Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!

April 15, 2026 by M S R

.

హిందూ మహిళలే టార్గెట్… లవ్ జిహాద్, లైంగిక వేధింపులు, మతం మార్పిడి ఒత్తిళ్లు… నాసిక్ టీసీఎస్ కార్యాలయంలోని నాలుగేళ్లుగా సాగుతున్న బాగోతం వెనుక ఏదో పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు… ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి ఓసారి చెప్పుకోవాలి… అలాగే ఉద్యోగభద్రతలో టీసీఎస్ ఘోర వైఫల్యం గురించి కూడా…

లేడీ డీ… ఈ కథలో అత్యంత విస్తుపోయే పాత్ర నదా ఖాన్ అలియాస్ ‘లేడీ డి’... ఒక అండర్ వరల్డ్ డాన్‌కు ఉండాల్సిన టెంపర్… (దావూద్ ఇబ్రహీంను కూడా డి అని పిలుస్తారు తెలుసు కదా…) ఆమె ఆఫీసులో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. ప్రధాన నిందితుడు సోహైల్ సయ్యద్ వంటి వారు వేధింపులకు పాల్పడుతుంటే, ఈమె వారికి రక్షణగా నిలవడమే కాకుండా, ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించే బాధితులను “ఉద్యోగాలు తీయించేస్తా” అంటూ బెదిరించేది… అందుకే ఆమెకు ‘లేడీ డి’ అనే పేరు వచ్చింది…

Ads

పూణెలో చదువుకున్నది ఈమె… లైంగిక వేధింపుల నివరణకు పోష్ అనే చట్టం ఒకటి ఉంది… ప్రతి కార్పొరేట్, పెద్ద కంపెనీల్లో ఇంటర్నల్‌గా ఓ కమిటీ వేయాలి, వేధింపులపై ఫిర్యాదులను ఈ కమిటీ పరిష్కరించాలి… ఇక్కడ సమస్య ఏమిటంటే..? ఆమే హెచ్‌ఆర్ హెడ్… ఇంటర్నల్ కమిటీ మెంబర్… సాల్వ్ చేయాల్సిన కేరక్టరే నిందితులకు బాసట, మద్దతు… మరి బాధితులు ఎవరికి చెప్పుకోవాలి…

అందుకే నాలుగేళ్లుగా బయటపడకుండా సాగిపోయింది ఈ అరాచకాల యవ్వారం… టీసీఎస్ ఘోరవైఫల్యం తన కంపెనీలో ఏం జరుగుతున్నదో కనిపెట్టలేకపోవడం… ఇంటర్నల్ విజిలెన్స్ టీమ్ లేకపోవడం… సంస్థ పరువు ప్రతిష్ట ఒక్కసారిగా దిగజారిపోయింది… ఎవరో బాధితురాలు తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి వాడుకున్నాడని బయట పోలీసులకు ఫిర్యాదు చేయడం, అదేసమయంలో ఒకరిద్దరు పేరెంట్స్ తమ అమ్మాయిల వ్యవహారతీరులో మతమార్పిడి సూచనలు కనిపిస్తున్నాయని లోకల్ లీడర్లకు చెబితే, వాళ్లు నాసిక్ పోలీస్ కమిషనర్ దాకా తీసుకుపోవడంతో గుట్టు రట్టు కావడం మొదలైంది…

అదేమో చాలా  పేరున్న కంపెనీ… అంత అల్లాటప్పాగా వ్యవహరించలేరు పోలీసులు… ఉన్నతాధికారులకు చెబితే జాగ్రత్తగా డీల్ చేయాలనీ, కానీ వదిలిపెట్టకూడదని, సరైన సాక్ష్యాలు, ఆధారాలు ముఖ్యమనీ చెప్పారు… మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వ ముఖ్యులకూ తెలుసు ఈ ఆపరేషన్… నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్నిక్ తనే స్వయంగా దీన్ని డీల్ చేయటానికి పూనుకున్నాడు…

ముందుగా ఓ సిట్ వేశాడు… దీనికి ఏసీపీ సందీప్ మిట్కే సారథ్యం… కొందరు యంగ్ లేడీ కానిస్టేబుల్స్‌ను ఎంపిక చేశారు… అయిదుగురు సాధారణ ఎంప్లాయీల్లాగే ఆ ఆఫీసు (బీపీఓ)లోకి ఎంటరై, రెండు వారాలుగా ప్రతి మూలా పరికిస్తూ… లైంగిక వేధింపుల్ని రికార్డ్ చేస్తూ గడిపేవారు… మరో నలుగురు హౌజ్ కీపింగ్ స్టాఫ్‌గా వ్యవహరించేవాళ్లు… ఎప్పటికప్పుడు వివరాలన్నీ సిట్‌కు చేరేవి… ఈ ఆపరేషన్ పేరు మాయ…

నిందితులు మహిళా ఉద్యోగులను తాకే తీరు, చేసే అసభ్యకరమైన సైగలు, వాడే భాషను చిన్న కెమెరాల ద్వారా రికార్డ్ చేశారు… నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక తమ ఐడెంటిటీని బయటపెట్టారు… మొదట్లో ఆరేడుగురు బాధిత మహిళ ఉద్యోగులు ఫిర్యాదు చేయగా, తరువాత ఈ సంఖ్య 8 కు చేరింది… ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు…

పోష్ (POSH) చట్టం: మహిళలకు రక్షణ కవచం… ఈ ఉదంతం నేపథ్యంలో అసలు (POSH) Act, 2013 అంటే ఏమిటో, అది ఉద్యోగినులకు ఎలాంటి రక్షణ ఇస్తుందో తెలుసుకోవడం ముఖ్యం…

1. ఐసీ (Internal Committee – IC) తప్పనిసరి… 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి సంస్థలో ‘ఇంటర్నల్ కమిటీ’ ఉండాలి… దీనికి ఒక మహిళా అధికారి అధ్యక్షత వహించాలి… నాసిక్ కేసులో విమర్శ ఏమిటంటే, ఈ కమిటీ సరిగ్గా స్పందించకపోవడం వల్లే బాధితులు పోలీసుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది…

2. వేధింపులు అంటే ఏమిటి? … చట్టం ప్రకారం కేవలం శారీరక స్పర్శే కాదు, ఈ క్రిందివి కూడా వేధింపుల కిందకే వస్తాయి:

  • లైంగిక అర్థాలు వచ్చేలా మాట్లాడటం.

  • అసభ్యకరమైన చిత్రాలు లేదా వీడియోలు చూపించడం.

  • లైంగిక కోరికలు తీర్చాలని కోరడం లేదా డిమాండ్ చేయడం.

3. భయం లేని ఫిర్యాదు… పోష్ చట్టం ప్రకారం, ఫిర్యాదు చేసిన మహిళ వివరాల పట్ల పూర్తి గోప్యత పాటించాలి. ఒకవేళ విచారణ సమయంలో నిందితుడు ఆమెను ఇబ్బంది పెడతాడని భావిస్తే, ఆమెకు వేరే విభాగానికి బదిలీ లేదా మూడు నెలల వరకు సెలవు ఇచ్చే అధికారం కమిటీకి ఉంటుంది.


కంపెనీల బాధ్యత – అబద్ధాలు, వాస్తవాలు … టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలో చైర్మన్ స్థాయి వ్యక్తులు ఈ విషయాన్ని కేవలం ‘అంతర్గత క్రమశిక్షణా చర్య’గా చూపాలని ప్రయత్నించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి… “మేము వెంటనే చర్యలు తీసుకున్నాము, నిందితులను తొలగించాము” అని ఎక్కడికక్కడ మేనేజ్ చేయటానికి ప్రయత్నించాడు చైర్మన్ కూడా… జీరో టాలరెన్స్ అన్నాడు… కానీ పోలీస్ కేసు, ఆపరేషన్ మాయ ద్వారా మాత్రమే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి…

అసలు ఇది ఈ కంపెనీకే పరిమితమైంది కాదనీ, ఓ ఇంటర్నేషనల్ మత మాఫియా ఓ ప్లాన్ ప్రకారం ఇండియన్ కంపెనీల్లోకి జొరబడి పనిచేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు… ఈ లేడీ డి మాత్రమే కాదు, నిందితులు ఫోన్లు, ల్యాప్ టాపులు తీసుకుని, కొన్ని వేల మెయిళ్లు వడబోస్తున్నారు… సింగపూర్- మలేషియా వ్యక్తులతో సంభాషణలు, సంబంధాలు ఏమిటో తవ్వుతున్నారు… మెయిళ్లలో ఉన్న కొన్ని అనుమానాస్పద కోడ్ పదాలను డీకోడ్ చేయడానికి సైబర్ క్రైమ్ నిపుణులు రంగంలోకి దిగారు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!
  • ఆమె కథలో ఎన్ని ట్విస్టులో… ప్రతి ఫేకుగాడికీ ఆ పేరిప్పుడు లోకువ…
  • ఒక పోచారం… ఒక జీవన్‌రెడ్డి… జవాబుల్లేని కొన్ని ప్రశ్నలు…
  • అంజలి కడమ్..! హఠాత్తుగా తెరమరుగు… ఈరోజుకూ అజ్ఞాతమే…!!
  • ఐప్యాక్..! వ్యూహకర్తలు కారు… పక్కా స్కామర్లు… కోట్లకుకోట్ల దందాలు..!!
  • పూలు విసిరితే బాంబు అనుకుని… దళపతి భయంతో పరుగో పరుగు…
  • బీఆర్ఎస్ సైద్ధాంతిక శూన్యం..! కీలక బిల్లులపై ‘అనివార్య నిశ్శబ్దం..!
  • “మోదీ సరికొత్త గణితం..! 3 బిల్లులు – దేశ రాజకీయాల ‘గేమ్ ఛేంజర్’ ప్రణాళిక..!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions