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఆ మాత్రం ఉక్కు సంకల్పం ఉండాలనే ఉద్దేశంతోనే ‘హిట్లర్’ గురించి సీఎం చెప్పాడు…

• కేటీఆర్ విమర్శలు, వ్యవహార శైలి ఎలా ఉందంటే… తనకు అక్కడ చర్చ జరిగిన సందర్భం ఏంటో తెలియదు, ఆ సదస్సు సారాంశం ఏంటో తెలియదు… కానీ.. ‘హిట్లర్’ ఒక పదాన్ని పట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు…

• HYDRAA స్పీడ్ కు కబ్జాదారుల గుండెల్లో పుడుతున్న వణుకు చూసి… తట్టుకోలేక… ఓర్వలేక… ఎక్కడ ఏడ్వాలో తెలియక… ఈ ‘హిట్లర్’ ముసుగు వేసుకుని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు… కేటీఆర్ నోట ప్రజాస్వామ్య విలువలు అనే మాట వింటే… ‘గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదు’ అన్న సామెత గుర్తొస్తుంది… అంబేద్కర్, గాంధీజీల గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్…

• పదేళ్ల పాటు సచివాలయానికి రాకుండా… ప్రగతి భవన్‌కు ఇనుప కంచెలు వేసి… సామాన్య జనానికి ఎంట్రీ లేకుండా… ఒక ‘హిట్లర్ బంకర్’ లాగా దాన్ని మార్చి పాలించినప్పుడు మీ రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడికి పోయింది…? ఇందిరా పార్క్ వద్ద ‘ధర్నా చౌక్’ను ఎత్తేసి ప్రజాస్వామ్య గొంతు నొక్కిన మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది…? ప్రత్యర్థులపై, సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్‌లు చేయించి నిఘా పెట్టిన మీదా ప్రజాస్వామ్యం…?

• మహాత్మా గాంధీ ‘అహింస’ అన్నాడే తప్ప… దొంగతనాలు, కబ్జాలు జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోమనలేదు… చట్టాన్ని అమలు చేయడంలో చూపించే కఠినత్వాన్ని ఫాసిజం అనడం అజ్ఞానానికి నిదర్శనం…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకే రోజు ఇండియన్ క్రికెట్‌కు రెండు అవమానకర పరాభవాలు!!
  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • ఇడుపు కాయితం! తెలంగాణ సెంటిమెంట్ రాజేసే పొలిటికల్ కుట్రలు!?
  • ముఖ్యమంత్రి సినిమా నిర్మాత… ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అయిపోయాడు!
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ – ఒక థ్రిల్లింగ్ ‘మెగా’ సీరియల్!
  • పల్స్ పోలియో! ఏటా ‘చుక్కల’ ప్రయాసకు కూడా పాకిస్థానే కారణం..!
  • అన్నీ వదిలేసి.., హిమాలయ సన్యాస జీవనం అంత సులభమా?
  • నిజమే – పాస్‌పోర్టు జాతీయతను నిర్ధారించదు! ఇదీ వాస్తవ స్థితి!
  • RAAKA – రష్మిక నెగెటివ్ షేడ్స్ – రొమాన్స్ కాదుట, ఘర్షణ !
  • BRS – నైరాశ్యం వీడని పార్టీ కేడర్! ఫాయిదా లేని KTR ప్రయాస!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions