బహుశా మహారాష్ట్ర సమాజం ఇంతకుమించిన దరిద్రపు పాలనను ఇంకెప్పుడూ చూడదేమో…. ఉద్దవ్ ఠాక్రే వంటి నల్కా ముఖ్యమంత్రి మరెప్పుడూ రాడేమో…. ఒకప్పటి శివసేన ఏమిటి..? ఆ బాల్ ఠాక్రే ఏమిటి..? ఈ కుక్కమూతిపిందెలు ఏమిటి..? సంజయ్ రౌత్ అనబడే ఓ పర్వర్టెడ్, పొలిటికల్ బ్రోకర్ చెప్పినట్టుగా ప్రభుత్వం నడవడం ఏమిటి..? అసలు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలయికే ఓ అపవిత్ర నిర్ణయం… దానికితోడు నిలువెత్తు అవినీతికి ఐకన్‌గా చెప్పుకునే ఆ ఎన్సీపీ అడుగులకు మడుగులు ఒత్తడం ఏమిటి..? తాజా ఉదాహరణే తీసుకుందాం… షారూక్ ఖాన్ అనే ఓ స్టార్ హీరో కొడుకు నడత తప్పాడు, భ్రష్టుపట్టాడు… డబ్బు, విలాసం, ప్రలోభం, వైభోగం వాడిని దారితప్పించాయి… పక్కాగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓ డ్రగ్ అడిక్ట్… ఆ రాకెట్ తవ్వితే కదా, అసలు మూలాలు బయటికి వచ్చేవి… కానీ ఏం జరిగింది..?
తన గల్లీ పొలిటిషియన్ స్థాయిని మించి శివసేన ఎదగలేకపోతోంది… ప్రభుత్వంలోని ఓ ఎన్సీపీ మంత్రి నవాబ్ మాలిక్ ఏకంగా ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేని టార్గెట్ చేశాడు… ఆ షారూక్ కొడుక్కి బెయిల్ రావాలంటే 25 కోట్ల డీల్ అడిగాడని ఆరోపించాడు… అంతేకాదు, అసలు సదరు అధికారి అసలు హిందువే కాదనీ, ముస్లిం అనీ అంటున్నాడు… సో వాట్..? ఇక్కడ మతం ప్రస్తావన ఏమిటి..? నిజంగానే మతం పరిగణనలోకి వచ్చే పక్షంలో… మరి ఆర్యన్ ఖాన్‌ను అరదండాలు వేసి, జైలులో పారేసినందుకు అభినందించాలి కదా…!! నవాబ్ మాలిక్ పిచ్చి ఆరోపణలు సరే, మరి ది గ్రేట్ ముసలి భీష్ముడిగా చెప్పబడే శరద్ పవార్ గాడిదలు కాస్తున్నాడా..? అసలు ఇంతకుముందే తమ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ భ్రష్టుపట్టిపోయాడుగా… ఏకంగా అంబానీ మీద దాడికి పురగొల్పిన ఎదవలకు సపోర్ట్ చేశాడుగా… మరి ఇప్పుడు నవాబ్ మాలిక్ మీద మాట్లాడడేమిటి..? శరద్ పవార్‌తో కలిసి ఠాక్రే ఎంత పాతాళానికి కూరుకుపోయాడో అర్థం అవుతోందిగా…
సరే, వాంఖడే 25 కోట్లు అడిగాడు, అందులో 8 కోట్లు తన వాటా… నిజమే అనుకుందాం… మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం బుద్దీసిగ్గూశరం ఉన్నా సరే, వాంఖడేకి సపోర్ట్‌గా నిలవాలి కదా, సదరు మంత్రి నవాబ్ మాలిక్ నోరు మూసుకోవాలని చెప్పొచ్చుగా… కేసులో మెరిట్ లేకపోతే కోర్టే బెయిల్ ఇస్తుందని అనాలిగా… ఎన్సీపీ కోవర్టు సంజయ్ రౌత్ అదేమీ చెప్పడు, ఠాక్రే నోరు విప్పడు… ఏం సర్కారురా బాబూ..? సేమ్, ముంబైలో ఇదుగో ఇలాంటి బోషిడికే మాఫియా మీదే కదా కంగనా తిరగబడింది… దానికి ఠాక్రే చేసిందేమిటి..? ఆమె ఆఫీసు కూలగొట్టి, కేసులు పెట్టి, నువ్వు ముంబైలోకి ఎలా అడుగుపెడతావో చూస్తాను అని బెదిరించింది శివసేన… ఓసారి వాంఖడే సంగతికొద్దాం…
Ads
25 కోట్ల ఆరోపణ చేసిందెవడు..? ప్రభాకర్ సెయిల్..! వాడెవడు..? కేసులో నిందితుడు, ప్రైవేటు డిటెక్టివ్ కిరణ్ గోసావికి బాడీగార్డ్… వాడు చెప్పాడట, ఇప్పుడు అదే ఆధారంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనాలు రాస్తోంది… అయ్యా, బాబూ, ఈ ఫేక్ ఆరోపణల్ని బేస్ చేసుకుని, నిర్ణయాలు తీసుకోకండి మహాప్రభో అని సదరు వాంఖడే కోర్టును అభ్యర్థిస్తున్నాడు… అదీ దుస్థితి… మరి ఆ ఎన్సీబీ అయినా ఔట్‌రైట్‌గా తమ అధికారికి సపోర్టుగా నిలబడాలి కదా… అదో దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం… ధైర్యం లేదు, వ్యూహం లేదు, దూకుడు లేదు… ఏం..? షారూక్ ఖాన్ అంటే అంత అదా..? ఆఫ్టరాల్ ఓ యాక్టర్… వందల కోట్లు సంపాదించవచ్చుగాక…. కానీ ఓ తండ్రిగా అసమర్థుడు… వాంఖడే డబ్బు అడిగితే మరి తనే బయటికి వచ్చి వెల్లడించవచ్చుకదా… ఈ నవాబ్ మాలిక్‌లు దేనికి..? ఈ ప్రభాకర్ సెయిళ్లు దేనికి..? నువ్వొక హీరో..?! భారతీయ సమాజం దురవస్థ కదరా..!!
ఈ చెత్తా వ్యవహారంలో మరో ప్రధానపాత్ర మెయిన్ స్ట్రీమ్ మీడియాది… అక్కడా టీవీ9లు ఉంటాయి కదా… ముడ్డి కిందికి 23 ఏళ్లు వచ్చినయ్ వాడికి, డ్రగ్స్ అడిక్ట్… వాడు ఇంకా కిడ్ అట… అక్కడికి వాడొక చిన్న పోరడు అయినట్టుగా ముద్దుచేస్తోంది మీడియా… ఫాఫం, షారూక్ ఫ్యామిలీ ఎంత ఏడుస్తోంది, స్వీట్లు కూడా మానేశారు అంటూ చిల్లర కథనాలు… పేరుమోసిన స్టార్ కొడుకు అయితే ఇంతగా కాళ్ల మీద పడి భజన చేయాలా..? ఇంకా నయం, చిన్న పిల్లాడి మీద కేసు ఇది, జువైనల్ కిందకు వస్తుంది అని రాయలేదు, మీ దుంపతెగ…
నవాబ్ మాలిక్ చేసిన కులం, మతం వ్యాఖ్యలకు వద్దాం… నిజానికి వాంఖడే 2008 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి… ట్రాక్ రికార్డులో పెద్ద నెెగెటివ్ రిమార్కులేమీ లేవు… తండ్రి పేరు ధ్యాన్ దేవ్ కచ్రూజీ… ఆయన హిందూ… కానీ జహీదా బానో అనే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు… వాంఖడే కూడా మొదట్లో డాక్టర్ షబానా ఖురేషి అనే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు… ఆ పెళ్లి విఫలమయ్యాక మరాఠీ నటి క్రాంతి దీనానాథ్ రేడ్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు… అది తన ఇష్టం… ఎక్కడా చట్టవిరుద్ధంగా, సమాజవిరుద్ధంగా వెళ్లలేదు… ఇప్పుడు నవాబ్ మాలిక్ చేస్తున్న విమర్శలు అర్థరహితం… వాంఖడే హిందూ అయితేనేం..? ముస్లిం అయితేనేం..? అణగారిన కులం అయితేనేం..? ఈ విమర్శలకు జవాబుగా వాంఖడే భార్య తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది… వెరసి ఏం జరుగుతోంది..? దర్యాప్తు అధికారిని డిమోరల్ చేసే కుట్ర… దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్టు వైఖరి… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాగూ ఓ సోయి లేదు కదా… వాడికి ఎలాగూ పట్టదు… దీంతో ఎవడైనా వీవీఐపీల జోలికి, వాళ్ల పిల్లల జోలికి పోవాలంటే ఉ– పోసుకోవాలా..?!
Share this Article