.
ఇక ఆపండి…. తెగ వెతికేస్తున్నారు… తెలుగు నెటిజనం గూగుల్ సెర్చింగులో తెగ బిజీ అయిపోయారు… చిలుపూరి ఉష ఎవరు..? ఇదే సెర్చింగు… ఇంకా అందరికీ మెసేజులు, ఆమె ఆంధ్రా..? తెలంగాణా..? చిలుకూరి అంటే ఆంధ్రాలే కదా…? అబ్బే, కాదేమో, హైదరాబాద్ కావచ్చు…
నో, నో, రోజూ విశాఖ నుంచి విజయనగరం వెళ్లి ఫిజిక్స్ పాఠాలు చెప్పే 95 ఏళ్ల చిలుకూరి శాంతమ్మది ఆంధ్రా అయినప్పుడు, ఈ చిలుకూరి ఉషది తెలంగాణ ఎందుకవుతుంది..? ఇలా బోలెడు ప్రశ్నలు, ఆరాలు, సందేహాలు, అన్వేషణలు… మొత్తానికి ఆమె రూట్స్ ఇవిగో…
Ads
ఎందుకంటే..? ట్రంపు పార్టీ గెలిచింది కదా… ట్రంపు మళ్లీ అధ్యక్షుడయ్యాడు కదా… తన రన్నింగ్ మేట్ పేరు వాన్స్… ఆయన ఉపాధ్యక్షుడు ఇప్పుడు… ఆయన భార్య పేరు చిలుకూరి ఉష… ఆమె ఇప్పుడు అమెరికా సెకండ్ లేడీ… అమెరికా తొలి తెలుగు సెకండ్ లేడీ… అందుకని ఈ గూగుల్ అన్వేషణ…
ఉష తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు క్రిష్ణ (క్రిష్ చిలుకూరి); వీరిద్దరూ క్యాలిఫోర్నియా రాష్ట్రంలో శాండియాగా యూనివర్శిటీలో ప్రొఫెసర్స్ గా పని చేస్తున్నారు… ఉష అమెరికాలోనే పుట్టినా ఆమె తల్లితండ్రులు గతంలో హైదరాబాద్ నుంచి నుంచి అమెరికా వలస వెళ్ళారు… కానీ వాళ్ల నేటివ్ ఏపీలోని వడ్లూరు (WG)… ఉష అమెరికాలో లీడింగ్ కార్పొరేట్ లిటిగేటర్…
యేల్ లా స్కూల్‌లో చదువుతున్నప్పుడు వాన్స్‌తో పరిచయం ఆమెకు… 2014లో పెళ్లి చేసుకున్నారు… స్వచ్ఛమైన హిందూ పద్ధతిలో పెళ్లికి వాన్స్ అంగీకరించాడు… పెళ్లి తరువాత కూడా ఎవరి మతాచరణ వాళ్లదే… ఆమె ప్రాక్టీసింగ్ హిందూ… సంతానంలో ఒకరికి వివేక్ అని పేరు పెట్టుకుంది… మిగతా ఇద్దరు ఇవాన్, మిరబెల్… ఆయనేమో రోమన్ కేథలిక్… ముగ్గురు పిల్లలకు రెండు మతపద్ధతులూ నేర్పిస్తున్నారు…
అసలు విషయం ఏమిటంటే..? తన తరువాత, అంటే ఈ అధ్యక్ష ఎన్నికల తరువాత అధ్యక్షుడిగా పోటీపడటానికి సమర్థుడిగా వాన్స్‌ను ఎంపిక చేస్తున్నట్టు ట్రంప్ చెబుతున్నాడు… మొదట్లో తనకు వాన్స్ తీవ్ర వ్యతిరేకి, ఇప్పుడు ట్రంప్ తననే రన్నింగ్ మేట్‌గా ఎంపిక చేసుకున్నాడు… ఇప్పుడు వోకే… కానీ…
వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో, అంటే నాలుగేళ్ల తరువాత తనే అధ్యక్ష అభ్యర్థి అవుతాడు మోస్ట్ ప్రాబబులీ… ఒకవేళ లక్ కలిసొస్తే అధ్యక్షుడూ అవుతాడు… అప్పుడు మన పామర్రు చిలుకూరి ఉష అమెరికా వంటి అగ్రదేశానికి ఫస్ట్ లేడీ అవుతుంది… ఊహ బాగుంది… కావాలనే ఆశిద్దాం… ఫస్టయితే సెకండ్ లేడీ కావాలని మన అభిలాష… ఆల్ ది బెస్ట్ ఉషా..!!
(95 ఏళ్ల వయస్సులోనూ ఫిజిక్స్ పాఠాలు చెప్పే శాంతమ్మ ఈమెకు ఏమవుతుంది..? వరుసకు మనమరాలు అట… శాంతమ్మ మరిదికి ఉష మనమరాలు…)
Share this Article