Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అధికారానికి మాత్రం మేం… పోరాటాలకు, కేసులకు బడుగులు…

September 19, 2025 by M S R

.

మీకు గుర్తుందా..? వివేక్ టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు… అప్పటికి ఇంకా బీఆర్ఎస్ కాలేదు… వీ6 లో కావాలని రెడ్లపై ఓ డిబేట్ నడిపించారు… సోకాల్డ్ మేధో జర్నలిస్టులు, ఉద్యోగనేతలు, మేధావులతో రెడ్ల మీద ఉద్దేశపూర్వకంగా దాడి… కేసీయార్ సూచనల మేరకు నడిచిన ప్రిప్లాన్‌డ్ ప్రచారం…

వాళ్ల జనాభా ఎంత..? వాళ్లకు దక్కుతున్న అధికారం వాటా ఎంత..? తెలంగాణ ఇక ఈ రెడ్డిరికానికి చరమగీతం పాడలేదా అనేంత స్థాయిలో మాట్లాడాయి సదరు డిబేట్ అతిథి పాత్రలు… అంతకన్నా తక్కువ జనాభా ఉన్న వెలమలకు అదే స్థాయి అధికారం (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రి పదవులు) దక్కితే తప్పేమిటి అనే పరోక్ష సమర్థన కోసం కేసీయార్ ప్లాన్ చేసిన ఓ ప్రచార ప్రణాళిక అది…

Ads

ఎస్, తెలుగుదేశంలో కమ్మలు, కాంగ్రెస్‌- వైసీపీలో రెడ్లు, జనసేనలో కాపులు, బీఆర్ఎస్‌లో వెలమలదే ఆధిపత్యం… అందరూ అనుకునేదే… సీన్ కట్ చేస్తే… ఈ కులపంచాయితీల ప్రణాళికలు,, ఎత్తుగడలు కొట్టుకుపోయి, కేసీయార్ జనాగ్రహానికి గురై, ఓడిపోయి, జనం మీద కోపంతో ఫామ్ హౌజ్‌లో తలదాచుకున్నాడు…

సీన్ కట్ చేస్తే… ప్రస్తుతం బీఆర్ఎస్ ధోరణి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది… వాట్సప్ కొన్ని గ్రూపుల్లో సర్క్యులేషన్‌లో ఉన్న పోస్టులను బట్టి చూస్తే… కేటీయార్ కోటరీలో సింహభాగం, ప్రాధాన్యం రెడ్లకే… వాళ్ల మీద కేసులు గట్రా పడితే కొట్టేయిస్తుంటారు… కావాలనే జగదీష్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి వంటి నేతలతోనే కంట్రవర్సీ విమర్శలు చేయిస్తుంటారు…

హరీష్, కేటీయార్ తప్ప మరే వెలమ నేత తెర మీదకు వచ్చి కంట్రవర్సీ విమర్శలు చేయరు… అధికారంలోకి వస్తే అంతా వాళ్లే… ప్రతిపక్షంలో ఉంటేనేమో గప్‌చుప్… కవిత మీద వ్యాఖ్యలు చేయడానికి జగదీష్ రెడ్డి, రేవంత్ రెడ్డి కావాాలని కాంగ్రెస్ ఎంపీలతో ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి క్రాస్ వోటింగ్ చేయించాడు అంటూ కౌశిక్ రెడ్డి… ఇలా… (ఇలాంటి విమర్శలకు వాళ్లే కీలకనేతలు ఇప్పుడు బీఆర్ఎస్‌లో…!!!)

ఆ వాట్సప్ మెసేజుల్లో కేటీయార్ చుట్టూ ఉన్న కోటరీలో రెడ్డి ముఖ్యులు ఎవరెవరనే వివరాలూ కనిపిస్తున్నయ్, కానీ ఆ పేర్ల ప్రస్తావన ఇక్కడ అనవసరం, కొందరు తెర వెనుక వ్యూహకర్తలు, కొందరు తెర మీద కనిపిస్తారు… కేసులు పడుతున్నయ్ కొందరి మీద, వాళ్ల లీగల్ సెల్ ప్రతిభతో అవి కొట్టేయబడుతున్నయ్… అది వేరే కథ…

కానీ జైళ్లకు వెళ్లేది ఎవరు..? పోరాటాలకు ముందు పెట్టేది ఎవరిని..? బీసీలు, ఎస్సీ, ఎస్టీలు… ఉదాహరణకు గౌతమ్ గౌడ్, శశిధర్ గౌడ్, మన్నె క్రిశాంక్ తదితరులు… మహాన్యూస్ మీద దాడికి పోయింది ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ… ఎవరు వాడుకోబడుతున్నారు..? పోస్టుకు 3 కోట్లు వంటి గ్రూపు-1 విమర్శలకు మాజీ బీఎస్పీ ఆర్ఎస్పీ..!!

ఒకవైపు రాష్ట్రంలో బీసీ మూమెంట్ ఊపందుకుంటోంది… బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆమోదం కోసం రేవంత్ రెడ్డి నానారకాలుగా ప్రయాసపడుతున్నాడు… అవసరమైతే పార్టీపరంగా 42 శాతం సీట్లకూ సై అంటున్నాడు… అది తెలివైన రాజకీయ ఎత్తుగడ… బీఆర్ఎస్ మాత్రం పైపైన మీడియాలో వ్యాఖ్యలు తప్ప, మేమూ బీసీలకు సమానవాటా ఇస్తాం, 42 శాతం సీట్ల కేటాయింపుకు మేము సైతం రెడీ అని మాత్రం అనదు…

అసలు స్థానిక సంస్థల్లో బీసీల సీట్లు తగ్గిపోయినవే బీఆర్ఎస్ వల్ల కదా… సిట్యుయేషన్ ఇలా ఉంటే… బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం అమలు చేసే కార్యాచరణలో మాత్రం బీసీలు, ఎస్సీ ఎస్టీలను ముందు పెట్టడం, వాళ్లు జైళ్లకు వెళ్తూ ఉండటం…, వెలమలు, ఇతర అగ్రవర్ణాలు సైలెంట్… ప్లస్ కావాలని కంట్రవర్సీ విమర్శలకు కాంగ్రెస్ నేతల్ని ముందు పెట్టడం… ఇంట్రస్టింగ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అధికారానికి మాత్రం మేం… పోరాటాలకు, కేసులకు బడుగులు…
  • కృష్ణ గారడీ ఏమీ లేదు… అంతా పక్కా టైం పాస్ పల్లీబఠానీ…
  • రోడ్ల గుంతలా మజాకా… పెద్ద పెద్ద కంపెనీల్నే తరిమేస్తున్నయ్…
  • సేమ స్టోరీ… సేమ్ ప్రచారం… సేమ్, అప్పట్లో శ్రీదేవి… ఇప్పుడు దీపిక…
  • గెలిచానని నవ్వనా… ఏడ్వనా… మనసా కవ్వించకే నన్నిలా..!
  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions