Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… కథ చాలా ఉంది… ఆదానీలు, అంబానీలను మించి పార్టీలకు చెల్లింపులు..!!

March 15, 2024 by M S R

ఎలక్టోరల్ బాండ్స్… అంటే రాజకీయ పార్టీలకు విరాళాల ప్రహసనం చూస్తే ఏమనిపించింది..? సింపుల్‌‌గా సుప్రీంకోర్టు తీర్పును పక్కదోవ పట్టించి, ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో తెలియకుండా చేశారు విజయవంతంగా… అలా చేయగలరు కాబట్టే దేశాన్ని ఏలగలుగుతున్నారు… సరే.,.

ఒక అంబానీ, ఒక ఆదానీ, ఒక టాటా తదితర ఫేమస్ ప్లేయర్ల పేర్లు ఈ లిస్టుల్లో లేవేమిటి..,? ఎందుకంటే..? పొరపాటున కూడా అఫిషియల్ రికార్డుల్లో తమ పేర్లు, కంపెనీలు పేర్లు నమోదు కానివ్వరు… నెవ్వర్… ఎంత కావాలి, అడగండి, ఏ రూపంలో కావాలి, తీసుకుపొండి… అంతే…

అవునూ, ఈ బాండ్ల వివరాల వెల్లడితో ఎవరికైనా ఏమైనా నష్టమా..? ఏమీ లేదు… అదంతా చట్టప్రకారమే… కాకపోతే ఎక్కువ విరాళాలిచ్చిన కంపెనీకి క్విడ్ ప్రోకో కింద ఏమేం సాయాలు చేసింది అధికార పార్టీ అనే చర్చ జరుగుతుంది… ఈ లిస్టులో కాంగ్రెస్ పేరు ఎక్కడ అనే డిబేట్ జరుగుతుంది… ఎందుకు ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ విరాళాలు వచ్చాయనే చర్చ సాగుతుంది… లైక్ మమత, కేసీయార్  ఎట్సెట్రా…

Ads

దాదాపు 820 కోట్ల మేరకు మేఘా విరాళాలే రాజకీయాలు, కంట్రాక్టులు, కమీషన్లు గట్రా యవ్వారాలకు అతి పెద్ద ఉదాహరణ… ఈ లిస్టులో రెండో పేరు… అయితే టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ గాకుండా బీజేపీ కూడా డబ్బు తీసుకుందా..? అందుకే కాలేశ్వరం వంటి ప్రాజెక్టుల అవినీతిని పట్టించుకోలేదా అనే సందేహాలూ సాధారణం… జస్ట్, పదేళ్లకూ ఇప్పటికీ ఎంత తేడా..? మేఘా వేల కోట్లు దాటి లక్షల కోట్లకు టర్నోవర్ పెరిగి, దేశంలోకెల్లా ధనికుల జాబితాలోకి వచ్చేశారు ఓనర్లు…

కంట్రాక్టుల్లో తాము సంపాదించడమే కాదు, పార్టీలకూ ఉదారంగా  పంచిపెట్టారు… సరే, ఫస్ట్ పేరు చదివారుగా… ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్… ఏకంగా 1208 కోట్లు ఇచ్చాడు… అంటే తను ఎంత సంపాదించి ఉంటాడు…? ఎందుకింతగా ఇచ్చాడు..? కంపెనీ మురికి ఏమిటి..? ఇంతకీ ఎవరిది ఈ కంపెనీ…? ఇది శాంటియాగో మార్టిన్‌ది… ఆయన ఒకప్పుడు బర్మాలో కూలీ… ఇప్పుడు..?

 

bonds

మార్టిన్ వయస్సు 59… మయన్మార్ నుంచి ఇండియాకు వచ్చి చిన్న లాటరీ బిజినెస్ మొదలెట్టాడు… పేరు మార్టిన్ లాటరీ ఏజెన్సీస్… కోయంబత్తూరులో… దాంతో లాటరీ మార్టిన్ అనేవాళ్లు అందరూ… కోయంబత్తూరు నుంచి తన బిజినెస్‌ను మెల్లిగా కర్నాటక, కేరళలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాడు… లాటరీ మీద సగటు మనుషులకు ఉండే ఆశల మీద తన వ్యాపారాన్ని ఇంకా పెద్దగా నిర్మించడం మొదలెట్టాడు… తరువాత సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లకూ పాకిపోయాడు…

రాజకీయ మురికి అనేది తనకు ఫస్ట్ కేరళలోనే స్టార్ట్… ప్రభుత్వ ఆదాయంలో లాటరీల ఆదాయం కూడా ప్రముఖమైందే… అప్పటికే సిక్కిం ప్రభుత్వాన్ని 4500 కోట్ల మేరకు ఫ్రాడ్ చేశాడని ఆరోపణలున్నాయి తన మీద… సీపీఎం మౌత్ పీస్ దేశాభిమానికి 2 కోట్లు ఇచ్చాడట… అసలే అప్పుడు అచ్యుతానందన్‌కూ ప్రస్తుత సీఎం పినరై విజయన్‌కూ నడుమ గ్రూపు తగాదాలు… అచ్యుతానందన్ నేరుగా దాడి ప్రారంభించడంతో విజయన్ ఇబ్బందిపడి, చివరకు డబ్బు వాపస్ చేసి, పబ్లికేషన్ జనరల్ మేనేజర్ జయరాజన్‌ను తీసేయాల్సి వచ్చింది…

 

martin

నిజానికి మార్టిన్ ఖర్చులతో పోలిస్తే ఈ 2 కోట్లు చాలా తక్కువ.,. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ లాటరీ ప్రధాన ఆదాయ వనరు… కేరళ లాటరీ టికెట్ల ఆదాయం 2011లో 557 కోట్లు ఉంటే, అది 2020 నాటికి 9974 కోట్లకు పెరిగింది… మార్టిన్‌కు డీఎంకేతో కూడా సన్నిహిత సంబంధాలు… మాగ్జిమ్ గోర్కీ రాసిన ది మదర్ ఆధారంగా అప్పటి సీఎం కరుణానిధి ఇలైగ్నాన్ అనే సినిమాకు స్క్రిప్ట్, కథ రాశాడు… దాన్ని మార్టిన్ 20 కోట్లతో నిర్మించాడు…

జయలలిత అధికారంలోకి వచ్చాక కథ మారింది… మాఫియా కంట్రోల్ పేరిట ఆమె వందల మంది డీఎంకే కేడర్ మీద భూకబ్జా, గూండా యాక్ట్ కేసులతో ఉక్కుపాదం మోపింది… మార్టిన్ కూడా అరెస్టయ్యాడు… తరువాత మద్రాస్ హైకోర్టు బెయిల్ ఇచ్చి, అతన్ని నిర్బంధం నుంచి రక్షించింది… తను జైలులో ఉన్నప్పుడే తన భార్య లీమా రోజ్ హైప్రొఫైల్‌లోకి రాసాగింది… వేరే లాటరీ ఏజెంట్లు ఫేక్ కేసుల్లో మార్టిన్‌ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని కేసు పెట్టింది… ఐజేకే పార్టీలో చేరింది, అధికారంలోకి రాకముందు మోడీ కోయంబత్తూరు ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఆమె కూడా ప్రచారవేదిక మీద కనిపించింది…

Martin

మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున… తను ప్రస్తుత సీఎం స్టాలిన్ అల్లుడు శబరీశన్ క్లోజ్ సర్కిల్ మనిషి… డీఎంకే అనుబంధ విభాగాల్లో యాక్టివ్… డీఎంకే ఎన్నికల నిధుల సమీకరణ బ్యాచుల్లో ప్రధాన వ్యక్తి మార్టిన్ అల్లుడే… గత దశాబ్దంలో మార్టిన్ లాటరీ బిజినెస్ నుంచి వివిధ ఇతర రంగాల్లోకి విస్తరించాడు… కోయంబత్తూరు సమీపంలో హోమియో హాస్పిటల్ అండ్ కాలేజీ… టీవీ మ్యూజిక్ చానెల్ ఎస్ఎస్ మ్యూజిక్… ఎం అండ్ సీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్… మార్టిన్ నందవనం ప్రాజెక్టు అపార్ట్‌మెంట్స్… లీమా రియల్ ఎస్టేట్… ఇలా…

2011లో కర్నాటక, తమిళనాడు పోలీసులు తన అక్రమ లాటరీ వ్యాపారాలపై కన్నేసి, విస్తత సోదాలు నిర్వహించారు… 2015లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని మార్టిన్ క్యాంపసుల్లో దాడులు చేశారు… 2016లో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ దాడులు చేసింది… 2018లో తన ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ కేసులు పెట్టింది, సోదాలు చేసింది… సిక్కిం ప్రభుత్వాన్ని మోసం చేశాడనే ఆరోపణలపై తన 457 కోట్ల ఆస్తుల్ని 2023లో అటాచ్ చేశారు… సో, ఈడీ కేసులు, సీబీఐ కేసులు… పలు రాష్ట్రాల పోలీసుల కేసులు గట్రా ఏం సూచిస్తున్నాయి..? ఇంతటి భారీ విరాళాల దాతగా ఎందుకు మారినట్టు..? (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇన్‌పుట్స్ ఆధారంగా…)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions