Pardha Saradhi Potluri … PMLA – Prevention of Money Laundering Act!
PMLA కింద అరెస్ట్ ఆయన వాళ్లకి బెయిల్ వస్తుందా?
తమ నాయకుడు లేదా నాయకురాలు త్వరలో బెయిల్ మీద బయటికి వస్తుంది, వస్తాడు అంటూ రీల్స్ చేసి వదులుతున్నారు.
Ads
అది నిజమేమో అనుకుని సోషల్ మీడియాలో వార్తలు గుప్పిస్తున్నారు అభిమానులు!
ఒకసారి ED కనుక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కష్టం!
PMLA (Prevention of Money Laundering Act) ను 2002 లో రూపొందించారు.
2022 లో అదే చట్టానికి ఒక సవరణ చేశారు.
PMLA కి సెక్షన్ 45 ను జోడిస్తూ ఆ సవరణ చేశారు. సవరించిన సెక్షన్ 45 ప్రకారం మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ ఆయన వాళ్ళను దోషిగా పిలుస్తారు అంటే ED పెట్టిన కేసులో తాము నిర్దోషులుగా వాళ్ళే నిరూపించుకోవాలి అప్పటి వరకు వాళ్ళని దోషిగానే పరిగణిస్తారు.
అదే CRPC కింద అరెస్ట్ అయితే పోలీసులు, CBI నిందితుడిగానే పరిగణిస్తారు. నేరం నిరూపించాల్సిన బాధ్యత పోలీసులు లేదా CB I ది.
ED కేసులో సదరు దోషులు తాము నేరం చేయలేదని వాళ్ళే నిరూపించుకోవాలి!
PMLA సెక్షన్ 45 ప్రకారం ED వ్యతిరేకిస్తే బెయిల్ ఇవ్వకూడదు చివరికి సుప్రీం కోర్టు కూడా.
ED ఎలాంటి ఆధారాలు లేదా సాక్ష్యాలు చూపించలేకపోయినా 2 సంవత్సరాల పాటు బెయిల్ దొరకదు.
అంటే ED ఎలాంటి ఆధారం లేదా సాక్ష్యం చూపించలేకపోతే రెండేళ్ల తరువాత ED అభ్యంతరం పెట్టినా కోర్టు బెయిల్ ఇస్తుంది.
So..! ED కేసులో బెయిల్ దొరకడం కష్టం.
Aap ఆర్థిక మంత్రి సత్యెేంద్ర జైన్ అరెస్ట్ అయి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నది. మనీష్ సిసోడియా అరెస్ట్ అయి సంవత్సరం అవుతున్నది. బ్లాక్ టికెట్లు అమ్మే సంజయ్ సింగ్ అరెస్ట్ అయి 9 నెలలు అవుతున్నది. కవిత, కేజ్రీవాల్ ఇటీవలే అరెస్ట్ అయ్యారు.
సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికీ ఒక రోజు బెయిల్ ఇచ్చారు. భార్య ఆరోగ్యం బాగాలేదని సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకి వారం రోజులపాటు బెయిల్ ఇచ్చారు.
ఇక కవిత, కేజ్రీవాల్ లకి కూడా భార్య, భర్తల ఆరోగ్యం బాగాలేదని కోరితే వారం రోజులలోపు పరిమితికే బెయిల్ ఇస్తారు.
కాబట్టి ED కేసులో మెడికల్ గ్రౌండ్స్ లోనే తాత్కాలిక బెయిల్ దొరుకుతుంది, అదీ ED వ్యతిరేకించకుండా ఉంటేనే..!
Share this Article