Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!

August 6, 2026 by M S R

.

నిజంగానే…! హరీష్ రావుకు ఏమైందో తెలియడం లేదు… పార్టీలో, బయటా ముప్పేట ఒత్తిడికి గురవుతున్న ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాడేమో..! పదే పదే ఒకే ఆరోపణ… రేవంత్ రెడ్డి తన గురువుకు గురుదక్షిణగా గోదావరి జలాలు ధారాదత్తం చేస్తున్నాడని!!

గోదావరిలో ఏదైనా దుంగ కొట్టుకుపోతున్నా సరే, అదుగో చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ రెడ్డి వదిలేస్తున్నాడు అని ఆరోపించేట్టున్నాడు… నిన్న కూడా అంతే… గోదావరి బోర్డుకు చంద్రబాబు ఏదో లేఖ పెట్టాడు, తెలంగాణ 7 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదు అని… ఇక అంతే…

Ads

చంద్రబాబు కుట్ర, రేవంత్ మాట్లాడడు, బంటు రేవంత్, బాబు తాకత్ అట… గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర ప్రాజెక్టుల మీద రాద్ధాంతం చేసేవాళ్లం… ఇప్పుడు చంద్రబాబు జస్ట్, ఏపీకి సీఎం, ఆ రాష్ట్రం కోణంలో స్పందిస్తాడు… దానికి ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు…

తనే కాదు, జగన్, చంద్రబాబు, రేపు లోకేష్, లేకపోతే పవన్ కల్యాణ్… ఎవరు సీఎం అయినా ఇదే ధోరణి ఉంటుంది… మనం పోలవరంపై పెడతాం కొర్రీలు, ఇదే బోర్డుకు ఏపీ పదే పదే లేఖలు రాయడం అలవాటే… ఇదేమీ కొత్త కాదు… ఎక్కడ ఎలా కౌంటర్ చేయాలో తెలంగాణలో రేవంత్ రెడ్డికే కాదు, తన టీమ్ మొత్తానికి తెలుసు… పైగా బోర్డు అల్టిమేట్ అథారిటీ ఏమీ కాదు, ట్రిబ్యునల్ కాదు, సుప్రీం కోర్టు కూడా కాదు…

హరీష్

ఏ నాయకుడైనా తన పొలిటికల్ ఫీల్డ్ ప్రయోజనాలకు అనుగుణంగానే పనిచేయాలి… రేవంత్ అయినా, చంద్రబాబు అయినా… రేవంత్ ఫీల్డ్ తెలంగాణ… తన రాజకీయ జీవితానికి అనుగుణంగా అనివార్యంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తాడు, చేయాలి… ఇక్కడ గురువు లేదు, గురుదక్షిణల్లేవు… అంతా భ్రమ…

పైగా గోదావరి జలాల్ని వదిలేస్తే చంద్రబాబు జేబులోకి వచ్చేదేమీ ఉండదు… తను ప్రతిపాదించిన ఏటీఎం పోలవరం- బనకచర్ల అలియాస్ నల్లమలసాగర్ ను కూడా తెలంగాణ అన్నికోణాల్లోనూ వ్యతిరేకిస్తూనే ఉంది… మన ప్రయోజనాలు మనకు ముఖ్యం… నిన్న కూడా కేంద్రం దగ్గర తుమ్మడిహెట్టి ఎత్తు మీద మహారాష్ట్రను ఒప్పించండంటూ కోరాడు… ఎక్కడా ఎవరూ రాజీపడరు…

అంతెందుకు..? చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ప్రముఖుడు… ఆ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఇండి కూటమికి సారథి కాంగ్రెస్ పార్టీ… ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇక చంద్రబాబు కోసం రేవంత్ పనిచేయడం ఏమిటి..? అబ్సర్డ్ విమర్శలు- గాలిలో బురద సృష్టించి మరీ గుమ్మరించడం!

పోనీ, రేవంత్ శిష్యుడు, చంద్రబాబు గురువు అనుకుందా కాసేపు… రేవంత్ కేబినెట్ కాదు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అంగీకరిస్తాడు… పార్టీ ఒప్పుకోదు, హైకమాండ్ ఒప్పుకోదు, కేబినెట్ ఒప్పుకోదు, నిజానికి ఒప్పుకుంటే బీఆర్ఎస్ కేసీయార్, హరీష్ రావులే అంగీకరిస్తారు… కాకపోతే అక్కడ జగన్ సీఎంగా ఉండాలి… తెలంగాణ ప్రయోజనాలను అడ్డంగా గోదావరిలో కలిపేయడానికి వాళ్లు సిద్ధం…

హరీష్

ఎందుకు అంటే..? ఇదే చంద్రబాబుతో మహాకూటమి పేరిట పొత్తు పెట్టుకుంది కేసీయార్, బాబు గురించి తెలిసీ ఎందుకు పొత్తినట్టు..? వీర సమైక్యవాది వైఎస్ కేబినెట్‌లో చేరింది అప్పటి టీఆర్ఎస్, పోరాటం వదిలి అధికారాన్ని అనుభవించింది ఎవరు..? ఇదే జగన్ రాయల సీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు పొక్కల వెడల్పు వంటి తెలంగాణ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతుంటే సహకరించింది ఎవరు..? కేసీయార్ కాాదా..?

అంతేకాదు, ఇప్పుడంటే చంద్రబాబు బనకచర్ల ఏటీఎం కోసం ప్రయత్నిస్తున్నాడు, కానీ అప్పట్లో జగన్‌తో కలిసి దుమ్ముగూడెం నుంచి గోదావరి- కావేరి అనుసంధానం కుట్రకు ఆలోచించింది ఎవరు..? కేసీయార్ కాదా..? రోజా ఇంట్లో భోజనం చేసి స్వర్ణాంధ్రకు హామీలు కురిపించిందెవరు..? క‌ృష్ణా- గోదావరి జలాల వాటాలపై నిర్లక్ష్యాన్ని కనబర్చిందెవరు..?

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇది ప్రకృతి కక్ష కాదు, ప్రతీకారం కాదు… బ్యాలెన్స్ చేస్తోంది తన ధర్మంగా !
  • ఊకో ఊకో రాధాకృష్ణ… రేవంత్ రెడ్డికి ఏమీ కాదు… ఆవేశపడిపోకు !!
  • పాపం… ఈ కాబోయే గవర్నర్‌కు గుర్తుందో లేదో బీజేపీలో ఉన్నానని…
  • ఎక్కాలు రావు, లెక్కలు తెలియవు – ఐతేనేం ఈ ‘రెబెక్కా’కు ఏం తక్కువ ?!
  • ఓ యాపిల్ – ఓ ఫేస్‌బుక్ – ఓ ‘హనుమాన్ అంశ’ ప్రభావం ! వెరీ ఇంట్రస్టింగ్ !!
  • కాపీ కొటేషన్లే డైలాగులా ? ఇదొక విపరీత ‘టాక్సిక్’ పెడపోకడ !!
  • ఏశ నాగుల కట్ట మీద … ఆ ఫోక్ పాటను ఖైమా కొట్టీ కొట్టీ వదిలారు…
  • 67 ఏళ్లు – ఐనా నిత్య యవ్వనుడు – చాలా రేర్ పీస్ నాగార్జున !!
  • నిత్య యవ్వనుడు నాగార్జున ఆరోగ్య రహస్యం ఓ పే-ద్ద ఫుడ్ మిస్టరీ !
  • రేవంత్ బీ సీరియస్ ! మంచి చెప్పరు – ఎదురుదాడి చేయరు – కొన్ని దిద్దుకోరు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions