.
అందరూ రాశారు ఆ వార్త… లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి యాదవ్ ఆ కుటుంబంతో నా సంబంధాల్ని తెంచుకుంటున్నాననీ, క్రియాశీల రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నాను అని ఓ ప్రకటన జారీ చేసింది…
రాజకీయాలు, కుటుంబ కలహాలు, వారసత్వ గొడవలు… ఇక్కడే కాదు, అన్నిచోట్లా ఉన్నవే… వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత… ఇలా చాలామంది… రోహిణి యాదవ్ ఏమంటున్నదీ అంటే… నన్ను తిట్టారు, చెప్పులతో కొట్టబోయారు, అవమానించారు, ఇంటి నుంచి గెంటేశారు…
Ads
మా పార్టీ సోషల్ మీడియాలోనే నన్ను తిట్టిస్తున్నారు అని కవిత ఈమధ్య చేసిన ఆరోపణ గుర్తొచ్చింది… అసలు రోహిణి వివాదంలోని మరిన్ని వివరాలు చెప్పుకుందాం…
బాగా చదువుకుంది… లాలూ ప్రసాద్ కిడ్నీలు చెడిపోతే 2022లో తన కిడ్నీని ఇచ్చింది… కానీ అదీ వివాదమే… అదొక మురికి కిడ్నీ, కోట్ల రూపాయలకు ఎవరి నుంచో కొన్నది, తను కిడ్నీ ఇచ్చినట్టు చెబుతోంది అని సొంతింటి నుంచే, అంటే ఆ పార్టీ ముఖ్యులే ఆమెను ఆడిపోసుకున్నారు…
దీనికి ప్రధాన కారకుడు తేజస్వి యాదవ్ అత్యంత సన్నిహితుడు, పార్టీ సలహాదారు, పార్టీ ఎంపీ సంజయ్ యాదవ్… మరో సన్నిహితుడు రమీజ్… రోహిణిపై మరీ కక్ష కట్టినట్టుగా ఆమెపై నిందాపూర్వక ప్రచారం చేస్తున్నారు… తేజస్వి యాదవ్ వాళ్లను ఒక్కమాటా అనడం లేదు… వాళ్లే తనను రాజకీయాల నుంచి తప్పుకొమ్మని బలవంతం చేస్తున్నారనీ, వాళ్ల గుప్పిట్లో ఆర్జేడీ చిక్కుకుందనీ అంటోంది రోహిణి…
ఎక్స్‌లో ఈ పోస్టు ఆమె తొలగించినా… ఆ స్క్రీన్ షాట్లతో దేశమంతా ఈ వార్త అప్పటికే వైరల్ అయిపోయింది… ఈమె 2024లో సారన్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయింది… నిజానికి ఈ కుటుంబంలో ఈ వివాదమే కాదు… పెద్ద కొడుకు తేజప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు… వేరే పార్టీ పెట్టుకున్నాడు, తనే ఓడిపోయాడు మొన్నటి ఎన్నికల్లో… ఆయన విడాకుల పర్వం కూడా వివాదస్పదమే…
లాలూకు ఏడుగురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు… కొందరు బిడ్డలకు వ్యూహాత్మకంగా బీహార్, యూపీ రాజకీయ కుటుంబాల అబ్బాయిలతో పెళ్లిళ్లు చేశాడు… తన రాజకీయ పరపతిని విస్తరించుకోవడం ఆ వ్యూహం… అల్లుళ్లలో కొందరికి రాజకీయాలతో సంబంధం లేదు… వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు… మీసా భారతి మాత్రం రాజకీయాల్లో ఉంది… రాజ్యసభ ఎంపీ…
మరొకామె రాగిణి యాదవ్… ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాములో మనీలాండరింగు కేసులో ఈడీ ఈమెను విచారించింది… మీసా భారతి మీద కూడా కేసులున్నాయి… లాలూ గురించి జనమందరికీ తెలిసిందే కదా… జైలు జీవితం గడిపినవాడే కదా… మీసా భర్త శైలేష్‌కు సొంతంగా ఐటీ కంపెనీ ఉంది…
చందా యాదవ్ భర్త విక్రమ్ సింగ్, తను పైలట్… రాజకీయాలకు సంబంధం లేదు… హేమ యాదవ్ భర్త వినీత్ యాదవ్… రాజకీయ కుటుంబమే… హర్యానా, ఢిల్లీ బేస్డ్ పాలిటిక్స్… అనుష్కరావ్ భర్త చిరంజీవ్ రావ్… తను కాంగ్రెస్ పార్టీ… హర్యానాలోని రేవారి ఎమ్మెల్యే… హర్యానా పాపులర్ కాంగ్రెస్ లీడర్ అజయ్ సింగ్ యాదవ్ కొడుకు తను…
రాజ్ లక్ష్మి యాదవ్ భర్త తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్… సమాజ్ వాదీ పార్టీ (SP) నాయకుడు, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు… ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మేనల్లుడు (ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మనవడు)… ఇది బీహార్ RJD, యూపీ SPల మధ్య రాజకీయ బంధాన్ని బలోపేతం చేసింది…
రోహిణి ఆచార్య భర్త రావు సమరేశ్ సింగ్… వృత్తిరీత్యా కంప్యూటర్ ఇంజనీర్… సింగపూర్ కేంద్రంగా పనిచేస్తుంటారు… తీవ్ర విమర్శలు చేసిన రోహిణి విషయంలో ఏం జరిగిందో గానీ ట్వీట్ డిలిట్ చేసింది… మొత్తానికి భలే కుటుంబం..!!
Share this Article