.
పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ లెవల్ ఎక్కడికో వెళ్లిపోయింది… దానికితోడు జాతీయ అవార్డు… అలాంటి అర్జున్ తదుపరి సినిమా, అదీ సన్ పిక్చర్స్ వాళ్లది, అందులోనూ పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం… దీపిక పడుకోన్ కూడా ఉంటుందట…
ఇక ఏ రేంజులో ఉంటాయి ఎక్స్‌పెక్టేషన్స్… మరి దానికి సంగీత దర్శకుడు ఎవరు..? డీఎస్పీయా..? థమనా..? అనిరుధ్ రవిచందరా..? అజనీష్ లోకనాథా..? ఎవరు..? ఇదే రేంజ్ ఊహిస్తుంటాం కదా… కానీ వాళ్లెవరూ కాదు… సాయి అభ్యంకర్… పేరు వినలేదా..? సినిమా రానివ్వండి, మరిచిపోరు అంటున్నాడు అట్లీ…
Ads
ఇంతకీ ఎవరీ ఈ సాయి అభ్యంకర్..? జస్ట్, 21 ఇయర్స్ ఓల్డ్… చెన్నై… టిప్పు, హరిణి అనే సింగర్స్ జంట తన తల్లిదండ్రులు… సోదరి సాయి స్మృతి కూడా సింగరే… అభ్యంకర్ స్వయంగా స్వరకర్త, గాయకుడు, సంగీత దర్శకుడు… వోకల్ మాత్రమే కాదు, కీ బోర్డు, తబలా, మృదంగం, డ్రమ్స్, గిటార్… అనేక వాయిద్యాలపై ప్రవేశం ఉంది…
కానీ మరీ ఈ వయస్సులోనే అంత పెద్ద ప్రాజెక్టు ఎలా వచ్చింది..? ఇది కదా ప్రశ్న… మార్చి 2023లో, అభ్యంకర్ ఓ ఫ్రెండ్‌తో కలిసి ఆలోచించిన ట్రాక్‌తో థింక్ ఇండీ అనే మ్యూజిక్ కంపెనీని సంప్రదించాడు , ఆమోదం రాగానే “కచ్చి సెరా”గా డెవలప్ చేశాడు… 2024లో రిలీజ్ చేసిన ఈ వీడియో జూలై 2025 నాటికి 30 కోట్ల వ్యూస్ సాధించింది…

తరువాత ఆసా కూడా అనే పాట… ప్రీతి ముకుందన్‌తో కలిసి నటిస్తూ… సోదరి సాయి స్మృతితో కలిసి పాడుతూ… అది 29 కోట్ల వ్యూస్ దాటింది… తరువాత లారెన్స్ చాన్స్ ఇచ్చాడు బెంజ్ సినిమాలో, లోకేష్ కనగరాజ్ దర్శకుడు… ఆ తరువాత ఏఆర్ రెహమాన్ ప్లేసులో కరుప్పు సినిమాకు సంగీత దర్శకత్వం… దీనికి బాలాజీ దర్శకుడు, సూర్య సినిమా… రీసెంట్‌గా డ్యూడ్ సినిమాకు మ్యూజిక్ వర్క్ చేసింది తనే…
వెంటనే మార్షల్ అని కార్తి సినిమా… ఇప్పుడు అట్లీ- బన్నీ సినిమా… అన్నీ పెద్ద ప్రాజెక్టులే… వరుసగా వచ్చి మెడలో పడుతున్నయ్… మ్యూజిక్ వీడియోలతో మొదలు పెట్టి, ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు అయిపోయాడు…
మొదట్లో మలయాళం, తమిళ సినిమాల్లో పాటలు పాడుతూ… ఏఆర్ రెహమాన్, అనిరుధ్ రవిచందర్ దగ్గర కీబోర్డు ప్రోగ్రామర్‌గా వర్క్ చేస్తూ… ఇలా ఎదిగిపోయాడు… జస్ట్, 2022-23 నుంచే తన ప్రస్థానం… అప్పుడే ఇంత డిమాండ్… వావ్… హఠాత్తుగా ఎగిసిన స్వర కెరటం..! చెప్పుకోదగిన విశేషమే…
Share this Article