ఒక మిత్రుడు అడిగాడు ముఖేష్ అంబానీ గారు ఏంటి తన చిన్న కొడుకు పెండ్లి ఆషాఢ మాసంలో చేశాడు అని.
అందరికీ తెలిసిన విషయమే, ఇంకా గతంలో గరికపాటి నరసింహారావు గారు కూడా క్లియర్ గా చెప్పారు. ఆషాడంలో (జూలై నెలలో) పెండ్లి చేస్తే, గర్భధారణ జరిగితే, 9 నెలలు తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెల ఎండలు ఎక్కువ ఉండే సమయంలో పిల్లలు పుడితే, పూర్వపు రోజుల్లో కన్వీనియంట్ గా ఉండేది కాదు, అందుకే పూర్వీకులు ఆషాడంలో కొత్త దంపతులు దూరంగా ఉండాలని, ఇంకా పెండ్లిళ్ళు చేయకూడదని నిర్ణయించారు. టెక్నికల్ గా చూస్తే అది 100% కరక్ట్ ఇంకా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ AC ల్లోనే ఉంటారు కాబట్టి ఏ సమస్యా లేదు. డాక్టర్ కూడా వాళ్ళ ఇంటికే వచ్చి చూస్తాడు కాబట్టి ఎప్పుడు పెండ్లి చేసుకున్నా పూర్వపు రోజుల్లోలాగా వారికి ఏ సమస్యా లేదు/రాదు.
అది పక్కన పెడితే దక్షిణ భారతదేశం పాటించే పంచాంగానికి, ఉత్తర భారతదేశ పంచాంగానికి కొంత తేడా ఉంది. రెండు రకాల పద్దతుల్లో ఒక 15 రోజుల తేడా ఉంటుంది. అమావాస్య తెల్లారి నుంచి శుక్ల పక్షం ఆధారంగా ఒక క్యాలండర్ ఉంటే, పౌర్ణమి తెల్లారి నుంచి కృష్ణ పక్షం ఆధారంగా ఇంకో క్యాలండర్ ఉంటుంది. దీనికి తోడు చంద్రుని కదలికలని బట్టి ఒకటి, సూర్య గమనాన్ని బట్టి ఇంకోటి ఉంటుంది.
Ads
ముఖేష్ అంబానీ గారు మంచి పండితులని పిలిపించి వారి క్యాలండర్ ఆధారంగా ముహుర్తం నిర్ణయించారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నా ప్రకారం అభిప్రాయాలు కుదిరితే ఏ నమ్మకాలూ లేకుండా చేసుకున్నా సమస్య లేదు.
అయితే న్యూమరాలజీ ప్రకారం పెండ్లి జరిగిన తేదీ “జూలై 12, 2024” అంటే 7+1+2+2+0+2+4 =18=1+8=9. సాధారణంగా న్యూమరాలజీ ప్రకారం మ్యారేజ్ కి 5 మంచిది కాదు, ఆ తర్వాత 9 కూడా మంచిది కాదు . అయితే అనంత్ అంబానీ పుట్టిన తేదీ “10 ఏప్రిల్, 1995” అంటే అతని జన్మ సంఖ్య 1, డెస్టినీ సంఖ్య 11 లేదా 2. లైఫ్ పాత్ నంబర్ 11 లేదా 2 కాబట్టి మ్యారేజ్ కి అన్ని లెక్కలు చూసి 3 మరియూ 9 అత్యంత శ్రేష్టం కాబట్టి తేదీ 12 అంటే 1+2=3 ఇంకా మొత్తం తేదీ చూస్తే జూలై 12, 2024= 9. ఏ రకంగా చూసినా ఖచ్చితంగా 100% అతనికి సూట్ అవుతుంది, అన్ని లెక్కలు చూసే పెండ్లి జరిపించారు అనిపిస్తుంది.
ఇవన్నీ పక్కన పెడితే హర్షద్ మెహతా గారు చెప్పినట్లు జేబు ఖాళీ ఉంటే మన గ్రహాలు అన్నీ అనుకూలించినా ఎవరూ దేకరు, అదే జేబులో ఫుల్ గా డబ్బు ఉంటే శని ఉన్నా ఏం ఫరఖ్ పడదు.
మన సమాజంలో నేను చూసిన దాని ప్రకారం… అన్నీ బాగున్నప్పుడు ఇలాంటి విషయాలని నమ్మే వారికంటే అపజయం ఎదురైనప్పుడు, ఓడిపోయినప్పుడు, బంధాలు బ్రేక్ అయినప్పుడు, కాలం కలిసి రానప్పుడు, ఇంకేదో సమస్య వచ్చినప్పుడు – ఇలాంటి నమ్మకాలు; గ్రహాలు, నక్షత్రాలు, జాతకాల గురించి ఆలోచించే వారు ఎక్కువ.
ఫెయిల్ అయినప్పుడు, బంధం బ్రేక్ అయినప్పుడు, కలిసి రానప్పుడు – బయట కారణాలు వెతకటం కంటే మనిషి తన లోపల కారణాలు వెతకాలి అంటారు రోమన్ తత్వవేత్తలు. ఏది ఏమైనా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మంచిగా కలిసి ఉండాలని ఆశిస్తూ, శుభాకాంక్షలు….. ( By జగన్నాథ్ గౌడ్ )
Share this Article