.
సంక్రాంతి సినిమాలు అయిదు… నిజానికి ఏడు… విజయ్ జననాయకన్ రాలేదు, శివ కార్తికేయన్ పరాశక్తి దిక్కూదివాణం లేెకుండా కొట్టుకుపోయింది… మిగిలినవి తెలుగు సినిమాలు ఐదు… ఒకసారి చకచకా బర్డ్ ఐవ్యూలో ఓ లుక్ వేసి, అసలు ‘ఎవరు నిజమైన విజేత’ అనే కథలోకి వెళ్లిపోదాం… వసూళ్ల ఫేక్ లెక్కల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం…
నిన్న ఓ రీల్ కనిపించింది… రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మీద ఓ యువతి తన అభిప్రాయం చెబుతూ… ‘‘భార్యను చీట్ చేయడాన్ని గ్లోరిఫై చేసే ఇలాంటి సినిమాలతో ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..? పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు..? చెత్తా సినిమా, అస్సలు ఎంకరేజ్ చేయొద్దు’’ అని గబగబా దులిపేసింది…
Ads
జాతరల్లో రికార్డింగ్ డాన్సుల్ని నిర్వహించే బాపతు తెలుగు నిర్మాతలకు ఇలాంటి నీతులు ఎక్కవు, హీరోలకు అసలే ఎక్కవు… సరే, ఇదే కోణంలో ఓసారి చూద్దాం… మొదట రిలీజైన ప్రభాస్ సినిమా ది రాజా సాబ్… ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్… అందరూ ఆరబోసేవాళ్లు… హీరో మీద ఎగబడటానికే సరిపోయారు… అదొక టేస్ట్ అట…
పైగా కన్నడ హీరోయిన్ మనీషా కందుకూర్, ఓ చిన్న హీరోయిన్ సుల్తానా, తమిళ హీరోయిన్ అమ్ము అభిరామి, మరో తమిళ హీరోయిన్ ఆనంది… ఎవరెవరు ఎందుకు తెరపైకి వస్తున్నారో, ఎందుకు పోతున్నారో ప్రభాస్‌కూ తెలియదు, దర్శకుడు మారుతికి తెలియదు, చూసే ప్రేక్షకుడికీ తెలియదు… చాల్లే ప్రభాసూ, మరీ ఇలా తయారయ్యావు అని ప్రేక్షకులు తిరస్కరించారు… ఏదో నానమ్మ, రాచరికం, వారసత్వం ఎట్సెట్రా ఆ గందరగోళం కథను వదిలేస్తే… హీరో మీద హీరోయిన్లు ఎగబడటాన్ని గ్లోరిఫై చేయడం కరెక్టు కాదు…
ఇక మన శివ శంకర వర ప్రసాద్ గారు… భార్య నయనతారతో మనస్పర్థలు, విడాకులు, కలయిక ఎట్సెట్రా కథ… అనిల్ రావిపూడి బాపతు లాజిక్ లెస్ కథలు, సీన్లు, క్రింజ్ కామెడీ గట్రా వదిలేస్తే… దాని గురించి ఈ చర్చలో ప్రస్తావన అవసరం లేదు…
అనగనగా ఒక రాజు… ఇదీ ఓ డిఫరెంట్ స్టోరీ… నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లు… అక్రమ సంబంధాలుె గట్రా ఏమీలేవు… ప్రధానంగా పోలిశెట్టి మార్క్ కామెడీ బాగా పేలింది… జనం ఎంజాయ్ చేశారు… దాన్ని కూడా వదిలేస్తే ఇక రెండు సినిమాలు…
ఒకటి భర్త మహాశయులకు విజ్ఞప్తి… ఇంతకుముందే చెప్పినట్టు భార్యను చీట్ చేయడం, అబద్దాలు చెప్పి మరొకరితో అఫయిర్ పెట్టుకోవడం, దాన్ని గ్లోరిఫై చేయడం… అసలే బయట సమాజంలో అక్రమ సంబంధాలు వేలాది కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి…

భార్యల్ని చంపే భర్తలు, భర్తల్ని- పిల్లల్ని హతమార్చే భార్యలు… విడాకులు… ఓ సోషల్ అన్‌రెస్ట్… ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్… పేరు ఏదయినా పెట్టుకొండి… ఇంకా వాటిని జనం బుర్రల్లోకి వినోదాత్మకంగా, గ్లోరిఫై చేసి ఎక్కించే సినిమాల ధోరణి నాన్సెన్స్… యువతకే నచ్చలేదు, అందుకే సినిమాను తిప్పికొట్టారు…
ఇక్కడ భార్య, ఎక్కడో స్పెయిన్ వెళ్లి మరీ అక్రమ సంబంధం… ఇక ఆ ఇద్దరి నడుమ ఈ హీరోగారి ‘సేవ’… సర్, ఇలాంటి సినిమాలు ఎన్ని తన్నేసినా సరే రవితేజ మారడు, తనతో సినిమాలు తీసే నిర్మాతలూ మారరు… ఇక ఐదో సినిమాకు వద్దాం…
నారీ నారీ నడుమ మురారి… శర్వానంద్ హీరో… సంయుక్త మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లు… నిజానికి వేరే నిర్మాతలో, వేరే దర్శకులో అయితే ఈ కథకు వినోదం పేరిట బూతును అద్దేవారేమో, కథలో ఆ స్కోప్ ఉంది… తనకన్నా చాలా చిన్నదాన్ని హీరో తండ్రి నరేష్ పెళ్లి చేసుకుంటాడు… మ్యారేజీకి ఏజ్ ఏముంది, లేటు వయస్సులో పిల్లలు కనడంలో తప్పేముంది అనే బాపతు… తన సొంత కథలాగే… (ఆయన లాస్ట్ భార్య పవిత్ర లోకేష్ ప్రస్తుతం గర్భిణి అని వార్తలు కనిపిస్తున్నాయి…)
ఒకరితో హీరో ప్రేమ, రిజిష్టర్ పెళ్లి, బ్రేకప్… తరువాత మరో హీరోయిన్‌తో లవ్వు, పెళ్లికి ఆ పాత లవర్‌తో అవస్థలు అనేది కథ… కానీ ఈ సున్నితమైన కథను ఎక్కడా అసభ్యత అనిపించకుండా, అశ్లీలం జోలికి పోకుండా… అంతే సున్నితంగా డీల్ చేసిన దర్శకుడు… అబద్ధాలతో సంబంధాలు కలవవు, నిలబడవు- సంబంధాల్లో నిజాయితీయే ముఖ్యం అనే ఓ నైతిక సూత్రాన్ని పక్కా కామెడీని రంగరిస్తూనే బలంగా చెప్పాడు… థియేటర్లలో ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ సినిమాకు విజయం అందించారు…
అందుకని ఈ సంక్రాంతి విజేత శర్వానంద్ మాత్రమే..!! మరి రియల్ పరాజితుడు ఎవరు..? ఇంకెవరు ఆ భర్త మహాశయుడే..!!
Share this Article