.
నిన్నటి కేసీయార్ ప్రెస్‌మీట్‌లో ఓ విషయాన్ని బీజేపీ వాళ్లు ఇంకా చదువుకున్నారో, విన్నారో, చూశారో తెలియదు గానీ… తనకు అలవాటైన రీతిలో మోడీ ఇజ్జత్ తీశాడు…
ప్రతి రాష్ట్రం పెట్టుబడుల కోసం పాలసీలు చేస్తుంది, ప్రయత్నాలు చేస్తుంది, గ్లోబల్ సమ్మిట్‌లు నిర్వహించేది కూడా అందులో భాగమే… రేవంత్ రెడ్డి మొన్న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాడు కదా… దాన్ని ఎద్దేవా చేయడానికి చంద్రబాబును, మోడీని కలిపి కొట్టాడు కేసీయార్…
Ads
‘‘అప్పట్లో విశాఖలో సమ్మిట్ పెట్టాడు కదా చంద్రబాబు, ఈ హైప్ క్రియేషన్లకు తనే ఆద్యుడు… చివరకు హోటళ్లలో వంటవాళ్లు, సర్వర్లతో కూడా సంతకాలు చేయించి, లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పుకున్నాడు, అన్నీ వచ్చి ఉంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండాలి, మరేమైంది..?
అప్పట్లో శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి… పదే పదే ఫోన్లు చేస్తే వెళ్లాను… వసుంధర రాజే చెల్లెలు యశోధర రాజే అక్కడ పరిశ్రమల మంత్రి… నీ కొడుకొచ్చి (కేటీయార్) ఆగమాగం చేస్తున్నాడు, అదొకటి ఇదొకటి మాట్లాడి అన్నీ తనే చేసుకుంటున్నాడు (అంటే, కంపెనీలతో పెట్టుబడులు తెచ్చుకుంటున్నాడు అని) అన్నది నాతో… నువ్వు కూడా అలాగే తన్లాడు (ప్రయత్నించు) అని చెప్పాను…

అంతకుముందే 2, 3 నెలల ముందే మోడీ వచ్చాడు ఓ కార్యక్రమానికి… 14 లక్షల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి కదా, మళ్లీ పెట్టుబడులు రావడం లేదంటావేమిటి అనడిగాను ఆమెను… ఓ సబ్ బోగస్ హై సాబ్ అని తనే స్వయంగా చెప్పింది… ఉత్త గ్యాస్ అట… అది వచ్చేదా, పోయేదా అన్నదామె… ఈ గ్యాస్‌లు ఎవరిని మోసం చేయడానికి..?’’
……… ఇదీ తను చెప్పుకొచ్చింది… మోడీని ఆహ్వానించి మరీ 14 లక్షల కోట్ల ఎంవోయూలకు సంతకాలు జరిగేంత పెద్ద ప్రోగ్రామ్ చేసిన 2, 3 నెలలకే మళ్లీ గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఆ ప్రభుత్వం..? పైగా ఆమె తన ముఖ్యమంత్రిని, తన ప్రధానిని వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట కించపరుస్తుందా..? తను చూసే శాఖ గురించి తనే వేరే సీఎంతో అవమానకరంగా మాట్లాడుతుందా..? అంత పరిణతి లేదా ఆమెకు..? ఏమో, కిషన్ రెడ్డి చెప్పాలిక…
అవునూ, యశోధర మరీ అంత తెలివి లేని కేరక్టరా..? ఓసారి ఆమె ఎవరో చూద్దాం… యశోధర రాజే సింధియా (Yashodhara Raje Scindia)… తనది గ్వాలియర్ రాజకుటుంబం… తండ్రి జీవాజీరావు సింధియా (గ్వాలియర్ చివరి మహారాజు)… తల్లి విజయరాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు, అనేక ఏళ్లు బీజేపీని ఆర్థికంగా పోషించింది ఆమే… పలుసార్లు ఎంపీ… గ్వాలియర్ రాజమాత…

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సోదరి, దివంగత కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా సోదరి… కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఈమె మేనత్త అవుతుంది… యశోధర రాజే శివపురి నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యే… ఆమె గ్వాలియర్ నియోజకవర్గం నుండి ఎంపీ…
తన ఆరోగ్య కారణాల దృష్ట్యా గత ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుని, రాజకీయాల నుండి కొంత విరామం తీసుకుంది… ఇదీ సంగతి…
Share this Article