టైటానిక్ అడ్డంగా విరిగింది… మునిగింది… అయితే సమీపంలోని ఏ నౌకకూ అది పంపించిన ఎస్ఓఎస్ సందేశాలు చేరలేదా..? ఎవరూ రాలేదా..? విధి ఆ కోణంలోనూ వక్రించిందా..? తరచూ నౌకలు తిరిగే మార్గమే అది, మునగడానికి పట్టే టైమ్‌లో ఏ నౌకో రెస్క్యూకు వచ్చి ఉండాలి కదా… ఈ సందేహాలు వచ్చాయా మీకు ఎప్పుడైనా..? కనీసం సినిమాలో మరో నౌక వచ్చినట్టు ఏమైనా ఉందా..?
నిజానికి టైటానిక్ మునిగిపోతున్నప్పుడు సమీపంలోనే మూడు నౌకలున్నాయి… మొదటిది శాంప్సన్… టైటానిక్ ప్రమాదాన్ని సూచిస్తూ, ఆదుకోవాలని కోరుతూ తెల్లటి మంటల్ని వదులుతుంటే ఆ నౌకలోని వాళ్లు చూశారు… రేడియోలో అరుపులు విన్నారు… అప్పటికి అది జస్ట్, 7 మైళ్ల దూరంలోనే ఉంది… కానీ ఆ నౌకలో సిబ్బంది అక్రమంగా సీల్స్ వేటాడుతున్నారు… టైటానిక్ రక్షణకు వెళ్తే ఈ నేరంలో పట్టుబడిపోతామని భయం కావచ్చు బహుశా… టైటానిక్‌కు వ్యతిరేక దిశలో వెళ్లిపోయారు…
అత్యంత అనైతికమైన చర్య అది… నౌకాయానంలో పాటించాల్సిన పద్ధతుల్ని పూర్తిగా ముంచేసిన చర్య… అది గనుక వెంటనే టైటానిక్ దగ్గరకు వెళ్లి ఉంటే ఇంత ప్రాణనష్టం ఉండేది కాదు… ప్రతి ఒక్కరినీ కాపాడి ఉండేవాళ్లు… సో, ఇలాంటి వాళ్లు సొసైటీలో బోలెడు మంది… ఎవరికీ పనికిరారు… మరో నౌక పేరు కాలిఫోర్నియా… ఇది కూడా టైటానిక్ పరిసరాల్లోనే ఉంది… జస్ట్, 14 మైళ్లు… అదీ కదిలే సీన్ లేదు… చుట్టూ పొడుచుకు వచ్చిన మంచు శిఖరాలు… చీకట్లో ఎటుపోతున్నామో అర్థం కావడం లేదు కాబట్టే లంగరు వేసుకుని, ఆపేశారు…
Ads
ఆ నౌక కెప్టెన్ కూడా టైటానిక్ ఎస్ఓఎస్ గమనించారు… కానీ ఏం చేయాలి..? వాళ్లను రక్షించడానికి వెళ్తే తాము మునిగిపోయే ప్రమాదం వస్తే..? భయం… అందుకే ఆ కెప్టెన్ పట్టించుకోకుండా, సైలెంటుగా పడుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు… తెల్లారేవరకు టైటానిక్ అలాగే ఉంటే, జాగ్రత్తగా వెళ్దాం, లేకపోతే వాళ్ల ఖర్మ అనుకున్నాడు… సొసైటీలో ఇలా రిస్క్ తీసుకోని, తీసుకోలేని జనాభాయే అధికం… మూడో నౌక పేరు కార్పాతియా…
ఈ నౌక మిగతా రెండు నౌకలతో పోలిస్తే దూరంలోనే ఉంది… 58 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది… అందులో సిబ్బంది కూడా టైటానిక్ సంకేతాల్ని పట్టుకున్నారు… గుర్తించారు… నిజానికి అది తన గమ్యం వైపు వెళ్తోంది… కానీ టైటానిక్ పరిస్థితి అర్థం కాగానే సదరు నౌక కెప్టెన్ మోకరిల్లి, దిశ కోసం దేవుడిని ప్రార్థించాడు… రిస్క్ తీసుకున్నాడు… నౌకను వెనక్కి తిప్పాడు… దానికీ మంచు శిఖరాల ముప్పుంది… ఐనా సరే ఫుల్ స్టీమ్ పెట్టేసి, వేగాన్ని పెంచాడు… టైటానిక్ నుంచి ప్రాణాలతో బయటపడిన 705 మందిని తీరానికి తీసుకొచ్చిన నౌక ఇదే…
దటీజ్ కెప్టెన్సీ… హేట్సాఫ్… దీన్ని 3 దశాబ్దాల తరువాత జర్మనీ యుద్ధంలో ముంచేసింది… అది వేరే కథ… సొసైటీ రక్షకులు ఇదుగో ఇలా రిస్క్ తీసుకునే కెప్టెన్లే… కానీ ఎంత శాతమున్నారు..? ఇదీ అసలు ప్రశ్న…!! (ఆరేళ్ల క్రితం Chalasani Srinivas రాసిన పోస్టు ఇన్‌పుట్స్ ఆధారంగా… ఇప్పటితరానికి తెలియాలని…)
Share this Article