Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… పెద్ద ముదురు కేసే… ఒకప్పుడు టార్గెట్ చేసిన స్టాలినే ఇప్పుడు శ్రీరామరక్ష…

June 15, 2023 by M S R

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఎక్కడో కాలింది… ఠాట్, నా మంత్రి మీద ఈడీ కేసు పెడుతుందా, ఏమిటీ నాన్సెన్స్, అప్రజాస్వామికం, దారుణం, మోడీ నియంతృత్వం నశించాలి అని గొంతు చించుకున్నాడు… తన మంత్రి మీద ఈడీ కేసు పెడితే మొత్తం భారతదేశమే అల్లకల్లోలం అయిపోనట్టు మొత్తుకుంటున్నాడు… అంతేనా..? ఇతర అవినీతి సీఎంల్లాగే సీబీఐ తన రాష్ట్రానికి రావద్దని హుకుం జారీచేశాడు అధికారికంగానే… అసలు తనకు ఎందుకు మండుతోంది..? ఉంది, చాలా కథ ఉంది…

సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ… నాన్ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అవినీతి ఆరోపణలు పుష్కలంగా ఉన్న ముఖ్యమంత్రులు సీబీఐ తమ రాష్ట్రాల్లోకి రాకుండా ఆంక్షలు పెడుతున్నారు… టెక్నికల్‌గా వాళ్లకు ఆ చాన్స్ ఉంది… కానీ ఆ అడ్డంకి తొలగించే సోయి, తెలివి మోడీ సర్కారుకు లేకుండా పోయింది… ఈ సోకాల్డ్ అమిత్ షాకు ఇవి మాత్రం చేతకావు… అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నా సరే సీబీఐ కొరడాలకు పదును పెట్టలేని అసహాయత… ఐనా సీబీఐని రానివ్వకుండా అరచేతులు అడ్డుపడితేనేం… ఈడీ ఉంది కదా…
సరే, ఎవరిప్పుడు ఈడీ దాడికి గురయ్యారు..? తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ED అరెస్ట్ చేసింది నిన్న! ED అరెస్ట్ చేసిందీ అంటే అది మనీ లాండరింగ్ కేసు మీద! సెంథిల్ బాలాజీని అరెస్టు చేయగానే వెంటనే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందిట! ఈ మాట అన్నది స్టాలిన్! తమిళ ప్రజల హక్కులని కేంద్ర ప్రభుత్వమ్ అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నది అని మరో ఆరోపణ చేశాడు స్టాలిన్! తమిళ హక్కులు అంటే తమిళ ప్రజల్ని దోచుకునే హక్కా మిస్టర్ స్టాలిన్… తమిళ కల్చర్ అనగా స్టాలిన్ అనే పేరు కూడా అదే కల్చర్ పరిధిలోకి వస్తుందా సార్..?

2011-2016 లో ఇదే సెంథిల్ బాలాజీ అప్పటి AIDMK ప్రభుత్వం లో (జయలలిత ముఖ్యమంత్రి) రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు! 2011-16 మధ్య కాలంలో సెంథిల్ బాలాజీ మీద లెక్క లేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి! సెంథిల్ మీద ఆరోపణలు చేసిన వాళ్లలో అందరి కంటే ముందు ఉన్నాడు స్టాలిన్! కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టాడు స్టాలిన్ సెంథిల్ కి వ్యతిరేకంగా! జయలలిత నీడలో ఉన్న సెంథిల్ మీద ఈగ కూడా వాలలేదు కానీ విచారణకు ఆదేశించింది జయలలిత! మొదటి కేసు రిజిష్టర్ అయ్యింది 2015 లో. షరా మామూలుగా ఆ విచారణ నత్త నడక నడిచింది!

2015 లో తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయంలో స్టాలిన్ ప్రధానంగా టార్గెట్ చేసింది సెంథిల్ బాలాజీనే! ఆ ఎన్నికలలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యింది రెండోసారి వరసగా! 2018 లో సెంథిల్ బాలాజీ జయలలిత మరణం అనంతరం AIDMK కి రాజీనామా చేసి DMK లో చేరాడు! కానీ 2018లో సెంథిల్ బాలాజీ మీద సుప్రీం కోర్టులో కేసు వేశారు ED చేత విచారణ చేయాలని. సుప్రీమ్ కోర్ట్ ED కి అనుమతి ఇచ్చింది దర్యాప్తు చేయమని. అప్పటి నుండి ED సెంథిల్ బాలాజీ మీద దర్యాప్తు చేస్తున్నది. దొరికిన ఆధారాల మీద ప్రశ్నించడానికి పిలిస్తే వాయిదాలు వేస్తూ వచ్చాడు సెంతిల్! నిజానికీ 2018 లో సుప్రీం కోర్టు విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చినా ED వెంటనే అరెస్టు చేయలేదు. మనీ లాండరింగ్ జరిగింది అని ఆధారాలు దొరికిన తరువాతే నిన్న అరెస్టు చేసింది!

Ads

స్టాలిన్ కి ఎందుకు అంత ఆందోళన? సెంథిల్ బాలాజీని ప్రశ్నిస్తే స్టాలిన్ పేరు బయటకి వస్తుంది అని! నిజానికీ 2011 నుండి మొదలు పెట్టిన అవినీతి దందా నిన్న అరెస్ట్ అయ్యె వరకూ కొనసా గిస్తూనే ఉన్నాడు సెంథిల్ బాలాజీ! ఒక పక్క 2018 లోనే సుప్రీం కోర్టు తన మీద విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది అని తెలిసీ ఏ మాత్రం భయపడకుండా అవినీతి చేస్తూనే ఉన్నాడు. ED కూడా సెంథిల్ బాలాజీ తప్పులు చేస్తున్నా వేచి చూసింది. సెంథిల్ బాలాజీ చేస్తున్న లావాదేవీల మీద నిఘా పెట్టీ ఆధారాలు దొరకగానే అరెస్ట్ చేసింది!

ED అరెస్ట్ అనగానే సెంథిల్ బాలాజీకి గుండె నొప్పి వచ్చిందీ! అఫ్కోర్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం మూడు చోట్ల బ్లాకులు ఉన్నట్లుగా బయట పడింది నిజంగానే… మాయదారి రోగం ఏమీ కాదు, బై పాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు డాక్టర్లు! ఒకప్పుడు ఇదే స్టాలిన్ దుమ్మెత్తి పోశాడు, టార్గెట్ చేశాడు ఈ మంత్రిని… తన పార్టీలోకి వచ్చి, కీలక ఫైనాన్షియర్ అయిపోగానే ప్రేమ పుట్టుకొచ్చింది… ఈడీ దాడి అనగానే మండుకొచ్చింది… అదీ కథ…

అన్నామలై కీలక పాత్ర! బిజెపి పెద్దలు అన్ని రాష్ట్రాలలో చేసిన ప్రయోగం తమిళనాడులో కూడా చేయాలని చూసారు. AIDMK నుండి బీజేపీలోకి వలసలను ప్రోత్సహించాలని చూసింది. దీనిని అన్నామలై తీవ్రంగా ప్రతిఘటించారు! ఒక దశలో తాను బీజేపీకి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించాడు. దాంతో బీజేపీ అధిష్టానం వెనక్కి తగ్గింది. అన్నామలై కి సహకరించే ఆలోచనే సెంథిల్ బాలాజీ అరెస్టు. నిజానికి అన్నామలైని అన్నిరకాలుగా ఎంకరేజ్ చేస్తోంది బీజేపీ హైకమాండ్… డీఎంకే, అన్నాడీఎంకే ఫైల్స్ అంటూ అందరి అవినీతినీ బజారుకు లాగుతున్నాడు… కలకలం రేపుతున్నాడు… ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎలా నిర్వహించాలి అనే విషయంలో అన్నామలై ఒక రోల్ మోడల్! హెలో తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులూ వింటున్నారా..? (Inputs From … పార్ధసారధి పోట్లూరి ….)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions