ఫాఫం చంద్రబాబు… కాలం ఎదురు తిరగడం అంటే ఇదే… జాతీయ రాజకీయాల్లో చక్రాలు గిరగిరా తిప్పిన ఆయనకు ఇప్పుడు చెప్పలేని దురవస్థే… జగన్ కేసుల్లో పెట్టేయడం, అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు కూడా క్వాష్‌కు అంగీకరించలేదు, రిమాండ్ రిపోర్టుకు వోకే చెప్పింది, రిమాండ్‌కు పంపించేసింది… చివరకు హౌజ్ రిమాండ్‌కూ నో చెప్పింది… ఇంకా కేసులున్నయ్, అవి వరుసగా పైన పడుతుంటయ్…
అనవసరంగా ‘ఏం పీకగలవ్ జగన్’ అని సవాల్ చేసి తప్పు చేశానేమో అనుకుంటూ ఉండవచ్చు బహుశా ఒక్కడే జైలులో కూర్చుని… కాలం బాగాలేదు అని చెప్పడం దేనికంటే… ఎవరు సజెస్ట్ చేశారో గానీ సిద్ధార్థ లూథ్రాను లాయర్‌గా తీసుకోవడం కూడా బ్యాడ్ డేస్‌లో భాగమే… (డీకే శివకుమార్ రికమెండ్ చేసి ఉంటాడంటున్నారు…) భారీ ఖర్చుకూ సిద్ధపడి, ప్రత్యేక ఫ్లయిట్‌లో తీసుకొచ్చినా సరే… ప్రభుత్వ లాయర్ పొన్నవోలు ఎదుట సదరు లూథ్రా వాదనలు వెలవెలాపోయి ఓడిపోవాల్సి వచ్చింది…
వరుసగా సీఐడీ పెడుతున్న చార్జిలను సిద్ధార్థ లూథ్రా తట్టుకోలేకపోతున్నాడు… కోర్టును కన్విన్స్ చేయలేకపోతున్నాడు… మరోవైపు కోర్టు తీర్పు రాకముందే ఆయన విక్టరీ సింబల్ చూపించాడు… అప్పుడే అర్థమైంది ఈ లాయర్ ఏదో తేడాగా ఉన్నాడని..! కానీ చంద్రబాబు, లోకేష్‌లకు ఇంకా తనపై నమ్మకం ఉన్నట్టుంది… అందుకే వేరే ప్రముఖ లాయర్ల జోలికి పోవడం లేదు… అసలు ఈయన ప్రొఫైల్‌లో ఏదేని ప్రముఖ కేసుల్లో ప్రూవ్ చేసుకున్నవి ఉన్నాయా అని తాజా డౌట్…
Ads
మొదట ఓ సిక్కు గురువు సూక్తిని ట్వీట్ చేశాడు… అన్ని మార్గాలూ మూసుకుపోయినప్పుడు కత్తి అందుకోవడమే శరణ్యం అంటాడు… ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు కేసుకు సంబంధించి ఆ ‘జఫర్ నామా’ సూక్తిని వర్తింపజేసి బాష్యానికి దిగడం ఓ మూర్ఖపు ట్వీట్… ఆ సూక్తి వేరే సందర్భంలో వాడితే పర్లేదు… ఇక్కడ సదరు లాయర్ శిఖామణి ఎవరిని కత్తులు పట్టుకోమంటున్నాడు..? అంటే హింసకు దిగండి, అదే మిగిలిన మార్గం అని సూచిస్తున్నాడా..? నువ్వేం న్యాయవాదివయ్యా బాబూ…
అది అయిపోయింది కదా… తాజాగా వివేకానందుడి సూక్తి ఒకటి వదిలాడు… కర్మయోగంలో చెప్పాడట వివేకానందుడు… ఓహో, కర్మయోగం చెప్పింది గీతలో శ్రీకృష్ణుడు కాదన్నమాట… వివేకానందుడి ప్రవచనమా..? పెద్ద లాయర్ అన్నారు, ఆహా ఓహో అన్నారు… ఇదేనా ఆ న్యాయమేధావి మేధస్సు..?
ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలని తన ట్వీట్‌లో సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నాడు… అలాగే… న్యాయం, ధర్మం కోసం నిలబడిన సిక్కు గురు చెప్పిన సూక్తులను అర్థం చేసుకోనివారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు… అన్నీ నిజమే గానీ ఏమిటీ ఫ్రస్ట్రేషన్..? తేలిక అనుకున్న కేసు కాస్తా జీర్ణం కావడం లేదా..? ఇప్పట్లో బాబును బయటికి తీసుకువచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదా..?
న్యాయవాదిగా తన కక్షిదారు గురించి వాదిస్తాడు న్యాయవాది… ఫలితం ఎలా ఉన్నా సరే, స్థితప్రజ్ఞతతో తదుపరి స్టెప్ గురించి ఆలోచిస్తాడు… కానీ ఈయనేమిటో మరి… ఈ ట్వీట్ల కుంగుబాటు ఏమిటో… వాట్ నెక్స్ట్..? తనకు అర్థమైతే కదా… నిన్న రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అయ్యాడు… ఆ తర్వాత… చంద్రబాబు కుటుంబ సభ్యులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యాడు… వివరణలు ఇచ్చుకుంటున్నాడా..? లేక చంద్రబాబు ఫ్యాన్స్ చేసే వాదనలతో బుర్ర గిర్రున తిరిగిపోతున్నదా..?
లక్షల కోట్ల టర్నోవరున్న సైబరాబాద్ కట్టాడు, ఐటీ ఉద్దరించాడు, నిప్పులా బతికాడు, కంప్యూటర్ కనిపెట్టాడు, మొబైల్ ఆవిష్కరణ ఆయన పుణ్యమే, రాజమండ్రి జైలు తనే కట్టాడు… అలాంటిది చంద్రబాబును అరెస్టు చేస్తారా..? ఎంత దారుణం..? ఇవీ బాబు ఫ్యాన్స్ వాదనలు… ఇవన్నీ సరే, అంగీకరిద్దాం… ఇవన్నీ చేశాడు కాబట్టి అవినీతి అక్రమాలకు పర్మిషన్ ఇచ్చినట్టా..? లేక కేసుల నుంచి ఇమ్యూనిటీ లభించినట్టా..? ఈ వాదనలతో తటస్థులకేం ఖర్మ, చంద్రబాబు లాయరే జుత్తు పట్టుకుంటున్నట్టున్నాడు… ఫాఫం…
అవునూ, ఎలాగూ ఇండియా కూటమి వైపు మొగ్గుతున్నట్టున్నాడు కదా చంద్రబాబు… కపిల్ సిబల్‌ను పిలిపించలేకపోయారా..? ఆయనైతే ఏకంగా సుప్రీం తలుపులనూ అర్ధరాత్రి తెరిపించగలడు… ప్చ్, సమయానికి చంద్రబాబుకు గుర్తుకురానట్టుంది…
Share this Article