ఇండియన్ రూట్స్ ఉన్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్… తన కేబినెట్‌లోని మరో ఇండియన్ రూట్స్ హోం మినిస్టర్ సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించాడు… ఇదీ నిన్నటి నుంచీ జాతీయ, అంతర్జాతీయ మీడియాలో నలుగుతున్న ఓ ప్రధాన వార్త… తను మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను తన కేబినెట్‌లో తీసుకోవడంకన్నా సుయెల్లాను తొలగించడం మీదే ఎక్కువ చర్చ… అసలు ఎవరు ఈమె..? ఇండియాతో ఏం సంబంధం..?
భారతీయ మూలాలున్న రిషి సేమ్ తనలాంటి నేపథ్యమే ఉన్న సుయెల్లాను తీసేయడం ఏమిటి అనేది మరో చర్చ… సింపుల్… పేకాట పేకాటే, బామ్మర్ది బామ్మర్దే… ఈ పరిణామాల్ని భారతీయ మూలాల కోణం నుంచి కాదు, బ్రిటన్ రాజకీయ కోణంలోనే చూడాలి… ఆమె కంట్రవర్సీ… ఇండియాకు సంబంధించి కూడా పెద్ద ఆపేక్షను, అభిమానాన్ని చూపించే వ్యక్తి కూడా కాదు… జస్ట్, ఓ బ్రిటిష్ పొలిటిషయన్‌లాగే ఆలోచిస్తుంది… కాకపోతే ఈమధ్య పాలస్తీనా- ఇజ్రాయిల్ యుద్దానికి సంబంధించి ఆమె పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు చేసి, అక్కడి అధికార పార్టీకి కంటగింపుగా మారి, చివరకు కేబినెట్ నుంచి తరమబడాల్సి వచ్చింది…
సరే, కాసేపు ఆ రాజకీయాల జోలికి వెళ్లకుండా… అసలు ఎవరామె అని చూస్తే… ఆమె పుట్టిందీ, పెరిగిందీ బ్రిటన్‌లోనే… కాకపోతే ఇద్దరు ఇండియన్ రూట్స్ ఉన్న పేరెంట్స్… తల్లి పేరు ఉమ… ఎస్, మీరు ఊహించింది నిజమే… సౌతిండియన్, అదీ తమిళ హిందూ మూలాలున్న లేడీ… వృత్తి నర్స్… తనూ పొలిటిషియన్‌గా మారింది తరువాత… తండ్రి పేరు క్రిస్టీ ఫెర్నాండెజ్… గోవా క్రిస్టియన్ నేపథ్యం… ఇద్దరూ ఇండియా నుంచి నేరుగా బ్రిటన్ వలసవెళ్లలేదు… (ఓ పాపులర్ అమెరికన్ టీవీ సీరియల్ పాత్ర సూ యెల్లే ఇవింగ్ నుంచి తన బిడ్డకు సుయెల్లా అని పేరు పెట్టుకుంది…)
Ads
తల్లి మారిషస్ నుంచి… తండ్రి కెన్యా నుంచి అరవైల్లో బ్రిటన్ వచ్చారు… అదీ ఆమె పుట్టుక… తను పెళ్లిచేసుకున్నదేమో రేల్ బ్రేవర్‌మాన్… తన పేరులోని బ్రేవర్‌మాన్ అలా వచ్చిందే… తను యూదు జాతీయుడు… మొదట్లో ఇజ్రాయిల్‌వాసి, తరువాత దక్షిణాఫ్రికా… అక్కడి నుంచి బ్రిటన్ వచ్చాడు… మెర్సిడెస్ బెంజ్ గ్రూపులో మేనేజర్‌గా పనిచేసేవాడు… తను బుద్ధిస్ట్… సో, సుయెల్లా కూడా అదే పంథా… ఆమె ఎంపీగా పదవీ ప్రమాణస్వీకారం కూడా ‘ధమ్మపథం’ మీద ప్రమాణం చేసే…
ఆమె కుటుంబం మారిషస్, తమిళనాడు, గోవా, కెన్యా, దక్షిణాఫ్రికా, యూదు, హిందూ, క్రిస్టియన్, బౌద్ధ, ఇజ్రాయిల్ కల్చర్ల సంగమం… ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్లు విశ్వమానవులు… ఆమె ఎప్పుడూ ఓ బ్రిటిషర్‌గానే ఆలోచిస్తుంది… ఇండియా- బ్రిటన్ ట్రేడ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దీనివల్ల ఇండియా నుంచి వలసలు ఎక్కువవుతాయనీ, ఇప్పటికే వీసాల కాలపరిమితి ముగిశాక లక్షల మంది ఇండియన్లు బ్రిటన్‌లోనే ఉంటున్నారని ఓసారి వ్యాఖ్యానించింది…
సేమ్, వీళ్లలాగే రిషి సునాక్ పుట్టుక కూడా రకరకాల దేశాల సంగమం… తల్లి ఉష టాంజానియాలో పుట్టింది… తండ్రి యశ్‌వీర్ కెన్యాలో పుట్టాడు… ఇద్దరివీ పంజాబ్ రూట్స్… ఆయా దేశాల నుంచి బ్రిటన్ చేరారు… మన మూలాలున్నా సరే… ఒక అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అయినా… ఒక బ్రిటన్ మాజీ హోం మినిస్టర్ సుయెల్లా అయినా… బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అయినా… వాళ్లు ఉండే దేశాల ప్రయోజనాల కోణంలోనే ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు… వాళ్లు నివసించే దేశాలే వాళ్ల స్వస్థలాలు… అంతే… రూట్స్ ప్రభావం ఉండదా అంటే… ఉంటుంది… కొంత…!!
Share this Article