కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్నవాళ్లు గతంలోనూ ఉన్నారు… కాకపోతే ఇప్పుడు నడుస్తున్న కేబీసీ 12 సీజన్లో… జస్ట్, ఈ రెండుమూడు వారాల్లోనే వరుసగా ముగ్గురు కోటి రూపాయల చొప్పున గెలుచుకోవడం విశేషమే… పైగా అందరూ మహిళలే… ఫస్ట్ నజియా నసీం… సెకండ్ మోహిత శర్మ… ఇప్పుడు అనుపదాస్… వరుసగా మహిళలు కోటి చొప్పున కొల్లగొట్టేస్తున్న తీరు ఇంట్రస్టింగే…
నజియా నసీం… నేటివ్ జార్ఖండ్, కానీ ఇప్పుడు ఢిల్లీ వాసి… రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ గ్రూప్ మేనేజర్‌గా వర్క్ చేస్తోంది… కోటి రూపాయలు గెలుచుకుని, ఏడో కోట్ల ప్రశ్నకు జవాబు తెలియక, చెప్పలేక, ఏ లైఫ్ లైనూ మిగలక, ఆట వదిలేసి, కోటితో సంతృప్తి చెందింది…
Ads
మోహిత శర్మ… హిమాచల్ ప్రదేశ్ నేటివ్… ఇప్పుడు జమ్ముకాశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారి… సాంబ సెక్టార్లో ఏసీపీ… ఈమె కూడా ఏడు కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చే ప్రశ్నకు జవాబు తెలియక, చెప్పలేక, లైఫ్ లైన్ లేక, వదిలేసి ఆ కోటీ తీసుకుని, ఇది చాలులే అనుకుంది…
అనుపదాస్… పైన చిత్రంలో ఉన్నది ఆమే… చూడబోతే ఎవరో నార్తిండియన్ అన్నట్టుగా ఉంది కదా… కాదు, మనకు దగ్గర చుట్టమే… చత్తీస్‌గఢ్, బస్తర్ ఏరియా, జగదల్పూర్… వృత్తిరీత్యా టీచర్…
కోటి గెలుపొందింది సరే, ఈ ఎపిసోడ్ ఈరోజే… అనగా 25 నవంబరు… ప్రసారం అవుతుంది… వోకే… కానీ 7 కోట్లు గెలుపొందిందా అని ప్రశ్నిస్తూ, ఆసక్తిని రేపుతూ ప్రొమో వదిలారు… నిజానికి అదే జరిగి ఉంటే, ఒకరోజు ఆగి అదే గ్రాండ్‌గా ప్రచారం చేసుకునేవాళ్లు కదా… కాబట్టి కోటి మాత్రమే తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది… ఇదీ సోనీ వాళ్ల ప్రొమో… https://www.instagram.com/p/CH2V2fJn4rj/?utm_source=ig_embed
ఫెయిల్డ్ మ్యారేజీ… కుటుంబానికి తనే ఆధారం… తల్లి కేన్సర్ పేషెంట్… ఆమె చికిత్సకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెబుతోంది… నిజానికి ఆమె 20 ఏళ్లుగా కేబీసీ హాట్ సీటులో కూర్చోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది… ఎట్టకేలకు ఆమె కల ఇలా సాకారమైంది… కేన్సర్ చికిత్స కోసమే ఆమె ముంబైకి మారింది… అసలు ముంబై అంటే బయట ఓ అభిప్రాయం… మరో మనిషిని పట్టించుకోరు, సాయం చేయరు, పైగా మోసాలు చేసేవాళ్లు కూడా… ఇలా… కానీ తన అనుభవాలు పాజిటివ్‌గా ఉన్నాయనీ, బోలెడు మంది సాయం చేశారనీ, కరోనా పాండెమిక్‌లో కూడా, కరోనా చెలరేగుతున్నవేళ కూడా… మనిషిని మనిషి టచ్ చేయడానికి వణికిపోతున్నవేళ కూడా… నాకు, నా తల్లికి సాయం చేసినవాళ్లున్నారని ఆమె గుర్తు చేసుకుంది… గుడ్…
Share this Article