ఒక మిత్రుడి అబ్జర్వేషన్… ఇంట్రస్టింగుగా అనిపించింది… రంగమార్తాండ సినిమాకు నిజంగానే మార్కెట్‌లో ఏ హైపూ క్రియేట్ కాలేదు… చాలాకాలంగా సినిమా రిలీజ్ చేయలేక నిర్మాత నానాకష్టాలూ పడ్డాడు… ఇక రిలీజు చేస్తామనగా ఎడాపెడా ఫ్రీ షోలు వేసి, సమాజంలో వాళ్లు ప్రముఖులు అనుకున్నవారిని పిలిచి సినిమా చూపించారు…
ఇది పాజిటివ్ మౌత్ టాక్ కోసం… అలా చూసినవాళ్లు ఫేస్‌బుక్‌లో రివ్యూలు రాశారు… ప్రివ్యూలు రాశారు… ఈ మొహమాటం రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ నిజానికి ఏ సినిమాకు కన్‌స్ట్రక్టివ్ పాజిటివ్ బజ్ ఇవ్వదు… అది కృష్ణవంశీకి తెలియలేదు… ఉచిత షోలకు జనాన్ని పిలిచే కార్యక్రమాన్ని కూడా లక్ష్మీభూపాలకు అప్పగించాడు… ఆయన ఎవరిని పిలిస్తే వాళ్లు ప్రముఖులన్నమాట…
నిర్మాత చిరంజీవితోపాటు చాలామంది ముఖ్యమైన నటులకు, సినిమా ప్రముఖులకు కూడా స్పెషల్ షోలు వేశాడు… ఎవరి నోటి నుంచీ పెద్ద పాజిటివ్ స్టేట్‌మెంట్లు రాలేదు… కారణం తెలియదు… ఇక్కడ అబ్జర్వేషన్ ఏమిటంటే… ఈ ప్రివ్యూలు, రివ్యూలు ఎక్కువగా ఫేస్‌బుక్‌లోనే వచ్చాయి… కానీ ట్విట్టర్, ఇన్‌స్టాలలో ఈ పాజిటివ్ రివ్యూ వీడియోల జాడ లేదు… గమనించారా..?
Ads
సాధారణంగా ఫేస్‌బుక్‌ను ఎక్కువగా మిడిల్ ఏజ్ క్లాస్ వాడుతోంది… యువతరం ఇన్‌స్టా వైపు వెళ్లిపోయింది… ట్విట్టర్ కూడా వాళ్లదే అధికంగా… ఈ రివ్యూలు, ప్రివ్యూలు ఎక్కువగా ఫేస్‌బుక్‌లో మాత్రమే కనిపించాయి తప్ప ట్విట్టర్, ఇన్‌స్టాలలో… చివరకు యూట్యూబులో కూడా రివ్యూ వీడియోలు లేవు… చాలా తక్కువ… అంటే కృష్ణవంశీ యంగ్ ఏజ్ వాళ్లను ఇక కనెక్ట్ కాలేకపోతున్నాడు అని… మధ్య వయస్సు లేదా అంతకుమించిన వాళ్లను మాత్రమే కాస్త కనెక్టయింది… వయస్సు మళ్లిన, రిటైరైన వాళ్లను మంచిగా చూపించడానికి మొత్తం యువతరం, పిల్లలను విలన్లుగా చిత్రీకరించిన తీరు కూడా యువతకు నచ్చలేదు…
నిజానికి ఇది ఊహించిందే… ఎక్కువ మందికి సినిమా ఉచితంగా చూపించడం వల్ల మరో నష్టం జరిగింది… సినిమా కథ మొత్తం బయటికొచ్చేసింది… అసలే అది యూత్‌ను కనెక్టయ్యే కథ కాదు… ఇక మొత్తం ముందే తెలిసిపోవడం వల్ల… కథ మీద ఉండే ఆసక్తి, ఇంట్రస్టు కాస్తా ఎగిరిపోయాయి… అది తొలిరోజు వసూళ్లకు దెబ్బ… అదీ నిర్మాత, దర్శకుడు ఆలోచించలేకపోయారు… రంగస్థల కళాకారుల కథను చూసే ఇంట్రస్టు ఇప్పటితరానికి ఉండదు… ఉండలేదు… కేవలం ప్రివ్యూలు, రివ్యూలు ఫేస్‌బుక్‌కే పరిమితం కావడం దీనికే నిదర్శనం… వెరసి రంగమార్తాండ మార్కెటింగ్‌లో చేజేతులా సినిమా టీమే నష్టాన్ని కొనితెచ్చుకున్నట్టయింది ఈ ఫ్రీ షోలతో…!!
Share this Article