Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గురువులు, విజ్ఞులు దయచేసి ఈ ధర్మసందేహాలు తీర్చగలరు…

October 28, 2026 by M S R

.

స్నేహితులు; పెద్దలు; గురువులు; విజ్ఞులు దయచేసి నాకున్న కొన్ని ధర్మసందేహాలు తీర్చగలరు… 1) వాల్మీకి వర్ణనలో కాకుండా సీతామహాసాధ్వి రూపలావణ్యాలను ప్రత్యక్షంగా చూసి ఆ తల్లి భౌతికరూపాన్ని నమోదు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా…?

2) బ్రహ్మర్షి విశ్వామిత్రులవారు అందించినట్టుగా చెప్పబడుతున్న గాయత్రీ మంత్రం మనుగడలోకి రాకముందు మూడు వర్ణాల వాళ్లు చేసిన సంధ్యావందనం క్రతువు ఎలా ఉండేది…? యజ్ఞోపవీతం ధరించేవారా..? ఇష్టదైవానికి అర్ఘ్యం ఇవ్వడం కాకుండా ఏం చేసేవారు…?

Ads

3) వేదంలో మనం వర్తమానంలో కొలుస్తున్న దైవాలు త్రిమూర్తులు; పంచభూతాలు; అష్ట దిక్పాలకులు కాకుండా ఇంకెవరున్నారు…?

4) ద్వాపరయుగంగా మనం చెప్పుకుంటున్న కాలంలో మన మతంలో కులముందా..? లేక వర్ణం మాత్రమే ఉండిందా..? దయచేసి నాకు నివృత్తి చేయగలరు..! ఇదీ గొట్టిముక్కల కమలాకర్ ఫేస్ బుక్ పోస్టు…


రామాయణ్
Murali Buddha… ఒకటో అంశం… ఉన్నాయి . చూసిన వారు face book లో చాలా మంది ఉన్నారు. ఫలానా హీరోయిన్ లో ఆ లక్షణాలు లేవు అని ఆధారాలతో చెబుతున్నారు…
·
Chiranjeevi Prasad Rao Santhapur …. ఫేస్ బుక్ లో కన్నా ఇన్ స్టాలో చాలా మంది సీతమ్మ వారిని చూశారు. ఏ హీరోయిన్ తో సారూప్యం ఉందో కూడా వాళ్ల రీల్స్ న్యాయస్థానాల్లో తీర్పులు చెప్పేస్తున్నారు…

.
Prasanthi B Positive … వాళ్ళ అభిప్రాయాలు చదువుతుంటే సీతమ్మ నిజంగా వచ్చినా ఒప్పుకునేలా లేరు. అందుకే వాళ్లకి నచ్చినట్టు AI సీతని చూసి తృప్తి పడుతున్నారు …


…. ఇవీ కామెంట్లు… కవులు, రచయితలు తమకు తోచిన వర్ణనలు చేయడమే కదా… చిత్రకారులు గీసిన బొమ్మలే కదా మన మెదళ్లలో ముద్రితమయ్యాయి… మరి సాయిపల్లవి సీత ఏమిటి..? రాముడికి జంధ్యం లేదేమిటి..? రాముడు ధవళ వర్ణుడేమిటి..? రావణుడికి ఆ గడ్డమేమిటి..? ఎందుకీ ప్రశ్నలు- విమర్శలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గురువులు, విజ్ఞులు దయచేసి ఈ ధర్మసందేహాలు తీర్చగలరు…
  • సుమో దీదీ… అసాధారణ క్రీడాకారిణి కథకు శ్రియమ్ భగ్నానీ ప్రాణం!! 
  • నెహ్రూ కుటుంబానికి మళ్లీ మహర్దశ ! ప్రియాంక శకం ఆరంభం !!
  • ఓ జాతీయ సర్వే నిర్వహించి- ఆర్టిస్టులను ఎంపిక చేయాల్సిందేమో !!
  • KCR – సొంత బిడ్డనే కాదన్నాడు – ఈ ‘బిడ్డ’నూ గాలికి వదిలేశాడు !!
  • పులివెందుల కంచుకోట బద్ధలు – వై నాట్ సిరిసిల్ల? వై నాట్ సిద్దిపేట?
  • కార్పొరేట్ వైద్య మాఫియా ! సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యాలు !!
  • డ్రగ్ డాన్ వెళ్లిపోయాడు – ఆ నీడలు పెరిగి భయపెడుతున్నయ్ !!
  • హేట్సాఫ్ అమెరికా… 1930 లోనే 13 నెలల్లో 102 అంతస్తుల అద్భుతం !!
  • 418 … కేజీఎఫ్ దర్శకుడి సినిమా అంటే ఎక్కువ ఊహించాం… కానీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions