సినిమాకు మౌత్ టాక్ బాగుంది, అందరూ అభినందిస్తున్నారు, కానీ మీడియాలో నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారు అనే దిల్ రాజు ఆరోపణో, ఆవేదనో, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదో కాదు… ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించిన మరో సినిమా సంబంధ వార్త ఇంట్రస్టింగు అనిపిస్తోంది… ఎస్, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్‌కు సంబంధించి భీకరంగా ఉద్దేశపూర్వకంగా రివ్యూ బాంబింగ్ జరిగిందనేది నిజం… అదెలా తప్పో మనం కూడా ముచ్చటించుకున్నాం… అక్కడి వరకూ దిల్ రాజు ఆవేదనకు అర్థముంది… దానికి సంబంధం లేని మరో సోషల్ చర్చ ఏమిటంటే..?
ఫ్యామిలీ స్టార్ సినిమా దర్శకుడు పరుశురాం నిజానికి నాగచైతన్యతో అల్లు అరవింద్‌కు ఒక సినిమా చేయడానికి అంగీకరించాడట… తరువాత హఠాత్తుగా దిల్ రాజు క్యాంపులో చేరి, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాకు కమిటయ్యాడట… ఇప్పుడు సినిమా ఫ్లాపు కావడంతో నాగచైతన్య, మెగా అభిమానులు ఖుషీ పోస్టులు ‘మంచిగైంది’ అని వెక్కిరిస్తూ పెడుతున్నారట…
సినిమా ఫ్లాపయినందుకు కాదు, అల్లు అరవింద్ నన్ను చూసి నవ్వేట్టు అయిపోయింది కదా అని దిల్ రాజు ఆవేదన అట… నిజానికి ఇక్కడ దిల్ రాజు తప్పేమీ లేదు… తను సినిమా వ్యాపారి, అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికసాయం చేశాడట, ఆ డేట్స్ ఉన్నట్టున్నయ్… పరుశురాంతో మరో గీతగోవిందం చేస్తే ఓ హిట్ వస్తుంది, అసలే ఈమధ్య తనకు హిట్ సినిమాలు లేవు కదా అని ప్లాన్ చేసినట్టున్నాడు…
Ads
ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్… దీనికి అల్లు అరవింద్ ఏదో బాధపడిపోయి, పరుశురాంకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుని, తరువాత ఎందుకో విరమించుకున్నాడట… నాగ చైతన్య కూడా పరుశురాంతో టైమ్ వేస్ట్ అని వ్యాఖ్యానించాడట… అనవసరంగా తన టైమ్ తిన్నందుకు నాగచైతన్యకు అసహనం రావడంలో తప్పులేదు… కానీ అల్లు అరవింద్ ఆ దర్శకుడికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడు అనేదే డౌట్…
ఎందుకంటే..? తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న నలుగురైదుగురిలో దిల్ రాజు, అల్లు అరవింద్ ఇద్దరూ ఉంటారు… అప్పుడప్పుడూ కొన్ని బేధాభిప్రాయాలు వచ్చినా సరే, వాటిని తమ సంబంధాలు దెబ్బతినేలా పెంచుకోరు… ఇండస్ట్రీలో ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ నడవాల్సిన వాళ్లే… ఇక్కడ నిజానికి పరుశురాం చేసింది కూడా తప్పో ఒప్పో తెలియని స్థితి… అల్లు అరవింద్, నాగచైతన్యలకు ఇచ్చిన కమిట్‌మెంట్ వదిలేసి దిల్ రాజు వైపు వెళ్లిపోవడం తన క్రెడిబులిటీని తనే దెబ్బతీసుకోవడం, రేప్పొద్దున ఏ స్టార్ హీరో, ఏ బడా నిర్మాత తనను అంత తేలికగా నమ్మరు ఇక…
దానికితోడు ఫ్యామిలీ స్టార్ సినిమాను అడ్డదిడ్డంగా చుట్టేయడంతో గీతగోవిందం తాలూకు క్రెడిట్ కూడా కోల్పోయాడు… సినిమా హిట్టయితే మరిన్ని చాన్సులు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్లు… ఇప్పుడు అటూఇటూ గాకుండా, రెంటికీ చెడ్డ రేవడిలా తయారైపోయాడు… ఫ్యామిలీ స్టార్ సినిమా కథలాగే..!!
Share this Article