.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక చిన్న రీల్… 14 లక్షల వ్యూస్… వందల కామెంట్లు, లైకులు… ఏముంది అందులో..?
ఒక అమెరికన్ ట్వీట్, తరువాత డిలిట్ చేయబడింది… అందులో ‘‘డల్లాస్‌లో ఈ సీన్ చూడండి, వీళ్ల హెచ్1బీ వీసాలు రద్దు చేయాలి, నేను నా పిల్లలను అమెరికాలో పెంచాలని అనుకుంటున్నాను, ఇండియాలో కాదు…’ అని ఉంది…
Ads
ఓ వీడియో జతచేసి ఉంది… అందులో మన ఇండియన్స్ డ్రమ్స్ వాయిస్తూ వీథుల్లోనే ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు… మరి ఇందులో ఆ అమెరికన్ అంతగా అసహనానికి గురికావల్సిన అవసరం ఏముంది అంటారా..?
సహజం… అసలే జాబ్స్ పోతున్నాయి, చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత నిరంతరాయంగా నడుస్తూనే ఉంది… అమెరికన్ మార్కెట్ అస్సలు బాగోలేదు… దీంతో జాబ్స్ పోయిన అమెరికన్లలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది… ఎక్కడి నుంచో వచ్చి మన పొట్టలు కొడుతున్నారనే కోపం ఇండియన్లపై పెరుగుతోంది…
ట్రంప్ సరిగ్గా ఈ భావనల్నే పెంచి గెలుపు సాధించాడు… ఈ వ్యతిరేకత ఇంకా పెరిగితే మనవాళ్లకే ప్రమాదం… అక్కడి సొసైటీల్లో అన్‌రెస్ట్ పెరిగితే అది మనకే నష్టం… దీనికితోడు మనవాళ్ల వ్యవహారశైలి అమెరికన్లకు చిరాకు, కోపాన్ని పుట్టిస్తోంది…
ఎవడో హీరో వస్తే వందల కార్లతో ఊరేగింపులు, అరుపులు, కేకలు… చివరకు థియేటర్లలో కాగితాలు చింపి విసిరివేయడం, డాన్సులు, థియేటర్ల ముందు ప్రదర్శనలు… చివరకు సీట్లను చింపేసే సీన్లు… మన ఉత్సవాల అతి ప్రదర్శనలు, నినాదాలు… రోమ్‌లో రోమన్‌లాగా బతకాలిరా అంటే అస్సలు వినరు కదా మనవాళ్లు…
అక్కడా ప్రాంత, కుల పోకడలు… మాల్స్‌లో సరుకుల చోరీలు… మన రోతను అమెరికా కాదు, మనవాళ్లు అంగారక గ్రహం వెళ్లినా తీసుకుపోతారని పదే పదే చెప్పుకుంటున్నదే కదా మనం… ఐతే ఇది క్రమేపీ ఇండియన్లకు వ్యతిరేక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందనే సోయి లేకుండా పోయింది మనవాళ్లకు…
‘‘లోకల్స్ ఎవరు ఇక్కడ..? ఈ అమెరికన్లు కూడా వలసవచ్చినవాళ్లే కాదా..? మనలాగే వాళ్లూ’’ అనే ఓ సమర్థన వినిపిస్తుంటారు మనవాళ్లు… కానీ వాళ్లు వందల ఏళ్లుగా పాతుకుపోయారు, బలవంతులు, ఓన్ చేసుకున్నారు… అనేక అననుకూల పరిస్థితులను తట్టుకుంటూ, అఫ్‌కోర్స్ రియల్ లోకల్స్‌ను తరిమేస్తూ, తొక్కేస్తూ వాళ్లకంటూ ఓ జీవనవిధానాన్ని డెవలప్ చేసుకున్నారు… అక్కడ వాళ్లవే ప్రభుత్వాలు, అధికారాలు… వాళ్ల లైవ్‌లీహుడ్, వాళ్ల కల్చర్ డిస్టర్బ్ అవుతుంటే అసహనం పెరగడం సహజం కాదా..?
నిజానికి ఇది పెద్ద సబ్జెక్టు… లోతైంది కూడా… సున్నితమైన ఇష్యూస్ కూడా లోకల్ అన్‌రెస్ట్ ఎందుకు పెంచుతున్నాయో మన ఇండియన్ అసోసియేషన్లు ప్రవాసులను చైతన్యపరచాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది… అసలు అవే బాధ్యతారహితంగా ఉంటున్నాయి అంటారా..? ఇక చెప్పడానికేమీ లేదు..!!
Share this Article