.
రాజస్థాన్- లక్నో మ్యాచా..? అబ్బే, ఏం చూస్తాంలే అనుకుని చానెల్ స్కిప్ చేయబోతుటే… కామెంటేటర్ అరుపులు విని ఒక్కక్షణం రిమోట్ దానంతటదే ఆగిపోయింది…
ఇక కాసేపు అలా టీవీ నడుస్తూనే ఉంది… కారణం :: ఆ కుర్రాడు… జస్ట్, వాడి వయస్సు 14 ఏళ్లు… అవును, చుట్టూ వేల జనం, సీనియర్ ప్లేయర్లు, జట్టు పెట్టుకున్న నమ్మకం తాలూకు ఒత్తిడి… ఓ ఫాస్ట్ బౌలర్ నేర్పుగా విసిరిన బంతిని అలా సిక్స్ బాదాడు…
Ads
జనంలో కేకలు… మూడో బంతికి మరో సిక్స్… ఆ కుర్రాడి ధైర్యం నచ్చింది… అసలు ఎవరబ్బా అని సెర్చితే… ఐపీఎల్ టోర్నీలో అతి పిన్నవయస్కుడిగా క్రీజు ప్రవేశం చేసిన తన పేరు వైభవ్ సూర్యవంశీ… డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో వంటి ప్లేయర్లే అమ్ముడుబోలేదు కదా… మన ఇండియన్ తోపులు కూడా అమ్ముడుబోలేదు కొందరు…
ఈ పిల్లాడి కోసం ఢిల్లీ, రాజస్థాన్ పోటీపడ్డాయి, చివరకు రాజస్థాన్ కోటీ 10 లక్షలకు కొనేసింది… రాత్రి క్రీజు ప్రవేశం… అదీ వాడి కథ… 2011లో బీహార్, తేజాపూర్‌లో పుట్టాడు… ఆ ఏడాది ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన రోజు ఈ వైభవ్ వయస్సు ఐదేళ్లు… ఐపీఎల్ పుట్టిన అయిదేళ్లకు పుట్టాడు…
నాలుగేళ్లకే బ్యాటు పట్టాడు… తండ్రి రైతు… ఈ పిల్లాడి ఆట కోసం ఓ చిన్న పిచ్ తయారు చేశాడు… పదేళ్లు కూడా నిండకుండానే మన అండర్-19 జట్టులో చేరిపోయాడు… 62 బంతుల్లో 104 పరుగులు… ఇంకేదో ట్రోఫీలో 332 నాటౌట్… అవిగో ఆ లెక్కలు చూసే ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పోటీలుపడ్డాయి…అదీ కథ…
సంజూ శాంసన్ గాయం కారణంగా రాత్రి తన మొదటి ఐపీఎల్ మ్యాచు ఆడే అవకాశం వచ్చింది… ఓపెనర్‌గా వచ్చి 20 బాల్స్‌లో 34 రన్స్ చేశాడు… ఓ మంచి బాల్‌కు స్టంపవుట్.,. అరె, ఇంకాసేపు ఆడితే బాగుండు కదా అనిపించింది… కనీసం 50 చేసేదాకా… ఔట్ కాగానే కన్నీళ్లు ఆపుకుంటున్నట్టుగా నిరాశగా వెనుతిరిగాడు… సహజం కదా, వాడి వయస్సు ఎంతని..? ఇంకా 8, 9 క్లాస్ పిల్లాడే కదా,..
అప్పట్లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది… వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసినప్పుడైతే పాపం ఆ పిల్లాడి ఆ ఫాస్ట్ బౌలర్లకు బలిస్తారా అనే ఆందోళన కూడా… మళ్లీ ఇప్పుడు ఓ క్రికెటర్ వయస్సు మీడియాలో జోరుగా చర్చనీయాంశం అయిపోయింది…
నిజం… నన్నెలా వదులుతారు, వీల్ చెయిర్లలో తీసుకొచ్చి మరీ ఆడిస్తారు అని నవ్వుతూ చెబుతున్నాడు ఓ సీనియర్ క్రికెటర్… ఈ పిల్లాడి వయస్సు, ఐపీఎల్ ఎంపిక మీద జోక్స్… అనిపించింది ఏమిటంటే..? ఇంకా ఇంకా కోహ్లీలు, రోహిత్ శర్మలు, ధోనీలు ఐపీఎల్‌లో దేనికి..? వైభవ్ మాత్రమే కాదు, ముంబై బౌలర్లు విఘ్నేశ్, అశ్వినికుమార్, తెలుగు సత్యనారాయణరావు… వీళ్లు కదా ఐపీఎల్ లిటిల్ హీరోస్… ఆ తరువాత ఇండియన్ టీమ్‌లోకి… అలా కదా బాటలు పరచాల్సింది..!!
Share this Article