Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రుద్రకరణ్ ప్రతాప్… ఈయన మరో వేణుస్వామి… ఈడీ అరెస్టులపై మరో చర్చ..!

March 22, 2024 by M S R

జ్యోతిష్కులపై ఎప్పుడూ ఓరకమైన విమర్శల దాడి జరుగుతూ ఉంటుంది… సోషల్ మీడియా విజృంభణ తరువాత ఇదింకా ఎక్కువైంది… ప్రత్యేకించి సెలబ్రిటీల జాతకాలను చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్కులపై ఈ దాడి ఇంకా తీవ్రంగా ఉంటుంది… అదేసమయంలో ఆ నెగెటివ్ ప్రచారం కూడా వాళ్లు మరింత పాపులర్ కావడానికి ఉపయోగపడుతుంది… మరింత మందికి పరిచయం కావడానికి ఆస్కారమిస్తుంది…

సరే, జోస్యాలు నిజమవుతాయ్, అబద్దమవుతాయ్… ఎవరూ ఖచ్చితమైన జోస్యాలు చెప్పలేరు… చెప్పిన జోస్యాల్లో ఎన్ని నిజమయ్యాయ్, స్ట్రయిక్ రేట్ ఎంత అనేదే ఈ రంగంలో ప్రామాణికం… సరే, నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మనివాళ్లు ట్రాష్ అని కొట్టిపారేస్తారు, ఇప్పుడు ఈ చర్చలోకి వెళ్లడం లేదు గానీ… ఖండనమండనలు, సోషల్ దాడులు ఎలా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి బాగా పాపులర్ సెలబ్రిటీ జ్యోతిష్కుడు… తను జోస్యం చెప్పడమే కాదు, వామాచార పద్ధతిలో గ్రహచార రిలీఫ్ పూజలు కూడా చేస్తుంటాడు కాబట్టి సెలబ్రిటీల సర్కిల్‌లో ఫేమస్…

కవిత లీగల్ చిక్కుల్ని, కేసీయార్ మళ్లీ సీఎం కాబోడని నేను ముందే చెప్పాను అని తను క్లెయిమ్ చేసుకుంటే… తన మీద భీకరమైన ట్రోలింగ్ నడుస్తోంది… సంబంధిత వీడియో బిట్లు కూడా తను జతచేస్తున్నాడు… ఐనా తన మీద సాగే వ్యతిరేక ప్రచారంతో విసిగిపోయిన ఆయన బీఆర్ఎస్ గెలుస్తుందని నేను గనుక చెప్పి ఉంటే, ఆ వీడియో ప్రూఫ్స్ చూపిస్తే మొత్తం జ్యోతిష్యాన్నే వదిలేస్తానని ఈమధ్య భీషణ ప్రకటన చేశాడు… ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా సరే కేసీయార్ సీఎం కాబోడు అని తను చెప్పినట్టు గుర్తు… ఈ వివాదం చూస్తుంటే ఇంకో ఇంట్రస్టింగ్ వివాదం కనిపించింది… ఆయన పేరు రుద్ర కరణ్ ప్రతాప్… నిజానికి ఈయనకన్నా వేణుస్వామే చాలా బెటర్ అనిపించింది…

Ads

రుద్రకరణ్ ప్రతాప్ కూడా సెలబ్రిటీ జ్యోతిష్కుడు… తను నివారణ పూజలు చేస్తాడో లేదో తెలియదు గానీ… ప్రధాని మోడీ తనను ట్విట్టర్‌లో ఫాలో అవుతాడు అని చెప్పుకుంటాడు… ఎక్స్ ఖాతాలో కూడా దాన్ని ప్రముఖంగా పేర్కొన్నాడు… చూశారా, నేనెంత ఫేమసో అని చెప్పడానికి అన్నమాట..! బాలీవుడ్ సింగర్స్, యాక్టర్స్, పొలిటిషియన్స్, బ్యూరోక్రాట్స్ తన క్లయింట్లు అనీ ప్రముఖంగా ప్రస్తావిస్తుంటాడు… అంతేకాదు, రష్యా-ఉక్రెయిన్ వార్, ఇమ్రాన్ ఖాన్ డౌన్ ఫాల్, 2022 యూపీ ఎన్నికల ఫలితాలు, 2022 పంజాబ్ ఫలితాలు, 2022 గ్లోబల్ ఫ్లడ్స్, యూరప్ దేశాల ఆర్థిక పతనాల గురించి నేను చెప్పినవి అక్షరాలా జరిగాయి అనేది తన క్లెయిమ్…

కేజ్రీవాల్ పతనం 2025లో ఓటమితో మరింత స్పష్టంగా కనిపిస్తుందని, 2024 మార్చిలో తను లీగల్‌గా చాలా చిక్కుల్లో పడతాడని, మేజర్ సెట్ బ్యాక్స్ తప్పవని 2022లోనే ట్వీట్ చేశానని తాజాగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు… సంబంధిత ట్వీట్ కూడా మళ్లీ షేర్ చేసుకున్నాడు… జగన్ మళ్లీ గెలుస్తాడని ఆయన చెప్పాడని, అదీ నిజమవుతుందనీ, కేజ్రీవాల్ అరెస్టు ట్వీటే దానికి తార్కాణం అనీ వైసీపీ బ్యాచ్ పోస్టులు కూడా కనిపిస్తున్నాయి… అలా ఆయన తెలుగు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాడు…

నిజమేనా..? ఒక్కసారి అలా సెర్చింగ్ చేస్తుంటే… ఓ వార్త కనిపించింది… అది 29 మే 2023 నాటి వార్త… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని రుద్ర కరణ్ ప్రతాప్ జోస్యం చెప్పినట్టు వార్త… కేసీయార్ గెలుస్తాడని  చెప్పిన జోస్యం అడ్డంగా ఫ్లాప్ అయినట్టే కదా… In the upcoming Telangana elections, the reigning government of K Chandrashekhar Rao will be re-elected and continue its tenure in Telangana… ఇదీ తన పాత ట్వీట్… కానీ వేణుస్వామి కేసీయార్ మళ్లీ సీఎం కాబోడని స్పష్టంగా చెప్పాడు… కాకపోతే బీఆర్ఎస్ గనుక గెలిస్తే కేటీయార్ సీఎం అవుతాడు తప్ప కేసీయార్ కాలేడనే చిన్న ఫ్లెక్సిబులిటీని పెట్టుకున్నాడు తన జోస్యంలో… కవిత అరెస్టు, కేజ్రీవాల్ అరెస్టు సంఘటనలతో ఈ జోస్యాలు మళ్లీ బలంగా వార్తల్లోకి వచ్చాయి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions