.
ఎవరు ఈ రేఖా గుప్తా… మరో పేరు రేఖా రాణి… మూణ్నాలుగు రోజులుగా అందరూ సెర్చ్ చేస్తున్నారు… రాస్తున్నారు… ఆరాలు తీస్తున్నారు… ఎందుకంటే..? ఆమె ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం ప్రమాణం చేయబోతోంది… ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది…
సీఎం పోస్టుకు మొదటి నుంచీ బలంగా వినిపించిన పేరు పర్వేశ్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కొడుకు) డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నాడు… బీజేపీ ఆమెను ఎంపిక చేయడంలో వ్యూహం ఏమిటో సరిగ్గా అంతుపట్టడం లేదు కానీ కొన్ని విశేషాలు ఉన్నాయి…
Ads
యాభై ఏళ్ల వయస్సున్న ఆమె తొలిసారి ఎమ్మెల్యే… షాలిమార్ బాగ్ నుంచి ఎన్నికైంది మొన్నటి ఎన్నికల్లో..! అంతకుముందు రాజకీయ అనుభవం లేదా అంటే…. ఉంది…! ఆమె పొలిటికల్ కెరీర్ విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభమైంది…
ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ (DUSU) జనరల్ సెక్రెటరీగా, అధ్యక్షురాలిగా కూడా చేసింది… ఏబీవీపీ ఫుల్ టైమ్ యాక్టివిస్ట్ ఆమె… న్యాయవిద్య చదువుకుంది… తరువాత ఢిల్లీలో కౌన్సిలర్… తరువాత మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు… పార్టీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శి కూడా… ఒకసారి ఢిల్లీ మేయర్ అభ్యర్థిగానూ పోటీపడింది…
ప్రస్తుతం ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రుల్లో మహిళలు ఎవరూ లేరు… అందుకని ఆమెను ఎంపిక చేశారా..? తెలియదు..! (మహిళను సీఎం పోస్టుకు ఎంపిక చేసే పక్షంలో స్మృతి ఇరానీ లేదా సుష్మా స్వరాజ్ బిడ్డ బాసురి స్వరాజ్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నారు అందరూ…) ఇప్పుడు ఈమె ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి… గతంలో షీలా దీక్షిత్, సుష్మాస్వరాజ్, అతిషి… ఇప్పుడు రేఖా గుప్తా… బీజేపీ తరఫున రెండో మహిళా ముఖ్యమంత్రి…
స్వస్థలం హర్యానాలోని జింద్ జిల్లా, జులానా సబ్ డివిజన్… నందిగఢ్ ఊరు… తండ్రి జైై భగవాన్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్… తను ఢిల్లీకి బదిలీ కాగా, కుటుంబం మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది… ఆ కుటుంబానిది రాజకీయ కుటుంబం కాదు…
ఆమె కుటుంబసభ్యులు జులానాలో ధాన్యం మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లు… అడితీదార్లు… భర్త మనీష్ గుప్తా… ఢిల్లీలోనే స్పేర్ పార్ట్స్ వ్యాపారం… తను రాజకీయాల్లో లేడు… భార్యకు బలమైన మద్దతుదారు… కుమార్తె హర్షిత కూడా తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తుంటుంది… ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం…
1995 లో ఆమె DUSU general secretary గా ఎన్నికైనప్పటి ఫోటో… అన్నట్టు… విజయేంద్ర గుప్త కొత్త అసెంబ్లీ స్పీకర్… సీఎం, స్పీకర్ ఒకే సామాజికవర్గం..! తను కేజ్రీవాల్‌ను ఓడించాడు… అవును,కేజ్రీవాల్ కూడా వైశ్యుడే..! అన్ని రంగాల్లోనూ ఢిల్లీ మీద సిక్కులదే ఆధిపత్యం… కానీ రాజకీయాల్లో వైశ్యులు డామినేట్ చేస్తుండటం విశేషమే..!
Share this Article