.
అమెరికా చరిత్రలో మొదటిసారిగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ “చీఫ్ ఆఫ్ స్టాఫ్” స్థానం కోసం ఒక మహిళను ఈ రోజు డోనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశాడు.
ప్రస్తుత ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయి అయిన అమెరికా అధ్యక్షుడి షెడ్యూల్ నిర్వహణ చూడటం, ఎవరు అతనిని కలవాలి, కలవకూడదు వంటి నిర్ణయాలు, అతనికి తెలియజేయాల్సిన విషయాలు, చెప్పకుండా నివారించాల్సిన అంశాలు, వ్యక్తిగత మరియు వ్యవస్థాగత విషయాల సమన్వయం, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలతో అనుసంధానం లాంటి అన్ని బాధ్యతలు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇది డైరక్ట్ గా ఎన్నిక కాకుండా నియమించబడే అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఒకటి.
Ads
అయితే చరిత్ర సృష్టించడం మనం అనుకున్నంత సులభం కాదు. డోనాల్డ్ ట్రంప్ మొన్న గెలిచిన తర్వాత ప్రసంగం ఇస్తున్న సమయంలో, కొద్దిసేపు మాట్లాడి తన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ను మాట్లాడమని పిలిచాడు. వాన్స్ ఒక అర నిమిషం మాట్లాడి మళ్లీ ట్రంప్‌కు మైక్ ఇచ్చాడు.
ఆ తరువాత, ట్రంప్ తన రాజకీయ ప్రచార మేనేజర్ సుసాన్ విల్స్ (సుసీ విల్స్) ను సమీపానికి పిలిచి అభినందించి, కొన్ని మాటలు చెప్పమని కోరాడు. ఆమె చక్కగా హ్యాండ్‌షేక్ ఇచ్చి, “నేను మాట్లాడను, వద్దులే” అని చెప్పి, తన అసోసియేట్ క్యాంపెయిన్ మేనేజర్ క్రిస్‌ను పిలిచి మాట్లాడమని సూచించింది.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్థానంలో ఉండబోయే వ్యక్తి విజయం సాధించిన ఆ క్షణం, ట్రంప్ నోటితో సుసీ విల్స్ పేరు చెప్పటం ఒక ఘనత. అతని పిలుపు మేరకు సుసీ విల్స్ దగ్గరికి వచ్చి “నేను మాట్లాడను, వద్దులే, అని చెప్పటం నిజంగా పరిణతితో కూడిన పనితనం. రాజకీయ ప్రపంచం అంతా 100 కోట్లకి పైగా చూసే చారిత్రాత్మక సందర్భంలో నేను మాట్లాడను, వద్దులే అని ట్రంప్ కే చెప్పి వెనక ఒద్దికగా నిలబడటమే ఆమె పనితనం.
సుసీ విల్స్ (Susie Wiles) డోనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల క్యాంపెయిన్ మేనేజర్. ఆమె చదివింది సాధారణ బ్యాచిలర్ డిగ్రీ, అదీ BA ఇంగ్లీష్. హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదవలేదు, MIT లో MBA చేయలేదు, చికాగో యూనివర్శిటీ లో LAW చేయలేదు.
2016లో ట్రంప్ ఫ్లోరిడాలో తన స్థానం బలోపేతం చేయాలనుకున్నప్పుడు, ఫ్లోరిడా రాజకీయాలపై పట్టు ఉన్న సుసీ విల్స్‌ను తన టీమ్‌లో చేర్చుకున్నారు. ఆమె నిజాయతీ, సమర్ధత నచ్చి 2024లో ఆమెను తన ప్రచార మేనేజర్‌గా నియమించారు. ట్రంప్ ఈ ఎన్నికల్లో విజయం సాధించడంలో సుసీ విల్స్ పాత్ర ముఖ్యమైనది.
సుసీ విల్స్ సాధారణంగా ముందుకు వచ్చి మాట్లాడకుండా, వెనుక ఉండి అన్ని పనులు నిర్వహిస్తూ ఉంటుంది. ట్రంప్ ఈ ఎన్నికల్లో cool, calm, and composed గా ఉన్నాడు అంటే సుసీ విల్స్ వలనే.
డోనాల్డ్ ట్రంప్ సమర్థత మరియూ నిజాయితీ తో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేయడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. అలాంటి నైపుణ్యానికే ఇప్పుడూ పట్టం కట్టి ఏకం గా అమెరికా అధ్యక్ష భవనానికి “చీఫ్ ఆఫ్ స్టాఫ్” గా నియమించాడు ట్రంప్.
సుసీ విల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించడం చరిత్రాత్మక నిర్ణయం. 2016లో ట్రంప్ ప్రచారంలో కోరీ లెవాండోవ్‌స్కీ కీలక పాత్ర పోషించినప్పటికీ, నిజమైన కార్యకర్తలని కాకుండా కులపిచ్చి తో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అని తెలుసుకొని ఆ తర్వాత అవినీతి ఆరోపణలు రావటం తో ఆయనను తప్పించాడు ట్రంప్. ప్రస్తుత క్యాంపెయిన్ మేనేజర్ సుసీ విల్స్, ఆమె నిజాయితీ, సమర్థతతో, ట్రంప్ చుట్టూ ఈగో లేని వాతావరణాన్ని సృష్టిస్తుంది. పార్టీలో ఆమెకు విశాలమైన మద్దతు ఉంది.
చరిత్ర సృష్టించాలంటే నిజాయితీ, సమర్థత కలిగిన టీమ్‌ను ఏర్పరచుకోవడం, వారి సలహాలను పాటించడం ముఖ్యం – అని ప్రపంచ చరిత్ర చెప్తున్న నగ్న సత్యం…… – జగన్నాథ్ గౌడ్
Share this Article