నిజంగానే ఓ ముఖ్యమైన వార్త రిపోర్టింగులో పాత ఫోటోల్ని, ప్రజెంట్ ఫోటోలుగా ముద్రించడం ఈనాడు చరిత్రలో అత్యంత అరుదు… వేరే పత్రికల్ని వదిలేయండి… ఈనాడులో ఇలాంటి పాత్రికేయ వృత్తి విషయాల్లో కొంత డిసిప్లిన్ మెయింటెయిన్ చేస్తారు… తప్పులు చేసిన ఉద్యోగులకు తక్షణం తీసిపడేస్తారు… మరి పట్టాభినీ కొట్టారు అనే బ్యానర్ స్టోరీలో జరిగిన తప్పులకు ఎవరిని బలితీసుకున్నారు..?
ఏముంది..? పెద్ద తలకాయలన్నీ సేఫ్… అమరావతి డెస్క్ ఇన్‌ఛార్జి రామకృష్ణ, మరో ఇద్దరు సబ్‌ఎడిటర్లను తీసేశారని సమాచారం… ఎందుకంటే… అమరావతి డెస్క్ నుంచే ఆ పాత ఫోటోలు సెంట్రల్ డెస్క్‌కు వెళ్లాయని ప్రాథమికంగా నేరనిర్ధరణ జరిగిందట… వాళ్లు తాజా ఫోటోలే అని భ్రమపడి పేజీల్లో అచ్చేశారట…
మనం ముందు నుంచీ చెప్పుకుంటున్నదే… ఈనాడులో పేజీలు ప్రింట్‌కు వెళ్లేముందు జరగాల్సిన క్రాస్ చెక్, ప్రూఫ్ రీడింగ్ లేకుండా పోయాయని..! చిన్న పత్రికల్లో తప్పుల్ని ఎవరూ పట్టించుకోరు… ఆ పత్రికలు కూడా పెద్ద బాధ్యతను ఫీల్ కావు… కనీసం సవరణలు, వివరణలు, ఖండనలు, సంతాపాలు, క్షమాపణలు అంటూ ఏమీ ఉండవు…
Ads
కానీ ఈనాడు పట్టించుకుంటుంది… మళ్లీ ఇలాంటి తప్పులు రావొద్దు అని ఎవరినో శిక్షిస్తుంది… అయితే ఎవరో చిన్న ఉద్యోగులను గాకుండా, నిజానికి అక్కడ సిస్టం భ్రష్టుపట్టడానికి బాధ్యులెవరో ఐడెంటిఫై చేసి శిక్షించాలి… అది లోపించింది… అందుకే ఈ తప్పులు, తప్పులకు చెంపలేసుకోవడాలు… ఇది ఈనాడు పరువును బజారున పడేయడమే…
అన్నింటికీ మించిన తప్పిదం ఒకటి అన్ని మీడియా హౌజుల్లో జరుగుతోంది… ఏదైనా సంఘటన జరగ్గానే సంబంధిత పార్టీ సోషల్ మీడియా విభాగాలు అవాకుల్ని చవాకుల్ని యాడ్ చేసి, పాత ఫోటోలతో, తప్పుడు బాష్యాలతో పోస్టులు పెట్టి రచ్చరచ్చ చేస్తున్నారు… వీటి ప్రభావం పత్రికలు, టీవీ చానెళ్ల స్టాఫ్‌నూ ప్రభావితం చేస్తున్నాయి… అవి తాజా ఫోటోలేనని ఈనాడు స్టాఫ్ భావించడానికి కూడా తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన రచ్చే కారణం…
అందుకే పత్రిక ఏదైనా సరే, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, కథనాలు, ఫోటోలు, వీడియోల పట్ల ప్రభావితులు కావద్దు… మార్ఫింగ్ ఫోటోలు, ఎడిటెడ్ వీడియోలు, తప్పుడు బాష్యాలతో ఆయా పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుంటాయి… ఒక్క తెలుగుదేశమే కాదు, ఏ పార్టీ దీనికి అతీతమేమీ కాదు… ఈ సంఘటనలో కూడా తప్పు తెలుగుదేశం వైపు నుంచి జరిగింది, గుడ్డిగా నమ్మేసి ఈనాడు ఉపసంపాదకులు బలైపోయారు..!!
పట్టాభి వార్త రిపోర్టింగు విషయంలో జరిగిన తప్పిదాలను మాజీ ఈనాడు ఉద్యోగి, ప్రస్తుత ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేసిన పత్రిక ప్రకటన మరో ఎక్స్‌ట్రీమ్… ప్రెస్ అకాడమీ ప్రెస్ కౌన్సిల్ కాదు… సింపుల్… ఒక పత్రికలో జరిగిన తప్పిదాలపై ప్రభుత్వ సంస్థ ఆక్షేపించడం దేనికి..? ప్రెస్ అకాడమీకి బాధ్యతలు ఉంటాయి, పరిమితులూ ఉంటాయి… అవి తెలియనివాడు కాదు కొమ్మినేని… కానీ తనకు ఆ పదవి ఇచ్చినందుకు, చూశారా నేను మన పార్టీకి, మన ప్రభుత్వానికి అనుగుణంగా.., తెలుగుదేశానికి, దాని బాకాలకు వ్యతిరేకంగా ఎలా స్పందిస్తున్నానో…. అన్నట్టుగా ఉంది ఈ ప్రకటన..!!
Share this Article