.
ముందుగా ఓ తాజా వార్త చదవండి…‘‘అఖండ2 సినిమా టికెట్ ధరల పెంపు నాకు తెలియకుండా జరిగింది అంటున్న సినిమా ఆటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి…
ఇకముందు ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదు, హీరోలకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారు? అఖండ -2 విషయంలో నాకు తెలియకుండా పొరపాటున టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు…
Ads
నేను గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాను, ఈసారి నా శాఖ అధికారులు పొరపాటున పెంచేశారు… సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది, ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా?
సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరూ టికెట్ ధరలు పెంచమని నన్ను అడగకండి’’ – సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….
….. ఇదీ వార్త… అవును, నిన్నెందుకు అడుగుతారు టికెట్ల రేట్లు పెంచమని..? అసలు నిన్ను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎవరు పరిగణిస్తున్నారు..? రోహిణ్ రెడ్డి, దిల్ రాజు కదా తెలంగాణ సినిమాటోగ్రఫీ ఉమ్మడి మంత్రులు… నీకు తెలియకుండా నీ శాఖ అధికారులు అఖండ రేట్లు పెంచారా..? ఐతే నీ శాఖలో బాధ్యులను సస్పెండ్ చేస్తావా మరి..?
హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తే నీకెందుకు అమాత్యవర్యా..? నువ్వు రేట్లు పెంచకు, ఓ విధానం తీసుకురా… ఒకవైపు సాక్షాత్తూ ముఖ్యమంత్రే సినిమాల పాలసీలో తప్పులు చేస్తున్నాడు… బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, టికెట్ రేట్ల హైక్ ఉండదని సంధ్య థియేటర్ దుర్ఘటన జరిగినప్పుడు చెప్పింది ప్రభుత్వం…
మళ్లీ ఏమైంది…? అన్నీ మొదలయ్యాయి… మొన్నటికిమొన్న ఓజీ సినిమా విషయంలో ఈ ప్రీమియర్లు ఏమిటి..? రేట్లు పెంచడం ఏమిటి..? అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కదా… మళ్లీ అఖండగ-2 సినిమా రేట్లు ఎలా పెంచినట్టు..? ప్రీమియర్లకు అనుమతి ఎందుకు ఇచ్చినట్టు..? కోర్టు ధోరణికి భిన్నంగా వెళ్లింది ప్రభుత్వమే కాదా..?
పైగా సంబంధిత శాఖను చూస్తూ, నాకు సంబంధం లేదు, అబ్బే, నాకేమీ తెలియదని అనడం ఏమిటి..? ఒకవైపు కోర్టు ఈ ప్రీమియర్ రేట్లు ఏమిటని అడగితే… మరోవైపు బుక్ మైషోలో అడ్డగోలు రేట్లకు టికెట్లు అమ్మేశారు… కోర్టు మళ్లీ ఈరోజు అడిగింది అదే… మీమీద కంటెంప్ట్ విచారణ ఎందుకు జరపవద్దని..!
మరోవైపు డివిజన్ బెంచ్ మొన్నటి సింగిల్ బెంచ్ పాత తీర్పుపై స్టే ఇచ్చి, విచారణను వాయిదా వేసింది… వెరసి అంతా ఏం జరుగుతున్నదో తెలియని అయోమయం నెలకొంది… అసలు కోర్టు వద్దన్నా ప్రీమియర్లు వేసి, ఎక్కువ రేట్లు వసూలు చేసిన తెగింపు ఎలా ఆమోదనీయం..?!
అసలు బేసిక్ ప్రశ్న, టికెట్ రేట్ల ధరలు ఎందుకు పెంచాలి..? ప్రీమియర్లు ఎందుకు వేయాలి..? సినిమాల నిర్మాణ వ్యయం పెరిగితే ప్రేక్షకుడు ఎందుకు భరించాలి..? అది నిర్మాత రిస్క్, వ్యాపారం, దందా… జనం ఆదరిస్తే తేలతాడు, లేకపోతే మునుగుతాడు… ప్రభుత్వానికి ఎందుకు తీట..?! డివిజన్ బెంచ్ ఈసారి క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇస్తే బాగుండు..!!
తెలంగాణ మూవీ పాలసీకన్నా అఖండ ఓ మనిషిని బాలయ్య తలకిందులుగా పట్టుకుని హారతి ఇస్తాడు చూడండి... అది కాస్త ఫెయిర్ అండ్ బెటర్..!!
Share this Article