Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

June 7, 2025 by M S R

.

నాగార్జున నష్టజాతకుడే అని కొందరు తీర్మానించేస్తారు… కానీ తప్పు… తన నటన స్థాయికి తను సంపాదించుకున్న పాపులారిటీ చాలా చాలా ఎక్కువ… అసలు ఇన్నేళ్లు ఫీల్డులో ఉండటమే పెద్ద ఘనత…

తండ్రి సంపాదించిన ఆస్తుల్ని అప్పులో చేశాడో ఏం చేశాడో గానీ అమ్ముకోలేదు, నిలబెట్టాడు… నష్టజాతకుడు ఎందుకయ్యా అంటే..? కొడుకులు నటనకు వారసులు కాలేకపోయారు… అసలు నాగేశ్వరరావుతో పోలిస్తే తనకే ఏమీ రాదు… కానీ నిలబడ్డాడు…

Ads

చైతూ, అఖిల్ నిలబడలేక నానా పాట్లూ పడుతున్నారు… ఒక కొడుకు పెళ్లి విడాకులు, ఎంత రాజీపడినా సమంత జంప్… ఒక సుమంత్ పెళ్లి నాలుగు నాళ్లకే పెటాకులు… అఖిల్ పెళ్లి నిశ్చితార్థం అయ్యీ ఢమాల్… ఎన్ కన్వెన్షన్ కూల్చివేత… కొండా సురేఖ పిచ్చి వ్యాఖ్యలు…

మొత్తానికి నాగార్జున ప్లేసులో ఎవరైనా ఉండి ఉంటే ఏమైపోయేవాడో… నిలబడ్డాడు… చైతూ కోరుకున్న మరో శోభితను అంగీకరించాడు… ఇప్పుడు అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్దదైన జైనబ్‌నూ అంగీకరించాడు… పెళ్లి చేశాడు… పాత చేదు అనుభవాలన్నీ మరిచి రేవంతుడిని పిలిచాడు… ఏపీ, తెలంగాణ సినీ, పొలిటికల్ అతిరథ మహారథుల్నీ పిలిచాడు…

ఓ ఆనందం, అన్నీ మరిచి సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణం తనకు… అఖిల్ పెళ్లయిపోయింది, చిరంజీవి.. రాజమౌళి.. ప్రశాంత్ నీల్ తదితరులు కుటుంబ సభ్యులతో సహా హాజరు అయ్యారు…

అన్న నాగ చైతన్య బారాత్ డాన్స్ చేస్తూ తమ్ముడికి స్వాగతం పలకడం హైలెట్… ఈ మధ్య కాలంలో నాగార్జునకు సంతోషం కలిగించిన క్షణాలు ఇవే… రామ్ చరణ్.. సుమంత్ తదితరులు పెళ్ళిలో స్టెప్పులు వేసి అతిథుల్లో జోష్ నింపడం ఆకట్టుకుంది…

సరే, రిసెప్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు… ఇదంతా సరే… ట్రోలింగ్ షురూ… అతడికన్నా ఆమె 9 ఏళ్లు పెద్ద… సో వాట్… సంసారం చేసేది అతడు… వాళ్లకు తెలియదా..? తెలిసీ జతకలవడానికి ఇష్టపడ్డారు… ఎందరు లేరు..? సినిమా, క్రికెట్ సెలబ్రిటీలలో ఎందరు లేరు..? ఉంటే ఏమిటి..?

వాళ్లదేమీ అల్లాటప్పా కుటుంబం కాదు… హైప్రొఫైల్ ఫ్యామిలీ… అఖిల్ కన్నుకొట్టగానే పడిపోయే కేరక్టర్ కాదు ఆమె… అవునూ, ఇంతకూ ఎవరామె..?



సహజమే… అక్కినేని ఇంటికి కోడలిగా రాబోతున్నదంటే ఆమె ఎవరూ అనే సెర్చింగ్ సహజమే… ఆమె ఎవరు అనే వివరాలు నెట్‌లో కూడా పెద్దగా ఉండవు… తెలిసిన సమాచారం మేరకు ఆమె హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది…

zainab ravdzee

నెట్‌లో ఆమె పేరుతో ఒక ప్రొఫైల్ ఉంటుంది… ఆమె అప్పుడెప్పుడో మీనాక్షి అనే సినిమా చేసింది… అదొక్కటే సినిమా… ఇక ఏ వివరాలూ ఉండవు… కానీ 2004లో సినిమా అంటే ఇప్పటికి 35 ఏళ్లపైనే కదా… అవును, 39 ఏళ్లు… ఆమే ఈమె..,.

అఖిల్ చేసుకోబోయే అమ్మాయి ఆర్టిస్టు… ఆమె తండ్రి జుల్ఫీ కూడా ఆర్టిస్ట్ కం బిజినెస్ మాన్… గతంలో ఈ ఫ్యామిలీకి ఓడియన్ థియేటర్ ఉండేది… హైదరాబాదులో కూడా గతంలో రిఫ్లెక్షన్స్ పేరిట కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో అప్పట్లో ఆమె ఓ పెయింట్ ఎగ్జిబిషన్ కూడా పెట్టింది…

ఎక్కువగా మోడరన్, అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్ వేస్తుందని సమాచారం… ప్రియాంక గాంధీకి తన పొర్ట్రెయిట్ చిత్రించి బహూకరించినట్టు ఓ వార్త…

ప్రస్తుతం ముంబైలో ఉంటుంది… చాలా లోప్రొఫైల్… ఎక్కువగా దుబాయ్, లండన్, ఇండియాల మధ్య సంచారం… అఖిల్‌తో ఎలా పరిచయమనేదీ గోప్యమే… తన గరల్ ఫ్రెండే… అప్పట్లో అంటే 2016లో ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనమరాలు శ్రియా భోపాల్‌తో నిశ్చితార్థం జరిగాక, పెళ్లి గాకముందే బ్రేకప్…

ఆ తరువాత ఈమె పరిచయం అయినట్టుంది… ఆరేడేళ్లుగా ఇద్దరి మధ్య ప్రణయం అట…ఇంతకుమించి ఆమె వివరాలు ఎవరికీ తెలియవు… అక్కినేని కుటుంబం కూడా ఆమె వివరాల వెల్లడికి విముఖంగా ఉన్నట్టుంది… (బహుశా ఆర్ట్ గ్యాలరీలతో పరిచయం ఉన్నవాళ్లకు ఆమె గురించి తెలిసి ఉంటుంది…)

అఖిల్ విషయానికి వస్తే, ఇండస్ట్రీలోకి వచ్చి తొమ్మిదీపదేళ్లయినా సరే, ఇప్పటికీ తన కెరీర్ గాడిలో లేదు… తను అమెరికాలో పుట్టాడు, ఇప్పటికీ అమెరికన్ పౌరసత్వమే తనది…

ఒక మీడియా సంస్థ సమాచారం ఇది…

మరి నాగార్జున రేంజ్ కు తగిన మ్యాచ్ కదా… తొక్కలో ఏజ్ గ్యాపుదేముంది..? ఇప్పుడిప్పుడే నాగార్జున మొహంలో కాస్త కాంతి కనిపిస్తోంది… ట్రోలింగుతో ఈ కాస్త సుఖాన్ని, ఈ కాస్త శాంతినీ దూరం చేయకండర్రా… అఖిల్ హీరోగా క్లిక్ కాకపోతేనేం… అంత పెద్ద అన్నపూర్ణ స్టూడియో ఉంది… తోడుగా చతుర్ వ్యాపారి మామ ఉన్నాడు… ఏం తక్కువ..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా పేరు ఇందిర… లోపలకు రావచ్చా… తినడానికి ఏమైనా ఉందా..?
  • చెల్లి పెళ్లికూతురు… అక్క ఈ ఇంట్లో బందీ… రక్తికట్టిన ఓ ఎపిసోడ్…
  • సేఫ్ ప్యాసేజ్ చూసుకుని మరీ లొంగిపొండి కామ్రేడ్స్… ఖతమై పోవద్దు..!!
  • హిడ్మా కాదు… ‘టెక్ శంకర్’ మృతితో CPRF క్యాంపుల్లో బాణాసంచా..!!
  • పిట్టల్ని కొట్టడం కాదు… సినిమా నేర్చుకోవల్సిన పాఠం ఏమనగా…
  • కన్నబిడ్డలనైనా నమ్మకూడదు… రోజులస్సలు బాగాలేవు… అదే ఇది…
  • ఎంత పెద్ద హీరోయిన్ ఐతేనేం, మేం సారీ చెప్పము గాక చెప్పము…
  • నో నో… వారణాసి కథ కాదు ఇది… కానీ ఇదే అయితే ఎలా ఉంటుంది..?!
  • తుది దెబ్బ- హిడ్మా ఎన్‌కౌంటర్… మావోయిస్టు పోరాటానికి ముగింపు..?!
  • కలిచివేసే విషాదం..! గంటల వ్యవధిలో గాలిలో కలిసిన నాలుగు ప్రాణాలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions