.
అవునూ… ఒక ఝాన్సీ రాణి… ఒక రాణి రుద్రమ గురించి చదివాం, విన్నాం… మన చరిత్ర పుస్తకాల్లో ఏమీ లేకపోయినా బోలెడు సాహిత్యం, ఇతర కళారూపాల ద్వారా తెలుసుకున్నాం… అలాంటి మరో ధీరవనిత, ఏకంగా ఔరంగ జేబును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఓ తారా బాయి గురించి తెలుసా..?
శివాజీ గురించి బాగా తెలుసు… ప్రైడ్ ఆఫ్ హిందూగా సుప్రసిద్ధుడే… తన కొడుకు శంభాజీ గురించీ ఇప్పుడు తెలుస్తోంది ఛావా సినిమాతో… తమ సామ్రాజ్య విస్తరణకు అడ్డంకిగా మారిన శంభాజీని కృూరంగా హత్యచేశారు… తరువాత ఆయన భార్య యశోబాయిను ఏళ్లకేళ్లుగా జైలుపాలు చేశారు మొఘలులు… అదీ చదువుకున్నాం ‘ముచ్చట’లో…
Ads
మరిక మొత్తం మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబు హస్తగతం చేసేసుకున్నాడా..? లేదు… శంభాజీ సోదరుడి భార్య, అంటే శివాజీ కోడలు తారాబాయి కొంగు బిగించింది… తనే రంగంలోకి దిగింది… భారతీయ వనిత ధీరత్వం ఎలా ఉంటుందో మొఘలులకు చూపించింది… ఆ వివరాల్లోకి వెళ్తే…
శివాజీ, తరువాత శంభాజీ, తరువాత రాజారాం… ఆ రాజారాం భార్య తారాబాయి… రాజారాాం మరణించాక మరాఠా సామ్రాజ్యం అంధకారంలో పడింది… అప్పుడు ఆమె పగ్గాలు తన చేతుల్లోకి తీసుకుంది… ఆమె ఎవరంటే..? శివాజీ సర్వసేనాధిపతిగా వ్యవహరించిన హంబీర్‌రావు మొహితే బిడ్డ…
చిన్నతనంలోనే ఆమె కత్తి పోరాటం, విలువిద్య, గుర్రపు స్వారీ, దౌత్యం మరియు రాజ్యపాలనలోని ఇతర విషయాలలో బాగా శిక్షణ పొందింది. మొఘల్ మరియు మరాఠా సామ్రాజ్యాల మధ్య నిరంతర యుద్ధ సమయములో పెరగడం వల్ల, ఈ నైపుణ్యాలు రాబోయే సంవత్సరాలలో ఆమెకు బాగా ఉపయోగపడ్డాయి…
8 సంవత్సరాల వయస్సులోనే తారాబాయి శివాజీ రెండవ కుమారుడైన రాజారాం ని వివాహం చేసుకుంది. రాజారాం మరణించాక తన కొడుకును పాలకుడిగా ప్రకటించి, తల్లి తారాబాయిని ప్రతినిధిగా ప్రకటించారు… సో, మొఘలులకు ఓ పసిపాలకుడు, అతని తల్లి ప్రతిబంధకాలయ్యారు… ఆఫ్టరాల్ ఓ వితంతువు తారాబాయి ఎంత, ఇట్టే లొంగిపోతుందిలే అనుకున్నారు…
మొఘలులు ఎక్కడ మరాఠా ప్రాంతాలపై దాడి చేస్తే అక్కడ దీటుగా ఎదుర్కొంది ఆమె, తిప్పికొట్టింది… ప్రాంతీయంగా ఎక్కడికక్కడ కూటములను నిర్మించడం, వనరుల సమీకరణ, సైనికుల శిక్షణ, నియామకంతోపాటు యుద్ధరంగంలో తను ముందుండి నడిపించేది…
తారాబాయి మొఘల్ దళాలచే 4 రోజుల పాటు క్లుప్తంగా బంధించబడింది ఓ యుద్ధంలో.., కాని మొఘల్ శిబిరంపై మరాఠా బలగాలు దాడి చేసిన తరువాత ఆమె తప్పించుకుంది… తారాబాయి గొప్ప బలం ఏమిటంటే, ఆమె తన శత్రువుల నుండి కూడా నేర్చుకోవడం ఎప్పుడూ ఆపలేదు…
ఔరంగజేబుకు శత్రు సైన్యపు కమాండర్లకు లంచం ఇచ్చే ప్రత్యేక వ్యూహం ఉండేది… వాడి విజయాలన్నీ కుట్రలు, కోవర్టు ఆపరేషన్లతో సాధించినవే… తారాబాయి కూడా మొఘలులకు వ్యతిరేకంగా అదే చేసింది… ఫలితంగా ఆమె సైన్యం మాల్వా మరియు గుజరాత్ వరకు మొఘల్ భూభాగంలోకి చొచ్చుకుపోయింది….
చివరకు ఆమెను ఓడించింది యుద్ధం కాదు, స్వపక్షంలోని రాజకీయ కుయుక్తులు… ఔరంగజేబు మరణం తరువాత మొఘలులు భేదోపాయాన్ని ప్రయోగించారు… జైలులో తల్లి యశోబాయితోపాటు ఉన్న శాహూను విడుదల చేశారు… నిజానికి కుర్చీకి ఆ శంభాజీ కొడుకే కదా వారసుడు…
వెళ్లి కుర్చీ దక్కించుకో అనే షరతుతోనే విడుదల చేశారు… వెళ్లి తారాబాయిని సవాల్ చేస్తాడు శాహూ… శాహూను ఛత్రపతిగా గుర్తించడానికి తారాబాయి నిరాకరించింది… తన విడుదల వెనుక మొఘలుల వ్యూహాన్ని గుర్తించింది… అది మరాఠా రాజ్యానికి ప్రమాదమని ఆమె భయం… దాంతో శాహూనే తలపడాల్సి వచ్చింది…
క్రమేపీ శాహూ బలం పెరిగింది… మరాఠా ప్రముఖుల్లో చాలామంది శాహూకే మద్దతు… చివరకు శాహూ తదుపరి ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డాక తారాబాయి కొల్లాపూర్ చేరుకుని స్వంత సంస్థానం అని ప్రకటించింది… శాహూ అంగీకరించలేదు… ఫలితంగా ఆమె తన కొడుకుతోపాటు జైలుపాలైంది… 16 సంవత్సరాలు జైలులోనే… జైలులోనే కొడుకు మరణించాడు…
కానీ ఆమె పోరాటం ముగియలేదు… శాహూకు పిల్లల్లేరు… తన మరణం తరువాత ఇక మళ్లీ తెర మీదకు వచ్చి… ఇన్నాళ్లు మొఘలులకు తెలియకుండా రామరాజు అనే తన మనమడి ఉనికిని గోప్యంగా ఉంచాననీ, తనే పాలకుడు అని ప్రకటిస్తుంది… పట్టాభిషేకమూ చేయిస్తుంది… కానీ మరాఠా రాజ్యం అంటేనే పీష్వాల కుట్రలు, ఆటస్థలం…
ఆమె అధికారాల్ని సహించని కొందరు పాచికలు వేశారు… తరువాత స్వపక్షంలోనే రకరకాల రాజకీయాలు, రాజీలు, సంధి ప్రయత్నాలు… ఓ దశలో అసలు రామరాజు తన మనమడు కాదని ఖండించింది ఆమె… ఎన్నో మాయోపాయాలు, వ్యూహాలతో మరాఠా సామ్రాజ్యంపై తిరుగులేని అధికారాన్ని అనుభవించి, చివరకు 86 ఏళ్ల వయస్సులో ప్రాణాలు విడిచింది… అదీ వినాశకరమైన యుద్ధంబలో పానిపట్టు యుద్ధ పరాజయం తరువాత కొన్నాళ్లకే…!!
.
మరాఠీ సాహిత్యం కొంతమేరకు ఆమె చరిత్రను రాసినా సరే, కొంత కల్పన ఎక్కువ… అన్నింటికీ మించి ఆ మరాఠీ రాజకీయాల్లోని సంక్లిష్టత ఎక్కువ కాబట్టి స్ట్రెయిట్‌గా ఆమె రాజకీయం, పనితీరు అంత త్వరగా జనం బుర్రలకు అర్థం కాలేదు… అర్థమైనకాడికి పైన చెప్పుకున్నదే ఆ ధీరవనిత చరిత్ర…
Share this Article