.
పాత బీజేపీ వేరు… మోడీ షా బీజేపీ వేరు… ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి ఎమర్జయిన వాళ్లకే సీఎం పదవులు, హోదాల్లో ప్రాధాన్యం అనే మాటకు ఇప్పుడు అర్థం లేదు… ఇప్పుడు ఎవరు, ఏ సమీకరణాల్లో పార్టీకి పనికొస్తారు అనేదే ముఖ్యం… పాత నేపథ్యం ఏమైనా సరే…
ఉదాహరణకు… అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ… ఒరిజినల్‌గా కాంగ్రెస్… ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది… బీజేపీ పికప్ చేసింది.,. ఇప్పుడు ఈశాన్యానికి తనే బీజేపీ హైకమాండ్ ఒకరకంగా… అంత సెటిలయ్యాడు…
Ads
ప్రస్తుతం బీహార్‌లో బాగా వినిపిస్తున్న పేరు సామ్రాట్ చౌదరి… ఎప్పుడైనా సరే బీహార్‌కు కాబోయే ముఖ్యమంత్రి తను… ఇప్పుడు బీజేపీయే… సరిగ్గా పికప్ చేసింది తనను… అదీ రెండు మూడేళ్లుగానే తనది బీజేపీలో ప్రయాణం…
నితిశ్ ప్రభుత్వ కాలంలో ఉపముఖ్యమంత్రి… ఇప్పుడు కూడా..! కానీ తను ఒరిజినల్‌గా తన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసింది 1990లో ఆర్జేడీ నుంచే… 1999లో రబ్డీదేవి ప్రభుత్వంలో మంత్రి కూడా… 2014లో కొన్నాళ్లు జేడీయూ పాలనలో కూడా పనిచేశాడు మంత్రిగా…, 2021లో కూడా మంత్రి… తరువాత శాసనమండలిలో ప్రతిపక్ష నేత… 2023 మార్చిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు… తరువాత ఉపముఖ్యమంత్రి…
పార్టీ ఏమిటనేది కాదు ముఖ్యం కాదు… పదవిలో ఉన్నామా లేదా, ప్రాధాన్యం దక్కుతున్నదా లేదా…? ఇంతకీ ఎవరీయన..? పుట్టింది 1968లో… తండ్రి పేరు కాస్త డిఫరెంటు… శకుని చౌదరి… సాధారణంగా ఆ పేరు ఎవరూ పెట్టుకోరు కదా… డాక్టర్ ఆఫ్ లిట్… గౌరవ డాక్టరేట్…
తండ్రి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ… తల్లి కూడా మాజీ ఎమ్మెల్యే… పక్కా పొలిటికల్ కుటుంబం… కులం కొయిరీ, కుష్వాహ (ఓబీసీ)… బీజేపీ తనకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది..?
-
నిర్ణయాత్మక ఓటు బ్యాంకు…: బీహార్‌లో యాదవుల తర్వాత కూష్వాహాలు (కోయిరిలు) అత్యంత ప్రభావవంతమైన ఓబీసీ (OBC) వర్గాలలో ఒకటిగా ఉన్నారు…. కూష్వాహ వర్గం ఓట్ల శాతం సుమారు 8% వరకు ఉంటుందని అంచనా…
-
సామ్రాట్ చౌదరి ఫేస్…: ఈ కీలకమైన ఓటు బ్యాంకుకు సామ్రాట్ చౌదరి బలమైన ప్రతినిధిగా పరిగణించబడతాడు…. ఈ వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించడం ద్వారా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ‘లవ్-కుష్’ (కుర్మి, కూష్వాహ) కూటమిలో చీలిక తీసుకురావాలని బీజేపీ వ్యూహం…
-
సామాజిక సమీకరణం…: బీహార్‌లో అధికారం చేపట్టడానికి బీజేపీకి ఒక బలమైన ఓబీసీ (నాన్-యాదవ్) ముఖం అవసరం. అందుకే కూష్వాహ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరిని రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా నియమించడం వ్యూహాత్మక చర్య…
- బీజేపీ, నితీష్ కుమార్ నాయకత్వంపై ఆధారపడకుండా, ఎప్పటికైనా బీహార్‌లో స్వంతంగా అధికారం స్థాపించాలనే లక్ష్యంతో ఉంది… ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సామ్రాట్ చౌదరి వంటి యువ, దూకుడు వైఖరి గల, వెనుకబడిన వర్గానికి చెందిన నాయకులు కావాలి తనకు…
Share this Article