.
దిల్ రాజు… వాడెంత వీడెంత అని తీసిపారేసే బాపతు… హీరో నితిన్ గురించి ఓ మాటన్నాడు… ఓ రేంజుకు ఎదగలేకపోయావు అని… అక్కడితో ఆగితే వోకే… అది నిజం కాబట్టి… ఇండస్ట్రీలో అలా నిష్కర్షగా అభిప్రాయాలు చెప్పేవాళ్లు కూడా కరువు కాబట్టి…
కాకపోతే దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు.,. కానీ మరికొన్ని మాటలూ చెప్పాడు… ‘నేను నీకన్నా జూనియర్, నేనిప్పుడు ఎక్కడున్నాను, నువ్వెక్కడున్నావు’ అని…
Ads
రాబోయే తమ్ముడు సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలో… అదీ నితిన్ సరదాగా చేసిన ఇంటర్వ్యూలో… ప్రతి పదంలోనూ అహం… పొగరు… ఇంకో మాట ఏదైనా చెప్పండి… అదే కనిపిస్తోంది దిల్ రాజు వ్యాఖ్యల్లో…
పెరిగీ పెరిగీ విరుగుతాయి కొన్ని… విరిగే క్షణం వచ్చేవరకూ ఇంకేమీ కనిపించదు… అదే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బలమైన సినిమా డిస్ట్రిబ్యూటర్… దిల్ రాజు, ఆయన సేమ్ నిజామాబాద్ జిల్లాయే… అసలు ఒక నటుడితో నిర్మాత పోలిక ఏమిటి..?
పైగా ఎవరి అదృష్టం వాళ్లది… అంతమాత్రాన నువ్వు బన్నీలాగా గొప్ప హీరో అవుతావు అనుకున్నాను, కాలేకపోయావు అనే వ్యాఖ్యానాలు అబ్సర్డ్… ఇప్పుడు సాగుతున్నది కాబట్టి ఈ మాటలన్నీ… విరిగిపడిన రోజు తెలుస్తుంది…
తమ్ముడు సినిమా తీసింది నువ్వే… సేమ్ సామాజికవర్గం, సేమ్ ఫీల్డ్… సేమ్ జిల్లా… సేమ్ నేపథ్యం… మరెందుకు ఈ పిచ్చి కూతలు..? నాలుగు మంచి మాటలు మాట్లాడలేడా..?
ఎస్… బలమైన సినిమా కుటుంబ నేపథ్యం ఉండీ ఫెయిలైన వారసులు బోలెడు మంది… వాళ్లతో పోలిస్తే నితిన్ కాస్త నయం… ఈరోజుకూ హీరోగా ఉన్నాడు ఫీల్డులో… మరీ దిల్ రాజు సర్టిఫికెట్లు అవసరం లేదు… కాకపోతే తనకు తగిన కథల్ని ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్యూర్ నితిన్…
అప్పుడెప్పుడో జయం, సై… కొత్త దర్శకులు, నితిన్ కూడా పిల్లాడే అప్పుడు… నటన ఏమిటో తెలియదు… డబ్బులున్నాయి, కుటుంబ సినిమా నేపథ్యం ఉంది… అంతే… తరువాత కూడా గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్… కాస్త నయం, ఏళ్ల తరబడీ హిట్ లేని కాలంలో… కరకుగా చెప్పాలంటే నిత్యా మీనన్ మోసిన సినిమాలు అవి…
2016లో అఆ అనే సినిమా కాస్త మెరుపు… తరువాత అంతా చీకటే… ప్రయోగాలు చేతకానితనం… తనను తాను మోడరన్ నటుడిగా మోల్డ్ చేసుకోలేనితనం.,. ఫైర్ లేదు… తపన లేదు… ప్యాషన్ లేదు… సో, వరుసగా సినిమాలన్నీ తన్నేస్తున్నాయి… చాలా పేలవమైన కెరీర్…
ఐనంతమాత్రాన దిల్ రాజు తనను కించపరచాలనేముంది..? మరి తననెందుకు తీసుకున్నట్టు..? ఇప్పుడు ఈ మాటలు దేనికి..? అల వైకుంఠపురంలో, పుష్ప లేకపోతే అర్జున్ కూడా అంతే కదా… తన లక్ బాగుంది… తను ప్లస్ నితిన్, ఇద్దరిదీ బలమైన సినిమా కుటుంబ నేపథ్యమే… అంతే… అల్లు అర్జున్‌తో నితిన్ పోల్చి, నువ్వు ఎదగలేకపోయావురా అని కామెంట్ చేయడం ఖచ్చితంగా దిల్ రాజు అహాన్ని సూచిస్తోంది…!!
Share this Article