Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు నిశ్చితార్థం వార్తలకన్నా… కొసరు సరదా వార్తలు, ఫోటోలే ఫుల్ ట్రెండింగ్…

August 9, 2024 by M S R

అక్కినేని నాగచైతన్య నటించిన ఓ సినిమాలో… ఎస్ అనే అక్షరంతో ఉన్న అమ్మాయే నా జీవితంలోకి వస్తుందని నా జాతకంలో ఉంది, నా ఎస్ నువ్వే అని ఎవరితోనో అంటాడు… ఇప్పుడు ఆ వీడియో వైరల్… పాత అమ్మాయి సమంత- ఎస్… కొత్త అమ్మాయి శోభిత- ఎస్… ఇది ఒక వార్త…

సమంత అక్కతో నాగ చైతన్య నిశ్చితార్థం అని మరో వార్త… ట్విస్టింగ్, యూబ్యూబ్ బాపతు థంబ్ నెయిల్ వార్త అన్నమాట… ఐతే నాగ చైతన్య మొదటి భార్య సమంత కాదు… శోభిత చెల్లె పేరు కూడా సమంతే… సో, సమంత అక్కతో చైతూ ఎంగేజ్‌మెంట్ అనే వార్త టెక్నికల్లీ నాట్ రాంగ్… చిన్న సరదా వార్త…

సమంత పెళ్లిలో శోభిత సందడి అనే వార్త, ఫోటోలు కూడా ఇలాంటివే… శోభిత చెల్లె సమంత ఢిల్లీ ఫిజిషియన్ సాహిల్ గుప్తాను పెళ్లి చేసుకుంది… ఆ పెళ్లిలో మరి శోభిత సందడి సహజమే కదా… ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి నిన్నటి నుంచీ…

Ads

గతంలో నటి సమంత నాగ చైతన్యకు 8.8 (అంటే ఆగస్టు 8) నాడు ప్రపోజ్ చేసిందట, తనే చెప్పింది గతంలో… ఇప్పుడూ అదే తేదీ… 8 ఆగస్టు… శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం… (2024 అంకెలు కలిపితే 8… నాగ చైతన్య లక్కీ నంబర్ 8…) వీళ్ల నిశ్చితార్థాన్ని ప్రకటిస్తూ నాగార్జున రాసుకొచ్చింది కూడా 8.8.8 అనే… అదే తేదీ అంటూ మరికొన్ని వార్తలు…

గతంలో నాగార్జున ఏదో సినిమా ప్రమోషన్‌లో మాట్లాడుతూ శోభిత ప్రస్తావన వచ్చినప్పుడు ‘ఆమె చాలా హాట్’ అని వ్యాఖ్యానించాడు… ఇప్పుడు ఆమే తన కోడలు… ఆ పాత వీడియో, నాగార్జున వ్యాఖ్యలూ మళ్లీ వైరల్ అవుతున్నాయి… ఇవే కాదు, చివరకు ఆమె గతంలో కండోమ్స్‌కు చేసిన యాడ్స్ కూడా వైరల్ చేస్తున్నారు… ఇలాంటి ఈ ఇద్దరి నిశ్చితార్థం వార్తలకన్నా ఇదుగో ఇలాంటి సరదా వార్తలే నిన్న బాగా ట్రెండింగ్…

నాగ చైతన్య నుంచి విడిపోయిన సమంత ఈ నిశ్చితార్థం మీద ఎలా స్పందిస్తుంది..? ఇదీ ఓ వార్త… ఇవన్నీ చదువుతూ చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్న ఓ ప్రశ్న… అసలు ఎవరు ఈ ధూళిపాళ శోభిత..? నిజంగానే చాలామందికి తెలియదు… ఆమె తెలుగు అమ్మాయనీ తెలియదు… నెట్‌లో నిన్న విపరీతమైన సెర్చింగు… ఆమె ఎవరనే కాదు..? ఆమె కులం ఏమిటని..? మన తెలుగువాళ్ల ఈ కులాన్వేషణ తెలిసిందే కదా…

నిజమే, ఆమె పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, చాలామందికి తెలియకపోవడానికి కారణం, ఆమె చేసింది రెండే సినిమాలు… రెండూ అడవి శేషుతోనే… మొదటిది గూఢచారి, తరువాత మేజర్… మేజర్ సినిమా ప్రమోషన్లకు సంబంధించి పలు మీడియా మీట్లలో, టీవీ షోలలో సందడి చేసినా సరే, పెద్దగా జనం మెదళ్లలో రిజిష్టర్ కాలేదు…

నిజానికి రెండేళ్లుగా శోభిత, నాగ చైతన్య రిలేషన్ షిప్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నవే… జర్మనీలోనూ జంటగా కనిపించిన వేళ ఆ వార్తలూ బాగానే చక్కర్లు కొట్టాయి… తమకు శృతి కలుస్తుందని నమ్మకం కుదిరాకే ఇక నిశ్చితార్థం వైపు అడుగులు వేశారు… ఆల్రెడీ చైతూ పెళ్లి విషయంలో ఓ చేదు అనుభవం ఉన్నందున నాగార్జున కూడా వెంటనే వోకే చెప్పాడట… సమంత కోరిక మేరకు రెండు మత సంప్రదాయాల్లో పెళ్లి చేశారు అప్పట్లో… ఇప్పుడిక ఏకంగా ఓ తెలుగమ్మాయే దొరికింది…

అవును, ఆమెది తెనాలి… తండ్రి ఓ మర్చంట్ నేవీ ఇంజనీర్… తల్లి టీచర్… ఓ బ్రాహ్మణ కుటుంబం… విశాఖపట్టణంలో పెరిగిన ఈమె స్కూలింగయ్యాక ముంబై వెళ్లి కార్పొరేట్ లా చదివింది… భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ… 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ … మిస్ ఎర్త్ పోటీలో ఇండియాను రిప్రజెంట్ చేసింది… మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీ ఫర్ ఎ కాజ్, మిస్ టాలెంట్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ అని రకరకాల గుర్తింపులైతే పొందింది…

శోభిత

2014లో కింగ్‌ఫిషర్ కేలండర్‌లో కూడా ఉంది… ప్రధానంగా మోడల్ ఆమె… తరువాత విక్కీ కౌశల్ సరసన 2016లో ఏదో సినిమాలో నటించింది… హిందీ, ఇంగ్లిషు సినిమాలు, వెబ్ సీరీస్… తెలుగులో రెండు సినిమాలు… నిజానికి ఆమె పొన్నియన్ సెల్వన్‌లో నటించాక చాలామందికి తెలిసింది… కపిల్ శర్మ కామెడీ షోలో ఆ సినిమా ప్రమోషన్‌లో కనిపించింది…  ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలిగా మొత్తం తెలుగువాళ్లకూ పరిచయమైపోయింది…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions