Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!

July 5, 2025 by M S R

.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు..? ఈ చర్చ చాన్నాళ్లుగా ఉంది… కొన్నిసార్లు మన తెలుగువాళ్లే అభిమానంతో కిషన్ రెడ్డి పేరును కూడా ప్రచారంలోకి తెచ్చారు… మోడీ సమకాలీనుడు, కలిసి పనిచేసినవాళ్లు, సంఘ్ నేపథ్యం నుంచి ఎదిగాడు కాబట్టి, పార్టీ అవసరాలు- దక్షిణాన వ్యాప్తి కోణంలో పరిశీలించదగిన పేరే… కానీ..?

హఠాత్తుగా మహిళా అధ్యక్షురాలు అనే ప్రచారం జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది… 2020 నుంచీ జేపీ నడ్డాయే చీఫ్… పేరుకు… నిజానికి అమిత్ షా, మోడీయే నడిపిస్తున్నారు… నడ్డా ప్లేసులో ఎవరనే చర్చను కొత్త మలుపు తిప్పింది మీడియా… లీకులిచ్చింది కూడా బీజేపీయే…

Ads

ప్రధానంగా మూడు పేర్లనే ప్రచారంలోకి తీసుకొచ్చారు… 1) ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2) ఎంపీ పురంధేశ్వరి 3) బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్… ఐతే వీరిలో ఎవరికి చాన్స్ అనే ఊహాగానాలతోపాటు ఎవరు బెటర్ అనే చర్చ కూడా నడుస్తోంది మీడియాలో…

నిర్మల సీతారామన్… చాన్నాళ్లుగా ఆర్థిక మంత్రి… ఉన్నత విద్యావంతురాలు, తమిళ బ్రాహ్మణ మూలాలు… తెలుగింటి కోడలు… ఐతే తను మంచి వక్త కాదు… ఇన్నాళ్ల అనుభవం కారణంగా ఆమెను ఆర్థిక మంత్రిగానే కొనసాగించడం మేలనేది ఒక అభిప్రాయం… ఆమెను పార్టీ అధ్యక్షురాలిని చేసి, ఆమె ప్లేసులో మరో ఆర్థిక మంత్రిని తీసుకుంటే రెండు పోస్టులకూ నష్టమే అనేది పార్టీ శ్రేణుల్లోనే ఓ భావన ఉంది… ఆమెకు సంఘ్ బాసటగా ఉండకపోవచ్చు… ఆమెకూ మంత్రిగా కొనసాగడంపైనే ఇష్టమట…

పురంధేశ్వరి బాగా మాట్లాడగలదు… రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించిన అనుభవం ఉంది… కానీ సంఘ్ నేపథ్యం లేదు… మొదట్లో టీడీపీ, తరువాత కాంగ్రెస్… ఆ తరువాతే బీజేపీలోకి… ఏపీలో మాధవ్, తెలంగాణలో రామచంద్రరావు ఎంపికలు జరిగిన తీరు పరిశీలిస్తే… ప్రధానంగా సంఘ్ నేపథ్యం నుంచి ఎమర్జయినవాళ్లకే బీజేపీ ప్రయారిటీ ఇస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది… సో, సంఘ్ పురంధేశ్వరి పేరు పట్ల పెద్ద సానుకూలత వ్యక్తం చేయకపోవచ్చుననే విశ్లేషణ వినిపిస్తోంది…

vanathi

వనతి శ్రీనివాసన్… ఏపీలో బీజేపీ ఎంతో, తమిళనాడులో బీజేపీ కూడా అంతే… అంతంతమాత్రం ఉనికి, కానీ ఈమె లాయర్ (మాస్టర్స్ చేసింది, మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్), 55 ఏళ్లు… 1993 నుంచీ బీజేపీలోనే వర్క్ చేస్తోంది… మాట్లాడగలదు… ప్రస్తుతం జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు…

మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్‌ను అలవోకగా ఓడించింది గత ఎన్నికల్లో… సంఘ్‌కు ఇష్టురాలు… ప్రత్యేక కొంగునాడు రాష్ట్ర సాధనకు మద్దతుదారు… ముగ్గురూ దక్షిణ నేతలే… కానీ వనతికి సంఘ్ ఆశీస్సులు అనే విశ్లేషణ మీడియాలో వస్తోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions