Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?

September 11, 2025 by M S R

.

చంద్రగ్రహణం ప్రపంచంలోని నాలుగు దేశాల ప్రధానులు రెండు రోజుల్లో తమ పదవుల్ని కోల్పోయేలా చేసింది… ఇక సూర్యగ్రహణం వంతు..? మోడీయేనా..? ట్రంపుడా..?

ఇప్పుడు ఈ చర్చ వైరల్ అవుతోంది… దీనికి కారణం భారతీయ వ్యాపారి హర్ష గోయెంకా పెట్టిన ఓ పోస్టు… తను ఏమంటాడంటే..? ‘‘రెండు రోజుల్లోనే… జపాన్ పీఎం దిగిపోయాడు, ఫ్రాన్స్ పీఎం దిగిపోయాడు, నేపాల్ పీఎం దిగిపోయాడు, థాయ్‌లాండ్ పీఎం దిగిపోయాడు… ఇప్పుడు అందరికన్నూ సూర్యగ్రహణంపైనే… ఓ పేద్ద నారింజనేత..?’’

Ads

Orange Man, Orange Tinted అని డొనాల్డ్ ట్రంపును వ్యంగ్యంగా ప్రస్తావిస్తుంటారు… సో, ట్రంపుకి పదవీగండం తప్పదేమో అని అర్థమొచ్చేలా ట్వీటినట్టుంది గోయెంకా… తనూ సరదాగా, వ్యంగ్యంగా చేసిన ట్వీట్ అది…

ఇటీవల జరిగిన చంద్రగ్రహణం తర్వాత రెండు రోజుల్లో నేపాల్ (ప్రధాని కే‌పీ శర్మ్ ఓలీ), ఫ్రాన్స్ (ఫ్రాంకువాస్ బర్రో), థాయ్‌లాండ్ (షిన్‌వత్రా), జపాన్ (షింగేరు ఇషిబా) లాంటి దేశాలలో ప్రధానులు పదవులు వదిలేయాల్సి వచ్చింది… ఇదంతా నిజమే…



 

Effect of Chandragrahan in the last 2 days:
🇯🇵 Japan PM gone
🇫🇷 France PM gone
🇳🇵 Nepal PM gone
🇹🇭 Thailand PM gone

Now all eyes on Surya Grahan… a big “orange-tinted” leader might be next.

— Harsh Goenka (@hvgoenka) September 10, 2025


ఉంది, తరతరాలుగా గ్రహణాల ప్రభావం రాజకీయాలపై ఉంటుందనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఉంది… రెండు రోజుల్లోనే నలుగురు ప్రధానుల పోస్టులు ఊడిపోవడంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకుంది…

నిజానికి గ్రహాలు ఒకదానికి ఒకటి తమ గమనంలో అడ్డురావడం తప్ప గ్రహణాలకు శాస్త్రీయ కారణం లేదు, ప్రభావాలు అనేవి నమ్మకాలు తప్ప శాస్త్రీయం కావు… కానీ జ్యోతిష్కులు ఊరుకోరు కదా… గ్రహసంచారాన్ని బట్టి జాతకఫలాలు అంటారు కదా… నో, నో, విశ్వంలో జరిగే ప్రతి కదలికకూ ఓ కారణం ఉంటుంది, దాని ఫలితమూ ఉంటుందీ అంటారు సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసులు…

సరే, ఇదీ చర్చ… నలుగురు ప్రధానులు తమ పదవుల్ని కోల్పోవడానికి వేర్వేరు కారణాలున్నాయి… కానీ గోయెంకా చెప్పిన ఆరెంజ్ స్టార్ ఎవరు..? చాలామంది ట్రంపు అంటున్నారు… కానీ ఈ ట్వీట్ కనిపించగానే ‘‘ఇది ఖచ్చితంగా మోడీయే, ప్రస్తుతం ప్రపంచంలో ఆరెంజ్ లీడర్ తనే’’ అని మోడీ వ్యతిరేక సెక్షన్ ప్రచారం మొదలుపెట్టింది…

ఎందుకయ్యా అంటే..? ఈ 17తో తనకు 75 ఏళ్లు నిండుతాయి… 75 దాటితే బీజేపీలో ఎవరైనా సరే, తమ పదవులు నుంచి తప్పుకుని, థింకర్స్-గైడ్స్ బెంచ్ మీదకు వెళ్లిపోవాల్సిందేనని మోడీ బ్యాచే కదా గతంలో ప్రాచుర్యంలోకి తెచ్చింది, చాలామందిని తప్పించింది… సో, సూర్యగ్రహణంతో మోడీ పని ఖతం అనేది వాళ్ల ప్రచార సారాంశం… కానీ మోడీ కుర్చీని వదలడు… ఇవేవీ పట్టించుకోడు… అది రియాలిటీ…

modi

ఏ దేశంలో ఎందరు ప్రధానులు మారినా, ఇండియాలో ఒక్కడే… 2014 నుంచి ఇదుగో వివరాలు అని ఆల్రెడీ కాషాయ శిబిరం స్టార్ట్ చేసింది కూడా… ఇలా…

నిజానికి 2017 లో కూడా ట్రంపుపై సూర్యగ్రహణ ప్రభావం, తన పని ఖతం అని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు అమెరికాలో ట్రంపు వ్యతిరేకులు… ఏమైంది..? ఏమీ కాలేదు… ప్రపంచ దేశాలను తన సుంకాల దాడితో కకావికలం చేస్తున్నాడు… తన పోస్టు ఊడిపోవడం ఇప్పుడు ప్రపంచ అభిలాష కావచ్చుగాక, కానీ సూర్యగ్రహణం కాదు, ఇంకేదో బలమైన శాస్త్రీయ కారణమే కావాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?
  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions