కమలా హారిస్… హఠాత్తుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం వరించబోతోంది… అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ… సర్వేల్లో కూడా ముందంజలో ఉంది… అంతటి అగ్రరాజ్యానికి ఇప్పటివరకూ ఓ మహిళ ప్రెసిడెంట్ కాలేదు… అవుతుందా..? కాలం చెబుతుంది… కానీ తమిళనాడులోని ఒక ఊరు సంబరాల్లో ఉంది…
ఆమె నిలబడాలనీ, గెలవాలనీ దేవుళ్లను ప్రార్థిస్తోంది… పటాకులు కాలుస్తోంది… మిఠాయిలు పంచుకుంటోంది… ఆ ఊరి పేరు తులసేంద్రపురం… ఎక్కడో చెన్నైకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది… ఎందుకు ఆ ఊరు సంబరపడుతోంది..? కమలకూ ఆ ఊరికీ ఏం సంబంధం..?
కమల తల్లి పేరు శ్యామల గోపాలన్… రొమ్ము కేన్సర్ పరిశోధకురాలు, హక్కుల కార్యకర్త… 1958లో అంటే, ఆమెకు 19 ఏళ్ల వయస్సులో అమెరికా ప్రయాణమైంది… ఆ రోజుల్లో ఒక మహిళ ఆ వయస్సులో అమెరికాకు వెళ్లడం అంటే అదొక నమ్మశక్యం గాని విషయం… ఆ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే…
Ads
ఆ తులసేంద్రపురం శ్యామల పుట్టింటి ఊరు… అంటే, కమలా హారిస్ అమ్మమ్మ ఊరు… అందుకే కమలా హారిస్ అంటే ఆ ఊరికి అంత అభిమానం… మా ఊరి బిడ్డ అని..! కమలా హారిస్ తల్లి అంటే, శ్యామలకు 1960లో హారిస్ పరిచయం… అదీ ఓక్లాండ్ వీథుల్లో ఏవో ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో… తనవి జమైకన్ రూట్స్… అంటే ఆఫ్రికన్- అమెరికన్ … 1960లో పెళ్లి చేసుకున్నారు… కానీ పదేళ్లలోనే, అంటే 1970లో విడాకులు…
కమలకు 12 ఏళ్ల వయస్సున్నప్పుడు కెనడాకు వెళ్లింది కుటుంబం… తన ఇద్దరు పిల్లలకు కమల, మాయ అనే హిందూ పేర్లే పెట్టుకుంది… అంతేకాదు, 70 ఏళ్ల వయస్సులో తను చనిపోవడంకన్నా ముందు తన అస్థికల్ని చెన్నై దగ్గరే సముద్రంలో కలపాలని కమలను కోరింది… అందుకని ఆమె మరణించాక అస్థికల్ని తీసుకుని చెన్నై వచ్చిందామె…
ఆమె ప్రాక్టీసింగ్ హిందూ కాకపోవచ్చుగాక… తను ఓ అమెరికన్‌ను పెళ్లి చేసుకుని ఉండవచ్చు… కానీ తల్లి విశ్వాసాల్ని గౌరవించింది… అదీ ఆమెను నచ్చేలా చేసింది… అఫ్‌కోర్స్, ఆమె ఇండియన్ రూట్స్ అయి ఉండవచ్చు, కానీ కశ్మీర్ వంటి అంశాల్లో భారత వ్యతిరేక స్టాండే తీసుకుంది… ఇప్పుడు కూడా అంతే, ఆమె పార్టీ పాలసీని బట్టి నడుస్తుంది తప్ప ఇండియా అంటే అంత అసాధారణ ప్రేమ ఏమీ చూపించదు… అసాధ్యం కూడా..! ఎందుకంటే, ఆమె అమెరికన్ కాబట్టి..!!
ఈ మొత్తం కథనంలో ఐరనీ, ట్రాజెడీ ఏమిటంటే… తన జీవితమంతా ఏ కేన్సర్ మీద పరిశోధనలకు వెచ్చించిందో… అదే కేన్సర్ బారిన పడి మరణించింది శ్యామల… దటీజ్ డెస్టినీ..!!
Share this Article