.
కోర్టుల అంతర్గత విషయాలపై నిజానికి మీడియాలో జరగాల్సినంత చర్చ జరగడం లేదనీ, జనానికి తెలియడం లేదనీ అనిపిస్తుంది చాలాసార్లు… ఒక సుప్రీంకోర్టు జడ్జి రిటైరైనప్పుడు లాయర్లు పదవీ విరమణ కార్యక్రమాన్ని బహిష్కరించడం ఓ విశేషమే…
కానీ ఆమె అంటే ఎందుకంత కోపం…? మిత్రులు Murali Krishna ఫేస్‌బుక్ వాలీ మీద కనిపించిన పోస్టు ఏమనాలో కూడా అర్థం గాకుండా ఉంది… మీరే చదివి ఓ అభిప్రాయానికి రండి…
Ads
సహజంగా తోటి ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో అన్ని విభేదాలు పక్కన పెట్టి వీడ్కోలు పలుకుతారు. అది సాంప్రదాయం. ఐతే జస్టిస్ (రిటైర్డ్) బేలా త్రివేది పదవీ విరమణ నాడు సుప్రీమ్ కోర్ట్ బార్ అసోసియేషన్, సుప్రీమ్ కోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ జంటగా బేలా త్రివేది పదవీ విరమణ కార్యక్రమాన్ని బహిష్కరించారు.
కారణం – ఆవిడ చాలా కేసుల్లో నిందితులకు బెయిల్ నిరాకరించడం. అందులో ఢిల్లీ అల్లర్లలో ప్రధాన నిందితుడు అయిన ఖలీద్ ఉమర్, గుల్ఫిషా ఫాతిమా, షర్జీల్ ఇమామ్, భీమా కొరేగాఁవ్ అల్లర్లలో నిందితుడైన మహేష్ రౌత్, సాయిబాబా, రా.నా. సత్యేంద్ర జైన్, కవిత (లిక్కర్ స్కామ్), తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ, జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే కుమారుడు, నిషేధిత పీ ఎఫ్ ఐ నాయకులు, బ్యాంక్ ఫ్రాడ్ నిందితులు ఉన్నారు.
ఈవిడ కరుకుదనం అర్థం అయిన అరగుండు, ఢిల్లీ అల్లర్లలో అరెస్ట్ అయిన సలీమ్ మాలిక్, భీమా కొరేగాఁవ్ అల్లర్ల కేసులో నిందితుడైన హనీబాబు చివరి నిమిషంలో బెయిల్ అప్లికేషన్లు విరమించుకున్నారు.
తరువాత వీళ్ళలో కొందరు ‘బెంచ్ హంటింగ్’ ద్వారా వేరే జడ్జెస్ బెంచ్ ముందు బెయిల్ పొందారు.
అందుకే కపిలం బాబాయి ఆమె పదవీవిరమణ రోజున ‘మీరు కొద్దిగా empathy చూపించి ఉండవలసింది’ అన్నాడు.
కొన్ని కేసుల్లో రికార్డులో ఉన్న అడ్వొకేట్స్ అందరి పేర్లు రాయడానికి ఆవిడ ఇష్టపడలేదు. కారణం – వాళ్ళు ఏనాడూ ఆ కేసుల్లో appear అవ్వలేదట. ఒక కేసులో రూలింగ్ ఒక పేజీ ఉంటే, అడ్వొకేట్స్ పేర్లు పది పేజీలు ఉన్నాయట. వీళ్ళందరూ సుప్రీమ్ కోర్టు అడ్వొకేట్స్ అనిపించుకోడానికి చేసే ప్రయత్నం. వాళ్ళని తప్పు పట్టను.
బార్ కౌన్సి ల్ లో ‘సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్’ రెన్యూ అవాలంటే గడచిన ఐదేళ్ళలో కనీసం ఐదు వకాలతులు వేసినట్లు ఋజువు చెయ్యాలి. అందుకే ఈ తంటాలు.
(బెంచ్ హంటింగ్ – సాధారణంగా కేసులను వివిధ జడ్జీలకు సీజే కేటాయిస్తారు. ఆ రొటేషన్ మారుతూ ఉంటుంది. తమకు ‘అనుకూలం’గా ఉండే జడ్జ్ ముందుకు బెయిల్ పిటీషన్ వచ్చేదాకా వివిధ రకాల పిటీషన్స్ వేస్తూ ఉంటారు. ‘అనుకూల’ జడ్జ్ ముందుకు బెయిల్ పిటీషన్ రాగానే బెయిల్ పొందుతారు.
ఇవేకాక జడ్జీలకు వేర్వేరు పోర్టుఫోలియోలు కేటాయిస్తారు. ఉదావరణకు రాజ్యాంగానికి సంబంధించిన కేసులు ఒక బెంచ్ ముందుకు వస్తాయి. అలాగే సివిల్ అప్పీల్స్, క్రిమినల్ అపీల్స్, టాక్స్ చట్టాలు – ఇలా వివిధ రకాల కేసులను ఆయా జడ్జెస్ కు కేటాయిస్తారు.
ఇవి మారుతూ కూడా ఉంటాయి. అలా మారుతూ, మనకు అనుకూలమైన జడ్జ్ ముందుకు వచ్చేదాకా ఆగి, అప్పుడు మనకు అనుకూలమైన రూలింగ్ రాబట్టుకోవడం అన్నమాట.)
అన్ని బెయిల్ పిటీషన్లు సాధారణంగా ఇద్దరు సభ్యుల ధర్మాసనం ముందుకు వస్తాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఇద్దరూ ఒకే రూలింగ్ ఇస్తే ఓకే. కానీ చెరొక రకంగా రూలింగ్ ఇస్తే అప్పుడు మూడో జడ్జ్ దగ్గరకు వెళ్తుంది.
ఇది కోర్టు వారి, లాయర్ల, క్లెయింట్ల అమూల్యమైన సమయం వృధా అయినట్లు కాదా? సరే, వాళ్ళ రూల్ వాళ్ళది. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. జస్టీస్ (రిటైర్డ్) బేలా మాధుర్య త్రివేది గారి ముందుకు వచ్చిన బెయిల్ పిటీషన్లలో చాలావరకు ఛీఫ్ జస్టిస్ (రిటైర్డ్) డి వై చంద్రచూడ్ గారి హయాంలో వచ్చినవేనని ‘ఇస్క్రోల్’ డాట్ ఇన్ వాడు వాపోతున్నాడు…
Share this Article