ఇది ది హన్స్ ఇండియా పత్రికలో కనిపించిన వార్త… దీని సారాంశం ఏమిటంటే..? ‘‘వైశ్యులపై కరోనా ఎక్కువ ప్రభావం ఉంటోంది…! వ్యాధి సోకడంలో గానీ, సీరియస్ కావడంలో గానీ, మరణాల్లో గానీ…’’ ఎస్, దీన్ని ఖండించాల్సిన పనిలేదు… ఇది ఓ జనరల్ అబ్జర్వేషన్… వైశ్యుల్లోని చాలామంది చెబుతున్నదీ అదే… పాండెమిక్ పరిశీలకులు కూడా…! అయితే ఎందుకు..? వైశ్యులు ఎందుకు కరోనా వైరస్‌కు ఈజీ టార్గెట్ అవుతున్నారు..? ఎందుకు ఒక్క కులమే ససెప్టబుల్..? వైరస్ కులం చూడదు, మతం చూడదు, ప్రాంతం చూడదు, వయస్సు చూడదు, డబ్బు చూడదు, హోదా చూడదు, నిజమే… కానీ ఎందుకిలా..? ఇంట్రస్టింగు కదా..! ఈ కోణంలో సరైన డేటాను ఎవరూ శాస్త్రీయంగా విశ్లేషించలేదు, ఆ కారణాల లోతుల్లోకి వెళ్లలేదు కానీ… కొన్ని సాధ్యాసాధ్యాలు, అపోహల గురించి మాత్రం చెప్పుకోవాలి… జస్ట్, ఓ అకడమిక్ డిస్కషన్ మాత్రమే… ఎందుకంటే..? ఇది ఒక జనరల్ అబ్జర్వేషనే తప్ప, నిర్ధారిత వాస్తవం కాదు కాబట్టి…!!
ఈ వార్తాకథనం ప్రధానంగా ఏమంటుందంటే..? ‘‘ఒకే కులంలో పెళ్లిళ్లు జరగడం… అనారోగ్యకరమైన జీవనశైలి’’… కాస్త వివరాల్లోకి వెళ్దాం… 1) ఒకే కులంలో పెళ్లిళ్లు జరగడం అనేది అన్ని కులాల్లోనూ ఉన్నదే… బయటి రక్తం కలవకపోవడం కొంత జన్యునాణ్యతను దెబ్బతీస్తున్నది అనేది చాలాకాలంగా ఉన్న వాదనే… కానీ అది వైశ్యులకు మాత్రమే వర్తించేది కాదు… పైగా వైశ్యుల్లో కులాంతర వివాహాల సంఖ్య రెండుమూడు తరాలుగా బాగా పెరిగిపోయింది… ఇక అనారోగ్యకరమైన జీవనశైలి అనేది గతం… ఎక్కువగా షాపుల్లోనే కూర్చుని ఉండటం, వేరే దైహిక శ్రమ లేకపోవడం, దానివల్ల రోగనిరోధకశక్తి కోల్పోవడం… అదీ సరైన రీజన్ కాదు… ఇది చింతామణి, సుబ్బిశెట్టి కాలం కాదు… షాపులు వైశ్యేతరులు కూడా విపరీతంగా పెడుతున్నారు… వైశ్యులు అనేక రంగాల్లోకి డైవర్సిఫై అవుతున్నారు… ప్రత్యేకించి ఉద్యోగాలపైనే కొత్తతరాలు మక్కువ చూపిస్తున్నయ్… లైఫ్ స్టయిల్‌కు సంబంధించి అందరిలాంటి బతుకులే… పైగా మనిషి ఆరోగ్యం అనేది ఆయా వ్యక్తుల బాడీ కాన్స్టిట్యూషన్ను బట్టి ఉంటుంది… దాన్ని బట్టే వ్యాధులు, రోగనిరోధకశక్తి ఎట్సెట్రా… సో, ఈ కారణమూ కరెక్టు కాకపోవచ్చు…
Ads
షాపులు ఎక్కువ సేపు తెరిచి ఉంచడం, నిత్యావసరాలకు సంబంధించిన రిటెయిల్ షాపులు ప్రధానంగా వైశ్యులవే కాబట్టి…. ఎక్కువ కంటాక్టుల ప్రమాదం ఉంది కాబట్టి… కరోనా అంటుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటోంది అనే అభిప్రాయం కాస్త రీజనబులే… కానీ షాపులున్న ఇతర కులాల వారికీ ఆ డేంజర్ ఉంది కదా…. మరొక కారణం, వైశ్యులు శాకాహారులు, నీడపట్టున ఉంటారు… కోవిడ్ నిరోధకానికి కావల్సిన బీ12, డీ విటమిన్ గట్రా శాకాహారంతో దొరకవు అనేది ఆ వాదన… వైశ్యుల్లో మాంసాహారం రెండుమూడు తరాలుగా బాగా పెరిగింది… ఐనా శాకాహారులు కేవలం వైశ్యులు మాత్రమే కాదు కదా… ఇతర కులాలూ ఉన్నాయి… మరి వాళ్లకు కూడా ఈ బెడద ఎక్కువగా ఉండి ఉండాలి కదా…!! మరో ప్రధాన కారణం వైశ్యుల్లో ఓ జెనెటిక్ డిజార్డర్ (Butyrylcholinesterase (BChE) deficiency)… ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమే… కొన్ని లోకల్ అనస్తీషియా రకాలు వైశ్యులకు పడవు లేదా పనిచేయవు… అందుకే సీనియర్ డాక్టర్లు, అనస్తీటిస్టులు మత్తుమందు ఇచ్చే ముందు ‘మీరు వైశ్యులా..?’ అనడిగేవారు… ఇప్పుడు అదీ పెద్దగా లేదు… అందరిలాగే…! సో, అదీ రీజన్ కాకపోవచ్చు… మరి..?
నిజానికి పైకి దృఢంగా కనిపించేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారనేది భ్రమ… వాళ్ల జోలికి కరోనా రాదు అనేది కూడా భ్రమే… మన బాడీలోని బ్లడ్ గ్రూపు, మనకున్న వ్యాధులు వంటి చాలా కారణాలుంటయ్… ఉదాహరణకు గ్లైసిన్ తక్కువ కాబట్టి ఏ‘’ బ్లడ్ గ్రూపు వాళ్లు త్వరగా కోవిడ్‌కు ప్రభావితమవుతారు అనే ఓ అంచనా ఉంది… జనరల్‌గా ‘ఓ’ బ్లడ్ గ్రూపు వాళ్లకు వైరసుల దాడి తక్కువ అంటుంటారు… ఇంకా చాలా పరిశోధనలు సాగాలి… నిజమో, అబద్ధమో తేలాలంటే…! కానీ వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం బ్లడ్ గ్రూపులతో ఏ సంబంధమూ లేదు, ఏ తేడా లేదు… ఇప్పుడు కరోనా అందరినీ కాటేస్తూనే ఉంది సమానంగా… దాని పవర్ అదీ…!! కానీ వైశ్యులపై నిజంగానే ఎక్కువ ప్రభావం ఉంటే మటుకు ఈ కరోనా ఉధృతి తగ్గాక డేటా విశ్లేషణ, సరైన కారణాల శాస్త్రీయ అన్వేషణ అవసరమే… రాబోయే రోజుల్లో కమ్యూనిటీ టార్గెటెడ్ వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి..!! లేదా కమ్యూనిటీ బేస్డ్ విక్టిమ్స్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి…!! మరి ఇప్పుడు ఏం చేయాలి..? వైశ్యులే కాదు, అందరూ జాగ్రత్తగానే ఉండాలి… అందరివీ ప్రాణాలే…!!
Share this Article