Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంపన్నులు పన్నెండు రకాలు… మీరు ఈ కేటగిరీలోకి వస్తారు..?!

January 18, 2025 by M S R

.
Jagannadh Goud ……. ఈ భూమి మీద 12 రకాల సంపన్నులు ఉంటారు. మనం సాధారణంగా డబ్బు ఉన్నవాళ్ళనే సంపన్నులు అనుకుంటాం. నిజానికి డబ్బు ఉన్నవాళ్ళు కూడా సంపన్నులే కానీ చివరిరకం సంపన్నులు వాళ్ళు. ర్యాంకుల వారీగా ఆ 12 రకాల సంపన్నులని చూద్దాం…

1. పాజిటివ్ మానసిక దృక్పథం కలిగి ఉన్నవాళ్ళు: ఈ భూమి మీద పాజిటివ్ మానసిక దృక్పథం కలిగిన వాళ్ళు అత్యంత సంపన్నులు.

2. మంచి శారీరక ఆరోగ్యం కలిగిన వాళ్ళు: ఎక్కువ మంది పట్టించుకోరు కానీ మంచి ఆరోగ్యం కలిగి ఉన్నవారు అత్యంత సంపన్నులు.

Ads

3. సామరస్యం కలిగిన మానవ సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు: ప్రధానంగా తల్లితండ్రులతో, తోడ పుట్టినవారితో, భార్య/ భర్త/ పిల్లలు, స్నేహితులతో మంచి సామరస్యపూరిత సంబంధాలు కలిగిన వాళ్ళు అత్యంత సంపన్నులు.

4. భయం నుండి విముక్తి కలిగి ఉన్నవాళ్ళు: డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, స్వేచ్చ గురించి, ఉద్యోగం, వయస్సు, మరణం మొదలగు వాటి గురించి భయపడకుండా బతకగలిగిన వాళ్ళు అత్యంత సంపన్నులు.

5. సాధించగలను అనే ఆశ కలిగి ఉన్నవాళ్ళు: నా భవిష్యత్తు బాగుంటుంది, నేను సాధించగలను అనే దృక్పథం కలిగి ఉన్నవాళ్ళు అత్యంత సంపన్నులు.

6. ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళు: మన ఆలోచనలకి, ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి దానికీ ఒక కనెక్షన్ ఉంటుంది. నమ్మకం ఉంటే అద్బుతాలు జరుగుతాయి. ఈ విధంగా నమ్మకం ఉంచినవాళ్ళు అత్యంత సంపన్నులు

7. తెలిసిన విద్యని, ఒక రంగంలో పరిశోధన చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరుల ఉన్నతికి ఉపయోగపడేటట్లు చేసే లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు అత్యంత సంపన్నులు.

8. ప్రేమతో కూడిన శ్రమ చేసేవాళ్ళు అత్యంత సంపన్నులు

9. ఏ విషయంపై అయినా సంకుచిత స్వభావం, స్ధిరమైన అభిప్రాయం లేకుండా ఇతరుల అభిప్రాయాలని గౌరవిస్తూ అన్ని విషయాలపై ఓపెన్ మైండెడ్ నెస్ కలిగిన ఉన్నవాళ్ళు అత్యంత సంపన్నులు.

10. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అత్యంత సంపన్నులు

11. ఇతరులని అర్ధం చేసుకునే స్వభావం కలిగిన వాళ్ళు అత్యంత సంపన్నులు

12. ఆర్ధిక భద్రత ఉన్నవాళ్ళు అత్యంత సంపన్నులు

– నెపోలియన్ హిల్ రాచిన “ది సైకాలజీ ఆఫ్ వెల్థ్” అనే పుస్తకం నుంచి

(NOTE: ఈ జనవరిలో “ది సైకాలజీ ఆఫ్ వెల్థ్” అనే పుస్తకం చదివాను (495 పేజీలు ఉంటుంది). నెపోలియన్ హిల్ రాచిన “థింక్ అండ్ గ్రో రిచ్” అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. నాకు వ్యక్తిగతం గా నెపొలియన్ హిల్ రాచిన “ది లా ఆఫ్ సక్సెస్” పుస్తకం ఇష్టం. అయితే నెపోలియన్ హిల్ 1930 లో రాచిన “ది మ్యాజిక్ ల్యాడర్ టు సక్సెస్ మరియూ 1945 లో రాచిన “ది మాస్టర్ కీ టు రిచెస్ ” అనే రెండు పుస్తకాలని కలిపి “ది సైకాలజీ ఆఫ్ వెల్థ్” అనే పుస్తకంగా ప్రచురించారు) …… మీరు ఏ రకం సంపన్నులు ..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions