హవ్వ… 500 ఏళ్ల కోరిక అయోధ్యలో బాలరాముడి గుడి నిర్మాణం… దాని పేరిట బీజేపీ ఉద్యమాలు చేసి, సీట్ల సంఖ్యను పెంచుకుంది… భవ్యమైన మందిరం కట్టారు… దేశమంతా చందాలు తీసుకున్నారు, అక్షింతలు పంచిపెట్టారు, ఆ ఎమోషన్‌ను ఎన్నికల్లో వాడుకోవాలని అనుకున్నారు…
తీరా చూస్తే ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అయోధ్య గుడి ఉందో ఆ ఫైజాబాదులోనే బీజేపీ ఓడిపోయింది… రాముడి దీవెనలు లేవు అనడానికి, అక్షింతల మహత్తు పనిచేయలేదు అనడానికి ఇదే ప్రబల ఉదాహరణ….. ఇదుగో ఇలా చాలా విమర్శలు, జోకులు, విశ్లేషణలు, కొందరైతే వెటకారాలు పోస్ట్ చేస్తున్నారు, కనిపిస్తున్నాయి…
మిత్రుడు Nationalist Narasinga Rao పోస్ట్ ఈ విషయంలో ఆసక్తికరంగా అనిపించింది… అదిలా ఉంది…
Ads
1989 లోకసభ ఎన్నికల్లో ఫైజాబాద్ నియోజకవర్గం నుండి CPI గెలిచింది… అయినా కూడా బిజెపి VHP 1990 లో మొదటి కరసేవకు ప్లాన్ చేశాయి… 1991,96 లలో బిజెపి గెలిచింది ( వినయ్ కథియార్)…
ఇదీ వివరణ… నిజమే… అసలు ఉత్తరప్రదేశ్‌లో వేల ఎన్‌కౌంటర్లతో పాతుకుపోయిన మాఫియాకు పగ్గాలు వేశాడు యోగి… అయోధ్య నిర్మాణమే కాదు, వారణాసి కారిడార్ పూర్తి చేశాడు… అవినీతి లేదు, బంధుప్రీతి లేదు, వారసత్వం గొడవలు లేవు…
Share this Article