డిస్కస్ చేయడానికి సమకాలీన అంశాలేమీ దొరక్కపోతే… ముచ్చట్లు ఆగవు కదా… ఏదో ఒకటి పాతవి తవ్వేసి డిస్కషన్స్ నడిపిస్తుంటారు సోషల్ నెటిజన్లు… ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండింగ్ అంశం ఉండాల్సిందే… ట్రోల్ చేసేవాడు, తిట్టేవాడు, మెచ్చుకునేవాడు, మీమ్స్ నడిపేవాడు… రకరకాలుగా బిజీ అయిపోతుంటారు… నిన్న పెద్ద ఏ అంశమూ లేకపోవడంతో ఒకాయన ఎవరో స్టార్ట్ చేశాడు… అసలు ఇప్పటివరకూ మనకున్న రాష్ట్రపతుల్లో బెస్ట్ ఎవరు..? వరస్ట్ ఎవరు..? ఇదీ డిబేట్…
నిజానికి సందర్భం ఏమీ లేదు… ఎవరికో ఏదో ప్రశ్న స్ట్రయిక్ అవుతుంది, డిబేట్ స్టార్ట్ చేస్తాడు, మిగతావాళ్లు అందుకుంటారు… అది కాస్తా ట్రెండింగ్‌లో పడిపోతుంది… ఈ డిబేట్లో పాపం బలి అయిపోయింది మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్… నిన్నంతా ట్విట్టర్ దుమ్ము ఆమెపైనుంచే వెళ్లిపోయింది…
Ads
నిస్సందేహంగా అందరూ బెస్ట్ రాష్ట్రపతిగా కలాంనే ఎంచుకుంటారు కదా… తన గురించి కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేదు… జగమెరిగిన నిష్కామ కర్మియోగి… కలాం అంటే సలాం… అంతే… వరస్ట్ అనేసరికి మెజారిటీ నెటిజనులు ప్రతిభా పాటిల్ పేరే తలుచుకున్నారు… నిజానికి వరస్ట్ రాష్ట్రపతి అనే ముద్ర ఫక్రుద్దీన్‌కు ఉండేది… ఇందిర సిట్ అంటే సిట్, రన్ అంటే రన్… ఎమర్జెన్సీ విధించింది ఆయనే… ఇప్పుడు ఆయన్ని అందరూ మరిచిపోయారు…
ప్రతిభాపాటిలే గుర్తింది చాలామందికి… నిజానికి రాష్ట్రపతి చేసేదేమీ ఉండదు… కాకపోతే తమ వ్యక్తిగత వ్యవహారశైలి వల్లనే మంచి మార్కులు లేదా మైనస్ మార్కులు… కలాం ఎవరూ వంక పెట్టలేని త్యాగి, యోగి… కాదు, జ్ఞాని… ఏవో నాలుగు పుస్తకాలు, రెండు జతల బట్టలతో రాష్ట్రపతి భవన్ ఖాళీ చేశాడు… తనవంటి నిజమైన సన్యాసి మళ్లీ దొరకడు… కానీ ప్రతిభా పాటిల్..?
2007 నుంచి 2012 నడుమ… ఆ అయిదేళ్ల కాలంలోనూ బోలెడు విదేశీ పర్యటనలు చేసింది… దాదాపు 200 కోట్ల వరకూ ఆమె పర్యటనలకు ఖర్చయినట్టు ఓ అంచనా… మనమలు, మనమరాళ్లతోసహా కుటుంబసభ్యులను ఓ విహారయాత్రలకు తీసుకెళ్లినట్టుగా భావించేదేమో… పరివారమంతా తరలివెళ్లేది… చివరకు తన విదేశీ పర్యటనల సమయంలో రాష్ట్రపతి హోదాలో అందుకున్న ఖరీదైన దాదాపు 150 కానుకల్ని కూడా ఇంటికి తీసుకుపోయింది… నిజానికి అవి జాతి సంపద… అలా తీసుకుపోవడానికి వీల్లేదు… కానీ కక్కుర్తి…
చివరకు ప్రభుత్వం అవన్నీ వాపస్ చేయాలని అడగాల్సి వచ్చింది… సోనియాగాంధీకి పరమ విధేయురాలు ఆమె… ఈ డిబేట్ సందర్భంగా ఫక్రుద్దీన్‌ను కూడా పక్కకు నెట్టేసి నెటిజనం ప్రతిభాపాటిల్ వ్యక్తిగత వ్యవహారశైలిని ఈసడించుకోవడం విశేషమే… అయితే ఇక్కడ ఓ చిన్నఅంశం చెప్పుకోవాలి…
వాళ్ల వ్యక్తిగత వ్యవహారశైలి ఎలాగైనా ఉండనీ… ఆమె మనకు మాజీ రాష్ట్రపతి… ఆమెను గౌరవించాల్సిందే… అప్పుడు అసందర్భంగా ఓ సోషల్ వేదిక మీద ఇంతగా తాజాగా బురద జల్లే కార్యక్రమం అవసరమా..? ఈ చర్చకు ఆస్కారమిచ్చిన ట్విట్టర్‌ను మన దేశం చర్య తీసుకోగలదా..? అసలు చర్య అవసరం లేదు, డిబేట్ మంచిదే అంటారా..? ఇదీ డిబేటబులే…!!
Share this Article